PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila47e6ebf1-40a2-4262-b9f2-b79d5b8c8c02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila47e6ebf1-40a2-4262-b9f2-b79d5b8c8c02-415x250-IndiaHerald.jpgఆదిలోనే హంసపాదు... ఇప్పుడు వైఎస్ షర్మిల గురించి ఎవరు మాట్లాడుకున్నాసరే... ఇదే మాట. అవును... ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న నైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో అప్పుడే అసంతృప్తులు మొదలయ్యాయి. పార్టీ ప్రారంభానికి ముందు నుంచే షర్మిలతో కలిసి తిరిగిన ఇందిరా శోభన్... పెద్ద షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన ఆమె... ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. పిచ్చోళ్ల దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదంటూ ఇందిరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. అసలు వైటీపీ జెండాను తొలి నుంచి భుజానెత్తుకుని మోసిన ఇందిరా... ఒక్కసారిగా YTP{#}Rayalaseema;Aqua;television;Indira Gandhi;Sharmila;Telangana Chief Minister;రాజీనామా;Y. S. Rajasekhara Reddy;Party;Telangana Rashtra Samithi TRS;Huzurabad;KCR;dr rajasekhar;Yevaru;Telangana;Teluguఆదిలోనే హంసపాదు..!ఆదిలోనే హంసపాదు..!YTP{#}Rayalaseema;Aqua;television;Indira Gandhi;Sharmila;Telangana Chief Minister;రాజీనామా;Y. S. Rajasekhara Reddy;Party;Telangana Rashtra Samithi TRS;Huzurabad;KCR;dr rajasekhar;Yevaru;Telangana;TeluguSat, 21 Aug 2021 12:18:00 GMTఆదిలోనే హంసపాదు... ఇప్పుడు వైఎస్ షర్మిల గురించి ఎవరు మాట్లాడుకున్నాసరే... ఇదే మాట. అవును... ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న నైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో అప్పుడే అసంతృప్తులు మొదలయ్యాయి. పార్టీ ప్రారంభానికి ముందు నుంచే షర్మిలతో కలిసి తిరిగిన ఇందిరా శోభన్... పెద్ద షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన ఆమె... ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. పిచ్చోళ్ల దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదంటూ ఇందిరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. అసలు వైటీపీ జెండాను తొలి నుంచి భుజానెత్తుకుని మోసిన ఇందిరా... ఒక్కసారిగా వైఎస్ షర్మిలకు షాక్ ఇచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న పార్టీకి ఇలాంటి ఎదురుదెబ్బ తగలడంతో అంతా అవాక్కయ్యారు.

పార్టీ ప్రారంభం కాక ముందు నుంచే... టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒంటికాలుపై లేచిన వైఎస్ షర్మిలకు ఇది ఒక రకంగా ఊహించని ఎదురుదెబ్బ. పార్టీ ప్రారంభ సభలో గంట పాటు ప్రసంగించిన షర్మిల... అందులో 45 నిమిషాలు కేసీఆర్ ను పశ్నిస్తూనే ఉంది. అటు ఇందిర శోభన్ కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో షర్మిల నిర్వహించిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో అన్నీతానే అన్నట్లుగా వ్యవహించారు. ఒకదశలో పార్టీలో కీలక నేతగా కూడా గుర్తింపు పొందారు ఇందిరా. పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా కూడా ఒక దశలో ఇందిరాకు గుర్తింపు వచ్చింది. అటు పార్టీ తరఫున, వైఎస్ షర్మిల తరఫున కూడా టీవీ షోలలో తన వాణిని బలంగానే వినిపించారు ఇందిర. అయితే ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు ఇందిరా రాజీనామాతో పరిస్థితి అంతా తారుమారైంది. హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై షర్మిల స్పష్టత ఇవ్వకపోవడం... అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కూడా స్పష్టమైన వైఖరిని వెల్లడించకపోవడం కూడా ఇందిరా రాజీనామాకు కారణంగా తెలుస్తోంది. అటు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రారంభమైన వైటీపీలో... ఇప్పుడు కొంతమంది ఆంధ్ర, రాయలసీమ వాసుల పెత్తనం పెరిగిపోతుందని కూడా పుకార్లు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న వారు ఇప్పుడు షర్మిల పంచన చేరారనేది నేతల ఆరోపణ. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాస్తా... నెమ్మదిగా మరో ఆంధ్ర పార్టీగా మారిపోతుందనే భయం కూడా ఇంది. ఇలాంటి పార్టీని ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా అనే ప్రశ్న ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు మరికొందరు నేతలు కూడా ఇందిరా శోభన్ బాటలోనే ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా... వైఎస్ షర్మిల సొంత పార్టీ వైటీపీకి ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లే,





ఒక్క‌రు వ‌ద్దు..ముగ్గురు ముద్దు అంటున్న చైనా.!

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?

జగన్ కు కేసీఆర్ మరో షాక్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>