BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kadapaaa447fb0-d725-4369-88e0-fb130be93ad9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kadapaaa447fb0-d725-4369-88e0-fb130be93ad9-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసును విచారిస్తున్న సీబీఐ త‌న ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసింది. క‌రోనా రెండోద‌శ త‌ర్వాత కాస్తంత విరామం తీసుకున్న త‌ర్వాత ప్రారంభ‌మైన విచార‌ణ నేటికీ కొన‌సాగుతోంది. నిర్విరామంగా 76 రోజులుగా సీబీఐ చేస్తున్న ద‌ర్యాప్తులో కొత్త విష‌యాలేమీ వెల్ల‌డికావ‌డంలేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే నిందితుల ఆచూకి చెబితే రూ.5 ల‌క్ష‌ల రివార్డు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంపై విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. సీబీఐ అధికారులు ఆదివారం క‌డ‌ప సెంట్ర‌ల్ జైలుకు చేరుకున్నారు. జైలుకు చెందkadapa{#}CBI;sunday;Ministerకడ‌ప సెంట్ర‌ల్ జైల్‌లో సీబీఐ..!!కడ‌ప సెంట్ర‌ల్ జైల్‌లో సీబీఐ..!!kadapa{#}CBI;sunday;MinisterSun, 22 Aug 2021 13:02:00 GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసును విచారిస్తున్న సీబీఐ త‌న ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసింది. క‌రోనా రెండోద‌శ త‌ర్వాత కాస్తంత విరామం తీసుకున్న త‌ర్వాత ప్రారంభ‌మైన విచార‌ణ నేటికీ కొన‌సాగుతోంది. నిర్విరామంగా 76 రోజులుగా సీబీఐ చేస్తున్న ద‌ర్యాప్తులో కొత్త విష‌యాలేమీ వెల్ల‌డికావ‌డంలేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే నిందితుల ఆచూకి చెబితే రూ.5 ల‌క్ష‌ల రివార్డు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంపై విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. సీబీఐ అధికారులు ఆదివారం క‌డ‌ప సెంట్ర‌ల్ జైలుకు చేరుకున్నారు. జైలుకు చెందిన అతిథిగృహంలో పులివెందుల‌కు చెందిన పుర‌పాల‌క శాఖ ఉద్యోగులు గంగుల‌య్య‌, సురేష్‌, క‌డ‌ప కు చెందిన ప్ర‌యివేటు సంస్థ ఉద్యోగి జ‌గ‌దీశ్వ‌ర‌రావును విచారించారు. మ‌రికొంత‌మంది అనుమానితుల‌ను కూడా పిలిచార‌ని, వారిని కూడా విచారించే అవ‌కాశం ఉందంటున్నారు. 76 రోజులుగా కొన‌సాగుతున్న ద‌ర్యాప్తుల్లో సీబీఐ అధికారులు తేల్చిందేమీ లేద‌ని, ఎస్పీ అధికారిని బ‌దిలీచేసి డీఎస్పీ స్థాయి అధికారికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై కూడా ఆరోప‌ణ‌లొస్తున్నాయి. మార‌ణాయుధాలు దొరికాయా?  లేదా? అన్న విష‌యం కూడా స్ప‌ష్ట‌త లేకుండా కొన‌సాగుతున్న ద‌ర్యాప్తుపై ఇప్ప‌టికే వివేకా కుటుంబ స‌భ్యులు పెద‌వి విరుస్తున్నారు.



వీడియో: రాఖీ రోజున చెల్లెలపై ప్రేమ కురిపించిన చిరు!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>