MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/megastar-chiranjeevi4608af79-2886-4a3f-89ec-d51963037012-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/megastar-chiranjeevi4608af79-2886-4a3f-89ec-d51963037012-415x250-IndiaHerald.jpgచిరంజీవి సకల కళా వల్లభుడు. ఈయన ప్రతిభ అనంతం. నటన, డాన్స్, హావభావాలు, అభినయం, అందం, డైలాగ్స్ ఇలా ఒక్కటేమిటి లోపం లేని శిల్పాన్ని చెక్కి జీవం పోసి చిరంజీవి అని ఆశీర్వదించి ఈ భూమిపై ఆ బ్రహ్మ వదిలి పెట్టిన శిల్పమే మెగాస్టార్ చిరంజీవి అంటారు అందరూ. అంతగా ఆయన టాలెంట్, రూపం ప్రతీది ప్రత్యేకమే. MEGASTAR CHIRANJEEVI{#}Sri Venkateswara swamy;Chiranjeevi;Ram Charan Teja;Allu Arjun;Cinema;Teluguచిరంజీవి గొప్ప డాన్సర్ కావడానికి కారణం ఎవరో తెలుసా ?చిరంజీవి గొప్ప డాన్సర్ కావడానికి కారణం ఎవరో తెలుసా ?MEGASTAR CHIRANJEEVI{#}Sri Venkateswara swamy;Chiranjeevi;Ram Charan Teja;Allu Arjun;Cinema;TeluguSun, 22 Aug 2021 08:00:00 GMTచిరంజీవి సకల కళా వల్లభుడు. ఈయన ప్రతిభ అనంతం. నటన, డాన్స్, హావభావాలు, అభినయం, అందం, డైలాగ్స్ ఇలా ఒక్కటేమిటి లోపం లేని శిల్పాన్ని చెక్కి జీవం పోసి చిరంజీవి అని ఆశీర్వదించి ఈ భూమిపై ఆ బ్రహ్మ వదిలి పెట్టిన శిల్పమే మెగాస్టార్ చిరంజీవి అంటారు అందరూ. అంతగా ఆయన టాలెంట్, రూపం ప్రతీది ప్రత్యేకమే. ముఖ్యంగా డాన్స్, చిరు వేసే స్టెప్పుల్లో, ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది, ఆ మ్యాజిక్ అందరినీ కట్టిపడేస్తుంది. చిరంజీవి తన స్టెప్పులతో డాన్స్ లో  కొత్త ఒరవడిని సృష్టించారు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి చిరంజీవి స్టెప్పులు మొదట్లో  సాధారణంగా ఉండేవట...ఆయన డాన్స్ ను ఒక వ్యక్తి విమర్శించారట.  అప్పుడే చిరు డాన్స్ లోని ఆ స్టైల్ మేలుకొంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే. చిరంజీవి అప్పటికి కేవలం  నాలుగు చిత్రాలు మాత్రమే చేశారు. చిరు కెరీర్ ను ప్రారంభించిన తొలినాళ్ళవి. మెగాస్టార్ సినిమా పాట షూటింగ్ లో ఉన్నారు. ఆ పాటకు తనదైన స్టైల్ లో స్టెప్పులు వేస్తున్నారు చిరు. అక్కడున్నవారంతా చిరు స్టెప్పులు చూసి విజిల్స్ వేస్తున్నారు. 

కానీ ఓ వ్యక్తి మాత్రం చాలా మౌనంగా చూస్తున్నాడు. ఆయనే ఎస్పీ వెంకన్న ఆ చిత్రానికి  మేనేజర్. అయితే చిరంజీవి ఆయన దగ్గరకు వెళ్లి ఏంటి అలా చూస్తున్నారు డాన్స్ ఎలా ఉంది అని అడగ్గానే... ఏముంది నీ వెనుక ఉన్న డ్యాన్సర్లు ఏం చేస్తున్నారు నువ్వు అదే చేస్తున్నావ్ అక్కడ మీ డాన్స్ లో ప్రత్యేకత కనబడడం లేదు అని అన్నారట. ఆ సద్విమర్శను సలహాగా భావించి ఆలోచనలో పడ్డారు చిరంజీవి. డాన్స్ లో తనకంటూ ప్రత్యేకత చూపాలనుకున్నారు. కొత్తదనంతో డాన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అప్పటి నుంచి షూటింగ్ అయిపోగానే రూమ్ కి తిరిగి వెళ్లి పాటలు పెట్టుకుని వాటిని ఆస్వాదిస్తూ డాన్స్ చేయడం మొదలుపెట్టారు. అలా అలా తన ఫీలింగ్స్ ను డాన్స్ లో కనపడేలా చేసుకుంటూ వచ్చారు. వెంకన్న  సద్విమర్శను సాదరంగా స్వీకరించి సాధన చేశారు చివరికి అనుకున్నది సాధించారు. డాన్స్ లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టి  డాన్స్ లో ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలిచారు.

ఒక విమర్శను స్పోర్టివ్ గా తీసుకుని వాటిని అధిగమించే  గొప్ప కృషి పట్టుదల చిరుకి సొంతం.  ఆ తర్వాత అదే ఎస్ పీ వెంకన్న నిర్మాతగా మారాక చిరంజీవి హీరోగా "దొంగ మొగుడు" సినిమా తీసి ఎన్నో అద్భుతమైన డాన్స్ స్టెప్పులతో వెంకన్నను అబ్బురపరిచే. ఈయన లాగే డాన్స్ చేయాలని ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో అనుకొని వారుండరంటే  అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో తన బ్రేక్ డాన్స్ లతో థియేటర్లు దద్ధరిల్లి పోయాయి. ఈయనను చూస్తూ డాన్స్ లో పాటలు నేర్చుకున్న తన కుమారుడు రామ్ చరణ్ తేజ్ మరియు అల్లుడు అల్లు అర్జున్ డాన్స్ లో అగ్ర స్థాయిలో ఉన్నారు. ఈ రోజు చిరంజీవి తమ 66 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.  హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి



మెగాస్టార్ ఫ్యామిలీకి అన్ని నష్టాలా..? ఈ విషయం ఫ్యాన్స్ కు తెలిస్తే..?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>