MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhumika-df5af87a-bd3e-4160-b344-4782008275f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhumika-df5af87a-bd3e-4160-b344-4782008275f1-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరోయిన్ భూమిక పుట్టినరోజు సందర్భంగా సంబంధించిన మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే? భూమిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు కొన్ని యాడ్స్ లో నటించింది. అందులో ప్రియదర్శన్ తో కలిసి టోపీ బ్రాండ్ కోసం స్విట్జర్లాండ్ లో యాడ్ ను చిత్రీకరించారు. ఈ యాడ్ లో చూసి "యువకుడు" మేకర్స్ ఆమెను స్క్రీన్ టెస్ట్ కోసం పిలిచారు. అలా హైదరాబాద్ వెళ్ళిన భూమిక "యువకుడు" చిత్రం ద్వారా మొదటి అవకాశాన్ని అందుకుంది. యోగా టీచర్ తో డేటింగ్ సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుBhumika;{#}Switzerland;kalyan;marriage;Kollywood;Pawan Kalyan;CBN;Priyadarshan;bharath;Sri Bharath;Bhumika Chawla;Yoga;Joseph Vijay;Chitram;Heroine;Remake;Cinema;Hyderabadహ్యాపీ బర్త్ డే : భూమిక గురించి మీకు ఈ విషయాలు తెలుసా ?హ్యాపీ బర్త్ డే : భూమిక గురించి మీకు ఈ విషయాలు తెలుసా ?Bhumika;{#}Switzerland;kalyan;marriage;Kollywood;Pawan Kalyan;CBN;Priyadarshan;bharath;Sri Bharath;Bhumika Chawla;Yoga;Joseph Vijay;Chitram;Heroine;Remake;Cinema;HyderabadSat, 21 Aug 2021 10:00:00 GMTసీనియర్ హీరోయిన్ భూమిక పుట్టినరోజు సందర్భంగా సంబంధించిన మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేస్తున్నాం.

ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే?
భూమిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు కొన్ని యాడ్స్ లో నటించింది. అందులో ప్రియదర్శన్ తో కలిసి టోపీ బ్రాండ్ కోసం స్విట్జర్లాండ్ లో యాడ్ ను చిత్రీకరించారు. ఈ యాడ్ లో చూసి "యువకుడు" మేకర్స్ ఆమెను స్క్రీన్ టెస్ట్ కోసం పిలిచారు. అలా హైదరాబాద్ వెళ్ళిన భూమిక "యువకుడు" చిత్రం ద్వారా మొదటి అవకాశాన్ని అందుకుంది.

యోగా టీచర్ తో డేటింగ్
సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న సమయంలోనే భూమిక యోగా క్లాస్ కి వెళ్ళేది. అక్కడే తన యోగ టీచర్ భరత్ ఠాకూర్ ని కలిసింది. వీరిద్దరూ నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారు. 2007లో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికొక బాబు ఉన్నాడు. అయితే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్న విషయం పెళ్లి అయ్యేదాకా సీక్రెట్ గానే ఉంచారు.

పెళ్లి తర్వాత సినిమాలు
వివాహానంతరం భూమిక సినిమాలకు కొంత విరామం ఇచ్చింది. కానీ కొడుకు పుట్టిన తర్వాత కూడా తనకు సినిమాలపై ఆసక్తి ఉందని, మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని తన మనసులోని మాట బయట పెట్టింది. అయితే తమతో పాటు నటించిన సీనియర్ హీరోలు ఇంకా స్టార్ హీరోలు గానే కొనసాగుతున్నారని, హీరోయిన్ల విషయంలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉందని, మారాలని తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా బయటకు చెప్పింది.

పవన్ సినిమా రీమేక్ తో కోలీవుడ్ ఎంట్రీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా "తమ్ముడు" రీమేక్ తో భూమిక కోలివుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో విజయ్ హీరోగా నటించాడు. "బద్రి" టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. భూమికను వరుస అవకాశాలు పలకరించాయి. ఆ తర్వాత పవర్ స్టార్ తో "ఖుషి" సినిమాలో మెరిసింది.

కొడుకు కోసం కొత్త రూల్
భూమిక తన కొడుకు కోసం సినిమాల విషయమై కొత్త రూల్ నియమించుకుంది. సినిమాల్లో తన ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలో పూర్తి స్పష్టత ఉందంటూ ఆమె తెలిపింది. ఒకానొక సమయంలో అదృష్టవశాత్తు నా సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లే. కొడుకుతో కలిసి ధైర్యంగా నా మనను చూడగలను. కాబట్టి నా సినిమాలు అతన్ని ఇబ్బంది పెడతాయేమో అని ఆందోళన లేదు. భవిష్యత్తులో కూడా నా కొడుకుని ఇబ్బంది పెట్టే ఏ పాత్రనూ నేను చేయను అని నిక్కచ్చిగా తేల్చి చెప్పేసింది.



కుటుంబ రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొడుతారు !

కెసిఆర్ కొత్త పథకం.. అందరికీ బైకులు?

బర్త్ డే : నడుము చూసినా చూడకపోయినా... ఆ అమాయకత్వానికే ఫిదా !

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త?

అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>