MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama57439f94-6dbb-46ca-80b6-9d883e300b40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama57439f94-6dbb-46ca-80b6-9d883e300b40-415x250-IndiaHerald.jpgఅందం అన్నది అద్దం చెప్పాలి. ఆ అద్దానికే అసూయ కలిగే అందం ఉంటే. సొగసుకే సెగలు పుట్టించే సౌందర్యం సుదతి సొంతమైతే. ఆమెను అలా కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. కళ్ళతోనే అలా అందం తాగేస్తూ అమృతం తాగిన దేవతలుగ నిలిచిపోవాలనిపిస్తుంది. anupama{#}Kerala;Mohandas Karamchand Gandhi;Makeup;Bapu;Tollywood;Directorఅనుపమా.. కళ్ళార్పతరమా... ?అనుపమా.. కళ్ళార్పతరమా... ?anupama{#}Kerala;Mohandas Karamchand Gandhi;Makeup;Bapu;Tollywood;DirectorSun, 22 Aug 2021 20:00:00 GMTఅందం అన్నది అద్దం చెప్పాలి. ఆ అద్దానికే అసూయ కలిగే అందం ఉంటే. సొగసుకే సెగలు పుట్టించే సౌందర్యం సుదతి సొంతమైతే. ఆమెను అలా కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది.

కళ్ళతోనే అలా అందం తాగేస్తూ అమృతం తాగిన దేవతలుగ నిలిచిపోవాలనిపిస్తుంది. టాలీవుడ్ లో అందగత్తెలకు లోటు లేదు. ఎందరో ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన కోణంలో మెరిసే అందం. ఇవన్నీ పక్కన పెడితే కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ అందం చూస్తే మతి పోవాల్సిందే అంటారు. ఆమెది ట్రెడిషనల్ బ్యూటీ. ఆమె చీర కడితే, బొట్టు పెడితే నల్లని కురులు అలా విరబూస్తూ అలా అర నవ్వు నవ్వితే మన్మధుడు సైతం బాణాలు వేయడం మరచిపోతాడు ఆమెనే అపర రతీదేవిలా భ్రమించి చూస్తూండిపోతాడు.

అనుపమ అందం ఏంటో టాలీవుడ్ సినిమాల్లో మేకర్స్ చూపించారు. ఆమె కూడా సౌందర్యరాశిలా మెరిసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఆమె వాటి కంటే కూడా బయట నాచురల్ గా కనిపిస్తేనే ఇంకా అధిక అందంతో చూసే కళ్లను తరింపచేస్తుందని అంటారు. మేకప్ ఆర్భాటాలు లేకుండా కూడా కనిపించే అందం ఆమెది అంటారు. అందానికే ఆమెను చూస్తే కన్నెర్ర అని కూడా చెప్పాలేమో

ఇంతటి అందగత్తెకు తగిన పాత్రలు టాలీవుడ్ లో రాకపోవడం బాధాకరమే. ఇక ఆమె చేసిన సినిమాలు కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో కెరీర్ మాత్రం అలా సో సో గా నడుస్తోంది. ఏది ఏమైనా ఆమె అందాన్ని ఎలివేట్ చేయాలి అంటే బాపు లాంటి డైరెక్టర్ ఉండాలి. కానీ ఆమె ఈ తరంలో పుట్టిన అమ్మడు. దాంతో ఆమెకు అవకాశాలు కానీ హిట్లు కానీ లభించడంలేదు అంటున్నారు. ఏదో రోజు మాత్రం అనుపమ రోజు అవుతుంది అని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. మరి చూడాలి ఈ అమ్మడు లక్ ఎలా ఉందో.







ముఖ్య‌మంత్రి గారూ.. ఉరిశిక్ష ఎప్పుడు?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>