PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpabe09127-65b8-4e00-b884-4e625b73a0d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpabe09127-65b8-4e00-b884-4e625b73a0d6-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ పెత్తనం ఎక్కువైందనే సంగతి క్లియర్‌గా తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసు మీద పడటం...భవిష్యత్‌లో పార్టీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలని చూడాలని అనుకుంటున్న నేపథ్యంలో....గత కొన్నేళ్లు నుంచి చినబాబుని పార్టీలో కీలకం చేశారు. అందుకే గతంలో అధికారంలో ఉండగా, ఎమ్మెల్సీ ఇచ్చి మరీ చినబాబుని మంత్రి చేశారు. tdp{#}Lokesh;Lokesh Kanagaraj;S Radhakrishna;Dookudu;Nara Lokesh;Minister;MLA;politics;Hanu Raghavapudi;TDP;Partyకొంపముంచుతున్న చినబాబు...ఆ గుమస్తాలు ఎవరు?కొంపముంచుతున్న చినబాబు...ఆ గుమస్తాలు ఎవరు?tdp{#}Lokesh;Lokesh Kanagaraj;S Radhakrishna;Dookudu;Nara Lokesh;Minister;MLA;politics;Hanu Raghavapudi;TDP;PartySun, 22 Aug 2021 01:00:00 GMTతెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ పెత్తనం ఎక్కువైందనే సంగతి క్లియర్‌గా తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసు మీద పడటం...భవిష్యత్‌లో పార్టీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలని చూడాలని అనుకుంటున్న నేపథ్యంలో....గత కొన్నేళ్లు నుంచి చినబాబుని పార్టీలో కీలకం చేశారు. అందుకే గతంలో అధికారంలో ఉండగా, ఎమ్మెల్సీ ఇచ్చి మరీ చినబాబుని మంత్రి చేశారు.

అయితే ఎన్ని చేసిన చినబాబు నాయకుడుగా ఎదగలేకపోయారు. పైగా 2019 ఎన్నికల్లో లోకేష్ ఘోరంగా ఓడిపోయారు. ఇక ఇక్కడ నుంచే లోకేష్‌లో దూకుడు పెరిగింది. మాట తీరు, బాడీ తీరు సైతం మార్చుకుని దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అధికార వైసీపీపై నిత్యం పోరాడుతూనే ఉన్నారు. అదే సమయంలో పార్టీని కూడా చినబాబే నడిపిస్తున్నారని తెలుస్తోంది.

చంద్రబాబు వెనుక ఉండి సలహాలు ఇవ్వడానికే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ఇక లోకేష్ పార్టీలో లీడ్ తీసుకుని ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో లోకేష్ అవలంభిస్తున్న కొన్ని విధానాల వల్ల, కొందరు నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్, సీనియర్లని పెద్దగా పట్టించుకోవడం లేదని, వారికి తగిన గౌరవం ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతుంది. అందుకే చాలామంది సీనియర్ నాయకులు చినబాబు విషయంలో అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఆ అసంతృప్తిని తాజాగా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ బయటపెట్టేశారు. పార్టీలో తన మాటకు గౌరవం లేదని, పార్టీలో న్యాయం జరగట్లేదని చంద్రబాబు, లోకేష్‌లకు చెప్పిన పట్టించుకోవడం లేదని బుచ్చయ్య మాట్లాడుతున్నారు. అందుకే ఆయన పార్టీని వీడటానికి సిద్ధమైనట్లు ప్రకటించారు.

ముఖ్యంగా లోకేష్ విషయంలో బుచ్చయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పై నుంచి లోకేష్ ఆర్డర్లు ఇవ్వడం...కింద ఉన్న కొందరు గుమస్తాలు...అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి సీనియర్ నాయకులకు గైడెన్స్ ఇవ్వడం ఏ మాత్రం సమంజసంగా లేదని అంటున్నారు. అంటే చినబాబు టీం...సీనియర్లని బాగానే ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బుచ్చయ్య భరించలేక బయటకొచ్చి, పార్టీ విధానాలని ఎండగట్టారు. అయితే ఈ పద్ధతి మార్చుకోకపోతే పార్టీ నష్టం పోవడం గ్యారెంటీ అని బుచ్చయ్య అంటున్నారు. మొత్తానికి చినబాబే టీడీపీ కొంపముంచేలా కనిపిస్తున్నారు.  



కొంపముంచుతున్న చినబాబు...ఆ గుమస్తాలు ఎవరు?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>