MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tuk-jagadish-movie-dispute31e3324d-04cd-4824-9828-896fd67760e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tuk-jagadish-movie-dispute31e3324d-04cd-4824-9828-896fd67760e0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నేచురల్ స్టార్ నాని మొదటి నుండి వివాదాలు అంటే కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం నానిపై గ్యాప్ లేకుండా విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీనికంతటికీ కారణం నాని లేటెస్ట్ ప్రాజెక్ట్ టక్ జగదీష్ చిత్రమే. ఈ సినిమాని ఓ టి టి వేదికపై రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం అనంది ప్రధాన కారణంగా తెలుస్తోంది.TUK JAGADISH MOVIE DISPUTE{#}anandi;Audio;Culture;Tuck Jagdish;Tuck Jagadish;Tollywood;Nani;Chitram;Cinema;Hero;sunilనానిపై నిర్మాత షాకింగ్ కామెంట్స్...నానిపై నిర్మాత షాకింగ్ కామెంట్స్...TUK JAGADISH MOVIE DISPUTE{#}anandi;Audio;Culture;Tuck Jagdish;Tuck Jagadish;Tollywood;Nani;Chitram;Cinema;Hero;sunilSat, 21 Aug 2021 08:16:00 GMTటాలీవుడ్ నేచురల్ స్టార్ నాని మొదటి నుండి  వివాదాలు అంటే కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం నానిపై గ్యాప్ లేకుండా విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీనికంతటికీ కారణం నాని లేటెస్ట్ ప్రాజెక్ట్ టక్ జగదీష్ చిత్రమే. ఈ సినిమాని ఓ టి టి వేదికపై రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం అనంది ప్రధాన కారణంగా తెలుస్తోంది. దానికి తోడు గతంలో నాని ఇచ్చిన స్పీచ్ ఇలా అన్ని కలసి నాని అందరికీ టార్గెట్ గా మారారు. తన మునుపటి చిత్రం "వి" సినిమాను సైతం ఓ టి టి లో రిలీజ్ చేసి ఎగ్జిబిట‌ర్ల నుంచి అసహనాలు  ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇపుడు మళ్ళీ అదే తరహాలో టక్ జగదీష్ చిత్రాన్ని కూడా నిర్మాతలు ఓ టి టి వేదికపై రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో విషయం చర్చనీయాంశంగా మారింది.

ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో తిమ్మరుసు ఆడియో ఫంక్షన్ లో నాని చెప్పిన మాటలకు అర్దం లేకుండా  పోయిందంటూ విమర్శలు వినబడుతున్నాయి. తిమ్మరసు ఆడియో వేడుకలో.. నాని మాట్లాడుతూ  థియేటర్లలోనే  సినిమాలు చూసి ఆస్వాదించడం  మ‌న సంస్కృతి అంటూ భారీ ప్రసంగం చేసిన నాని, ఇప్పుడు తన మరో సినిమా ఓ టి టి బాటపడుతుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయారు అంటూ, చిన్న చిన్న చిత్రాలు సైతం వెండితెరపై సందడి చేస్తుంటే టక్ జగదీష్ లాంటి స్టార్ హీరో చిత్రం ఓ టి టి లో రిలీజ్ కావడం ఏంటి అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తాజాగా టాలీవుడ్ ప్రముఖులు  ఏషియ‌న్ సినిమాస్ అధినేత‌ సునీల్ నారంగ్ ఈ విషయంపై స్పందిస్తూ.. తమ స్వార్థం కోసం ఓ టి టి లో మంచి రాబడి పొందడం కోసం థియేటర్లను ఎరగా వాడుతున్నారు అంటూ విమర్శించారు. దీంతో హీరో నాని మరో సారి వార్తల్లోకి ఎక్కారు. అయితే దీనిపై నాని ఎలా స్పందిస్తారో చూడాలి. ముందు ముందు ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.


అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>