HistoryMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history-664e6e68-d12c-436e-a14e-9eaa71639e39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history-664e6e68-d12c-436e-a14e-9eaa71639e39-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో పెళ్లికాకముందు, పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజులు మాత్రమే రాఖీ కడుతున్న వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. దూరప్రాంతాల్లో ఉన్నవారికి కొరియర్ లేదా పోస్టు ద్వారా రాఖీ పంపిస్తూ, దగ్గరలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి రాఖీ కడుతూ తమ ఆప్యాయతలను పంచుకుంటున్నారు. ఈ విధంగా రాఖీ పండుగ పర్వదినాన్ని ఈ సంవత్సరం వైభవంగా జరుపుకునే అవకాశం ఉంది.History {#}Tom Banton;Tom Hooper;marriage;festival;Governmentఅనుబంధానికి ప్రతీక రాఖీ..!అనుబంధానికి ప్రతీక రాఖీ..!History {#}Tom Banton;Tom Hooper;marriage;festival;GovernmentSun, 22 Aug 2021 09:13:00 GMTకాలం మారినా దూరం పెరిగిన, చెరగని బంధం అన్నా చెల్లెలు అనుబంధం.. అన్న చెల్లెల అక్కాతమ్ముళ్ల అనురాగాలకు ఆప్యాయతలకు  ప్రతీక రాఖీ పండుగ. జీవితంలో తనకు ఎల్లవేళలా రక్షగా ఉండాలని, సాధకబాధకాల్లో తోడుగా నిలవాలని అక్క చెల్లెలు అన్నదమ్ములకు రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు ఆడబిడ్డలు పుట్టింటికి వెళ్తారు. వీలుకానివారు పోస్టు ద్వారా, ఆన్లైన్ లోను తమ సోదరులకు రాఖీలు పంపుతారు. సోదరీ సోదరులు అనురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. అక్క తమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లకు రాఖి కడితే మేము మీకు రక్షగా నిలుస్తుందని మాట ఇవ్వడం ఈ పండగ ఈ యొక్క పరమార్థం. ఈరోజు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు అక్కాచెల్లెళ్ళు ఆరాట పడుతూ ఉంటారు.

 ఈ బంధం కలకాలం నిలవాలని కోరుకుంటారు. బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మన సంస్కృతిలో ఎన్నో పండుగలు ఉన్నాయి. కానీ ప్రముఖంగా జరుపుకునే ది  రాఖీ పండుగ మాత్రమే. తెలంగాణలో మహిళల ఇష్టంగా జరుపుకొనే పండుగల్లో  రాఖీ పండుగ అని చెప్పడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లలు ఆకర్షించేలా టామ్ అండ్ జెర్రీ, చోటా భీమ్, పోకే మ్యాన్ లాంటి రకరకాల డిజైన్లలో రాఖీలు లభిస్తున్నాయి. అలాగే పెద్దల కోసం ఫ్యాన్సీ గోల్డ్ సిల్వర్ ప్లేటెడ్, రాఖీలు ఆకట్టుకున్నాయి. గతేడాది కరోణ విజృంభణ కారణంగా చాలామందికి పాజిటివ్ వచ్చి రాఖీలు కట్టించుకోలేదు. కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా రావడానికి భయపడ్డారు. సోదరికో సోదరునికో కరోణ పాజిటివ్ వచ్చి రాఖీకి దూరమై ..

వైరస్ మన నుంచి వెళ్లిపోవడంతో పాటు ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఈసారి రాఖీ కట్టేందుకు మహిళలు సమాయత్తమై  రాఖీలు కొనేందుకు వెళ్లడంతో దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది. ప్రస్తుత కాలంలో పెళ్లికాకముందు, పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజులు మాత్రమే రాఖీ కడుతున్న వాళ్ళు చాలామందిని చూస్తున్నాం. దూరప్రాంతాల్లో ఉన్నవారికి కొరియర్ లేదా పోస్టు ద్వారా రాఖీ పంపిస్తూ, దగ్గరలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి రాఖీ కడుతూ తమ ఆప్యాయతలను పంచుకుంటున్నారు. ఈ విధంగా రాఖీ పండుగ పర్వదినాన్ని ఈ సంవత్సరం వైభవంగా జరుపుకునే అవకాశం ఉంది.



నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>