PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusc2d70020-e932-423c-b21c-b39e606c44f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusc2d70020-e932-423c-b21c-b39e606c44f8-415x250-IndiaHerald.jpgకరోనా తగ్గిపోయింది.. ఇప్పుడు అందరిలోనూ ఇదే ఫీలింగ్.. అందుకే పెద్దగా జనం కరోనా గురించి పట్టించుకోవడం లేదు. అన్ని పనులు యథావిధిగా సాగుతున్నాయి. పెళ్లిళ్లు, పేరంటారు, శుభకార్యాలు అన్నీ జరిగిపోతున్నాయి. మన దేశంలో కేసుల సంఖ్య కూడా పెద్దగా పెరగడం లేదు. ఒక్క కేరళలోనే కరోనా ప్రభావం బాగా కనిపిస్తోంది. అయితే.. మన దగ్గర లేదు కదా అని లైట్ గా తీసుకోకండి.. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ మరోసారి తన సత్తా చాటుతోంది. దీంతో కొంత కాలంగా నెమ్మదించినట్లు కనిపించిన కరోనా మళ్లీ జోరు పెంచుతోంది. కరోనాలో కొత్తగా వcoronavirus{#}Japan;Panjaa;thursday;Coronavirus;septemberకరోనా తగ్గిందనుకుంటున్నారా.. ఈ డెల్టా అరాచకం చూడండి..!కరోనా తగ్గిందనుకుంటున్నారా.. ఈ డెల్టా అరాచకం చూడండి..!coronavirus{#}Japan;Panjaa;thursday;Coronavirus;septemberSat, 21 Aug 2021 07:00:00 GMTకరోనా తగ్గిపోయింది.. ఇప్పుడు అందరిలోనూ ఇదే ఫీలింగ్.. అందుకే పెద్దగా జనం కరోనా గురించి పట్టించుకోవడం లేదు. అన్ని పనులు యథావిధిగా సాగుతున్నాయి. పెళ్లిళ్లు, పేరంటారు, శుభకార్యాలు అన్నీ జరిగిపోతున్నాయి. మన దేశంలో కేసుల సంఖ్య కూడా పెద్దగా పెరగడం లేదు. ఒక్క కేరళలోనే కరోనా ప్రభావం బాగా కనిపిస్తోంది. అయితే.. మన దగ్గర లేదు కదా అని లైట్ గా తీసుకోకండి.. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ మరోసారి తన సత్తా చాటుతోంది. దీంతో కొంత కాలంగా నెమ్మదించినట్లు కనిపించిన కరోనా మళ్లీ జోరు పెంచుతోంది.


కరోనాలో కొత్తగా వచ్చి డెల్టా వేరియంట్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంపై కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 7 లక్షలకు పైగా కేసులు వచ్చాయి. దాదాపు 11 వేల మంది వరకు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కూడా వైరస్ ఉద్ధృతి మరింత తీవ్రంగా పెరుగుతోంది. అగ్రరాజ్యంలో గురువారం ఒక్కరోజే లక్షా 54 వేల మందికి కరోనా వచ్చింది. దాదాపు వెయ్యి మంది చనిపోయారు.


ఇక జపాన్‌లో కూడా కరోనా సత్తా చాటుతోంది. జపాన్‌లో గత వారం యావరేజ్‌గా రోజుకు 20 వేల కొత్త కేసులు వచ్చాయి. దీంతో జపాన్ పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించింది. సెప్టెంబర్ 12 వరకు ఈ ఎమర్జన్సీ ప్రకటించింది. టోక్యో, ఒకినావా వంటి 13 నగరాల్లో ఎమర్జెన్సీ పెట్టారు. అటు ఆస్ట్రేలియాలోనూ అదే పరిస్థితి. గురువారం న్యూ సౌత్‌ వేల్స్‌లో 700 వరకూ కొత్త కేసులు నమోదయ్యాయి. సిడ్నీలో లాక్‌డౌన్ పొడిగించారు. సెప్టెంబర్ చివరి వరకు ఆంక్షలు విధించారు.


ఇంకా దక్షిణ కొరియాలోనూ వైరస్ కుమ్మేస్తోంది. రెండు రోజు్లో 2వేల కేసులు వచ్చాయి. లాక్‌డౌన్ పెట్టినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సో..ఇలా ప్రపంచమంతటా డెల్టా వేరియంట్లు సత్తా చాటుతూనే ఉన్నాయి. అందుకే కరోనా ప్రభావం తగ్గిందని అప్పుడే ఓ కంక్లూజన్‌కు రాకండి సుమా.





అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>