MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala7c67bc2c-8532-496a-9d5d-fdec4c6696f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala7c67bc2c-8532-496a-9d5d-fdec4c6696f2-415x250-IndiaHerald.jpgబాలయ్య వరస హిట్లు కొడుతున్న రోజులు అవి. మరో వైపు దర్శకుడు బాపు హవా కూడా తగ్గుతున్న సమయం అది. అప్పటికీ బాపూ అంటే ఒక ఇమేజ్ ఉంది. ఆయన సరైన సబ్జెక్ట్ తో మూవీ చేస్తే జనాలు చూస్తారన్న నమ్మకం ఉంది. ఇక పౌరాణిక సినిమాల మీద బాపూ రమణలు పెట్టే శ్రద్ధ, ఏకాగ్రత వల్ల అవి మంచి హిట్లు కొట్టాయి bala{#}Bapuబాలయ్య బాపూ కాంబోలో ఆగిన అద్భుత ప్రాజెక్ట్... ?బాలయ్య బాపూ కాంబోలో ఆగిన అద్భుత ప్రాజెక్ట్... ?bala{#}BapuSat, 21 Aug 2021 19:06:44 GMTబాలయ్య వరస హిట్లు కొడుతున్న రోజులు అవి. మరో వైపు దర్శకుడు బాపు హవా కూడా తగ్గుతున్న సమయం అది. అప్పటికీ బాపూ అంటే ఒక ఇమేజ్ ఉంది. ఆయన సరైన సబ్జెక్ట్ తో మూవీ చేస్తే జనాలు చూస్తారన్న నమ్మకం ఉంది.

ఇక పౌరాణిక సినిమాల మీద బాపూ రమణలు పెట్టే శ్రద్ధ, ఏకాగ్రత వల్ల అవి మంచి హిట్లు కొట్టాయి. 90 దశకంలో అయితే బాలయ్య మంచి పౌరాణిక చిత్రం చేయాలని భావించేవారు. ఆయన ముచ్చట పడి చేసిన జానపద చిత్రం భైరవ ద్వీపం సూపర్ హిట్ అయింది. ఆ ఊపులో పౌరాణికాలను కూడా ఆ తరానికి పరిచయం చేయాలనుకున్నారు. దాంతో ఆయన బాపూని సంప్రదించారు. బాపూ కూడా సరేనని అన్నారు.

ఆ మూవీకి టైటిల్ కూడా అనుకున్నారు. భగవాన్ శ్రీక్రిష్ణ అన్నది ఆ చిత్రానికి పెట్టిన పేరు. అంటే ఈ చిత్రం మొత్తం శ్రీకృష్ణుడి లీలలు, ఆయన భగవద్గీతా సారం వంటివి ఉంటాయి. మొత్తానికి క్రిష్ణతత్వాన్ని ఈ చిత్రం ద్వారా చెప్పాలన్నది  చక్కని ప్రయత్నం. నిజానికి శ్రీక్రిష్ణుడి మీద అనేక సినిమాలు వచ్చినా ఏవీ కూడా ఆయన సందేశాన్ని పెద్దగా వివరించలేదు. దాంతో దాని మీద స్టడీ చేసి మూవీ తీయాలని బాపు అనుకున్నారు. బాలయ్య క్రిష్ణుడిగా పెర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అని భావించారు.

ఇదిలా ఉండగానే బాలయ్య విజయా ప్రొడక్షన్స్ వారి శ్రీక్రిష్ణ విజయం మూవీకి ఓకే చెప్పేశారు. ఈ పౌరాణిక మూవీకి సింగీతం శ్రీనివాసరావు డైరెక్టర్.ఈ చిత్రంలో బాలయ్య క్రిష్ణుడిగా అర్జునుడిగా రెండు పాత్రలు పోషించారు. ఈ సినిమా 1996 మే 15న రిలీజ్ అయింది. చిత్రం బాగున్నా కధ జనాలకు పరిచయం లేకపోవడం, నాటకీయ సన్నివేశాలు లేకపోవడంతో జనాలు పెద్దగా ఆదరించలేదు. దాంతో బాలయ్య సైతం డీలా పడ్డారు. తాను ఎంతో మెచ్చి చేసిన క్రిష్ణుడి క్యారక్టర్ ఇలా అయిందేంటి అని మధనపడి ఆయన క్రిష్ణ పాత్రతో బాపూ చేపట్టిన భగవాన్ శ్రీక్రిష్ణకు కూడా తరువాత చేద్దామని చెప్పేశారని టాక్. మొత్తానికి బాలయ్య బాపూల కాంబోలో ఆ ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. అయితే 2010లో మళ్ళీ ఈ ఇద్దరు కలసి చేసిన  శ్రీరామరాజ్యం బాగానే ఆడింది. బాలయ్యకు కూడా మంచి పేరు తెచ్చింది.



పరిటాల సిద్దార్థ్ కు బుల్లెట్ ఇచ్చింది ఎవరు...?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>