MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/pawan-kalyane0a33ae4-5411-4ec8-aa83-70268b44a1c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/pawan-kalyane0a33ae4-5411-4ec8-aa83-70268b44a1c3-415x250-IndiaHerald.jpgమెగాస్టార్‌ చిరంజీవికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షని... చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి స్ఫూర్తి ప్రదాత, ఆదర్శప్రాయులు అని కొనియాడారు పవన్‌ కళ్యాణ్‌. చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయని... ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టమని తెలిపారు. అన్నయ్యను అభిమానించి ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని అని వెల్లడించారు. ఆయనను చూస్తూ.. ఆయన సిchiranjeevi{#}kirti;central government;Janasena;workers;Annayya;kalyan;Telugu;Cinema;Chiranjeeviచిరంజీవి తమ్ముడిగా పుట్టడం అదృష్టం !చిరంజీవి తమ్ముడిగా పుట్టడం అదృష్టం !chiranjeevi{#}kirti;central government;Janasena;workers;Annayya;kalyan;Telugu;Cinema;ChiranjeeviSun, 22 Aug 2021 10:53:00 GMTమెగాస్టార్‌ చిరంజీవికి  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు.  అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షని... చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి   స్ఫూర్తి ప్రదాత, ఆదర్శప్రాయులు అని కొనియాడారు పవన్‌ కళ్యాణ్‌.  చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయని...  ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను  చూస్తూ పెరగడం మరో అదృష్టమని తెలిపారు.
అన్నయ్యను అభిమానించి ఆరాధించే   లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని అని వెల్లడించారు.  ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ... ఆయన ఉన్నతిని కనులార చూశానన్నారు.  ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడని... ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణమని పేర్కొన్నారు.

 '' భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా... తెలుగు సినిమాను భారత చలనచిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా.. అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా... నందులు తరలి వచ్చినా... పద్మభూషణ్ గా కీర్తి గడించినా.. చట్ట సభ సభ్యునిగా.. కేంద్ర మంత్రిగా పదవులను ఆలంకరించినా.. ఆయన తల ఎగరేయలేదు. విజయాలు ఎన్ని సాధించినా.. రికార్డులు ఎన్ని సృష్టించినా అదే విధేయత, అదే వినమ్రత  చిరంజీవి గారి సొంతం.'' అని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు.  

అందువల్లేనేమో ఆయనను సొంత మనిషిలా లక్షలాది మంది భావిస్తారన్నారు. విద్యార్థి దశలోనే సేవాభావాన్ని చిరంజీవి పెంపొందించుకున్నారని తెలిపారు.  నాడు రక్త నిధిని, నేడు ప్రాణ వాయువు నిధిని స్థాపించి... కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువునిస్తూ తనలోని సేవాగుణాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారని కొనియాడారు. ఆపదలో ఎవరైనా వున్నారంటే ఆదుకోవడంలో ముందుంటారని... దానాలు.. గుప్తదానాలు ఎన్నో చేశారు... చేస్తూనే వున్నారని తెలిపారు పవన్‌.   కరోనాతో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపనపడ్డారని...  అందువల్లే సినీ కార్మికులు అందరూ  చిరంజీవి గారిని తమ నాయకునిగా ఆరాధిస్తున్నారన్నారు.   వర్తమాన చరిత్రగా ఆయన జీవితాన్ని లిఖిస్తున్నారని తెలిపారు.



చిరంజీవికి ఈ ఆటంటే మహాప్రాణమట ..!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>