PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrtp29755345-8564-4356-ab44-d7a080d346a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrtp29755345-8564-4356-ab44-d7a080d346a2-415x250-IndiaHerald.jpgతెలంగాణలో తెలంగాణ పార్టీలనేవే ఉండాలి..ఆంధ్రోళ్ల పార్టీలు ఎందుకు అన్న ప్రశ్న షర్మిల పార్టీ పెట్టిన రోజు నుంచి ఇప్పటివరకూ వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో కొత్తవాళ్లు ఎందరు వచ్చినా,డబ్బులు వెదజల్లినా,ఓట్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చినా షర్మిల లాంటి వలస నాయకులను పాలకులుగా చూడలేం..చూడబోం అనే చెబుతున్నారు తెలంగాణ వాసులు. కానీ షర్మిల మాత్రం మీ కోసమే వచ్చాను..కేసీఆర్ పాలన కాదు రావాల్సింది రాజన్న పాలన అని చెబుతూ..సభలు పెడుతున్నారు. దీక్షలు చేస్తున్నారు. తోచినంతలో నాయకులను తిడుతున్నారు. ఇవి ఓ పార్టీకి అవసరం అysrtp{#}Research and Analysis Wing;KCR;police;Sharmila;Party;Telanganaటీ కప్పులో తుఫాను : ఉద్యమ కాలంలో ఆమె లేరు కదా! ఇప్పుడెందుకు?టీ కప్పులో తుఫాను : ఉద్యమ కాలంలో ఆమె లేరు కదా! ఇప్పుడెందుకు?ysrtp{#}Research and Analysis Wing;KCR;police;Sharmila;Party;TelanganaSat, 21 Aug 2021 20:49:00 GMTషర్మిల ప్రారంభించిన వైఎస్సార్టీపీకి సంబంధించి ఇప్పుడు వినిపిస్తున్న మాట ఒక్కటే ఇంతకాలం తెలంగాణ ఉద్యమంలో లేని వా రు, ఇంతకాలం మన సమస్యలపై పోరాడని వారు ఇప్పుడెందుకు? కొత్త పార్టీలంటూ హడావుడి చేస్తున్నారు అని ! ఆంధ్రోళ్ల పార్టీ లు వద్దనుకుని తాము జీవిస్తుంటే, కొత్త అలజడులకు కారణం అయ్యేలా కొత్త పార్టీలు రావడంలో అర్థం లేదని కొందరి వాదన. ఈ క్రమంలో వైఎస్సార్టీపీని తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా? లేదా వద్దని పొమ్మంటారా ? అంగీకారం తెలిపితే కనీసం ఓ పదిసీట్లు అ యినా గెల్చుకునేందుకు అవకాశం ఉంది. అంగీకారం లేకుంటే అవి కూడా కష్టమే.

ప్రజలేం అనుకుంటున్నారంటే...
తెలంగాణలో తెలంగాణ పార్టీలనేవే ఉండాలి..ఆంధ్రోళ్ల పార్టీలు ఎందుకు అన్న ప్రశ్న షర్మిల పార్టీ పెట్టిన రోజు నుంచి ఇప్పటివరకూ వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో కొత్తవాళ్లు ఎందరు వచ్చినా,డబ్బులు వెదజల్లినా,ఓట్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చినా షర్మిల లాంటి వలస నాయకులను పాలకులుగా చూడలేం..చూడబోం అనే చెబుతున్నారు తెలంగాణ వాసులు. కానీ షర్మిల మాత్రం మీ కోసమే వచ్చాను..కేసీఆర్ పాలన కాదు రావాల్సింది రాజన్న పాలన అని చెబుతూ..సభలు పెడుతున్నారు. దీక్షలు చేస్తున్నారు. తోచినంతలో నాయకులను తిడుతున్నారు. ఇవి ఓ పార్టీకి అవసరం అయినా కాకున్నా ఓ ఉద్యమ కారుడి ఘోష వేరేగా ఉంది.


అదెలా ఉందంటే.....
ఆ రోజు మేం తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్యమించాం. అందుకు దెబ్బలు తిన్నాం..అవమానాలు పడ్డాం..పోలీసుల వేధింపులు విన్నాం..యూనివర్శిటీల నుంచి పొమ్మంటే ఇంటికి వచ్చి రాత్రిళ్లు అదే పనిగా పోలీసు పహారాల నడు మ ఉద్యమ కార్యాచరణ రా సుకున్నాం. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యతకు సంబంధించి ఎన్నో కరప త్రాలు, పుస్తకాలు రూపొందించాం. స మైక్య పాలకుల కాలం లో ఎన్నో బెదిరింపులు ఉన్నా పోలీసుల ముళ్ల కంచెలు దాటుకుని పో రాడాం. కానీ ఇప్పుడు కొత్త పార్టీల హ డావుడికి కారణం ఏంటి? ఇదీ సగటు తెలంగాణ ఉద్యమ కారుడి ఘోష. ప్రాణ త్యాగాలకు విలువ లేకుండా పోయింది అన్నది అతడి బాధ. మరి! వలస నాయకులు (వైఎస్సార్టీపీ నాయకులు) ఏమనుకుంటున్నారో చూద్దాం. ఈ దశలో వారేం అనుకుంటున్నారో కూడా తెల్సు కుందాం.

కొత్త పార్టీ వద్దు ఉన్న పార్టీలు చాలు
ఉపన్యాసాలు కాదు  వాస్తవాలు కావాలి
రాజన్న రాజ్యంలో అంతా సంక్షేమం, అభివృద్ధి అన్న విధంగానే పాలన సాగిందని షర్మిల అంటున్నారు. కానీ కేసీఆర్ పాలనలో ని రుద్యోగం పెరిగి..అప్పులు పెరిగి ధనిక రాష్ట్రం కాస్త పేద రాష్ట్రంగా మారిపోయిందని చెబుతున్నారు. ఈ పాలన మారాలంటే, అంద రికీ సంక్షేమం సంబంధిత ఫలాలు దక్కాలంటే తాము అధికారంలోకి వస్తేనే సాధ్యం అవుతుందని పేర్కొంటూ ఉపన్యాసాలు ఇస్తు న్నారు. పునరుద్ఘాటిస్తున్నారు. కానీ ఇదంతా టీ కప్పులో తుఫాను అని తీసిపారేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కొద్ది రోజుల పాటే షర్మిల తన పార్టీ నడపగలరే తప్ప!ఎక్కువ కాలం వైఎస్సార్టీపీ మనుగడలో ఉండడం అన్నదే కష్టమని జోస్యం చెబుతు న్నా రు. తెలంగాణ ఉద్యమాన నాడు ఏ మాటకూ స్పందించని నేతలు, నాయకుల కూతుళ్లు ఇప్పుడు కొత్త పార్టీ స్థాపించి సంబంధిత వ్యవస్థ పేరిట రాజకీయం చేస్తామనడమే తమకు విడ్డూరం అని వ్యాఖ్యానిస్తున్నారు.





ఇండియన్ పొలిటికల్ లీగ్ : టీ - 20 - 20 - మ్యాచ్ లో గెలుపెవరిది?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>