PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcre5f94351-05a3-48f8-b69b-a4e8c58f692b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcre5f94351-05a3-48f8-b69b-a4e8c58f692b-415x250-IndiaHerald.jpgతెలంగాణ వచ్చాక మళ్లీ ఇన్నాళ్లకు తెరపైకి వచ్చిన ప్రశ్న ఇది. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం తరువాత టీడీపీ వైపు ఉన్న కా స్త ఓట్లు టీఆర్ఎస్కే పడ్డాయి. అప్పటిదాకా ఆంధ్రా సెటిలర్లు అంతా ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవారంతా గులాబీ పార్టీ పైనే ఆశలు పెంచుకుని ఇటుగా ఓటేశారు. దీంతో గులాబీ పార్టీకి ఎదురన్నది లేకుండా పోయింది. రెడ్లు, కమ్మలు కూడా ఇటుగా నే వచ్చేశారు. kcr{#}ajay;Kamma;Akkineni Nageswara Rao;Corporate;Shakti;dr rajasekhar;Ishtam;CBN;Revanth Reddy;revanth;Telangana Rashtra Samithi TRS;Congress;KCR;Reddy;TDP;politics;Sharmila;Party;Telanganaకార్పొరేట్లు ఎటు? సెటిలర్లు ఎటు?కార్పొరేట్లు ఎటు? సెటిలర్లు ఎటు?kcr{#}ajay;Kamma;Akkineni Nageswara Rao;Corporate;Shakti;dr rajasekhar;Ishtam;CBN;Revanth Reddy;revanth;Telangana Rashtra Samithi TRS;Congress;KCR;Reddy;TDP;politics;Sharmila;Party;TelanganaSat, 21 Aug 2021 20:11:00 GMTడబ్బులు పెట్టేదొకరు
ఓట్లు వేసేదొకరు
డబ్బులు పార్టీల మనుగడకు
ఓట్లు అధికారం మనుగడకు
ఓట్లు సెటిలర్లవి డబ్బులు కార్పొరేట్లవి
కార్పొరేట్ రాజకీయాల్లో
రేవంత్ కు మద్దతు ఉంటుందా ?
షర్మిలకు మద్దతు ఉంటుందా?

 

తెలంగాణ వచ్చాక మళ్లీ ఇన్నాళ్లకు తెరపైకి వచ్చిన ప్రశ్న ఇది. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం తరువాత టీడీపీ వైపు ఉన్న కా స్త ఓట్లు టీఆర్ఎస్కే పడ్డాయి. అప్పటిదాకా ఆంధ్రా సెటిలర్లు అంతా ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవారంతా గులాబీ పార్టీ పైనే ఆశలు పెంచుకుని ఇటుగా ఓటేశారు. దీంతో గులాబీ పార్టీకి ఎదురన్నది లేకుండా పోయింది. రెడ్లు, కమ్మలు కూడా ఇటుగా నే వచ్చేశారు.



ఖమ్మంలో ఉన్న కీలక కమ్మ నేతలంతా బాబు మనుషులుగా పేరొందిన తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతలంతా ఇటుగా వ చ్చేసి ఎంతో కొంత తమ పట్టుకు ఎదురు అన్నది లేదని నిరూపించారు. అదే ఖమ్మంలో వామపక్ష కుటుంబ నేపథ్యం నుంచి వ చ్చిన పువ్వాడ అజయ్ కూడా నిలదొక్కుకున్నారు. కమ్మలూ, రెడ్లూ అంతా ఇప్పుడు మరో ఆలోచనే లేకుండా కాంగ్రెస్ కూ, వైఎ స్సార్టీపీకి లేదా మరో పార్టీకి తలో కొన్ని ఓట్లు వేస్తారు అని అనుకోలేం. ఎందుకంటే వీరెవ్వరికీ రాజకీయ అస్థిరత అంటే ఇష్టం లే దు. నాలుగు పార్టీలు నాలుగు ఓట్లు చీల్చుకునేలా చిల్లర రాజకీయాలు చేస్తామంటే ఒప్పుకునేలా సెటిలర్లు లేరు. ముఖ్యంగా కే సీఆర్ వచ్చాక సెటిలర్లకు మునుపటి భయాలు ఏవీ లేవు. ఆంధ్రోళ్లపై దాడులు లేవు. ఇవన్నీ గులాబీ దండుకు కలిసివచ్చే మాట లే. పనులే.



ఇక వైఎస్సార్టీపీ రాకతో రెడ్ల  ఓట్లన్నీ షర్మిలకు పడతాయని అనలేం .. కానీ కాస్త ప్రభావం అయితే ఉంటుంది. ఇదే దశలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్  అయ్యాక కూడా కొందరు రెడ్లు ఆశలు పెంచుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డిలానే రేవంత్ రాణిస్తాడని.. ఇవన్నీ ఎ లా ఉన్నా సెటిలర్ల ఓట్లు మాత్రం షర్మిల కు పడే ఛాన్స్ తక్కువ. ఇక కార్పొరేట్లు గురించి మాట్లాడుకోవాలి. టీఆర్ఎస్ అధికారంలో వచ్చాక అమలు చేస్తున్న విధానాలపై పూర్తి సంతృప్తి కార్పొరేట్లలో ఉంది. ఆ నమ్మకం రేపు ఓట్ల రూపంలోనూ పడుతుంది. అలా నే టీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ రూపంలోనూ దక్కుతుంది. పార్టీని నడిపించే శక్తి కార్పొరేట్ల నుంచి ఏదో ఒక రూపంలో గులాబీ దండు కే దక్కుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ కానీ షర్మిల  కానీ కార్పొరేట్లను ప్రభావితం చేసే రాజకీయాలు నడపడం కష్టం. ఎందుకంటే అధికారంలో ఉన్నోళ్లంతా ఎప్పుడో వారిని తమవైపు తిప్పుకున్నారు. కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గంతో పాటు యాదవ సామాజికవర్గం కూడా తెలంగాణలో కీలకమే ఇటు ఆంధ్రాలో కూడా ఈ సామాజిక వర్గం ప్రభావం ఉండనే ఉంది. వీ ళ్లలో కూడా సెటిలర్లు ఉన్నారు. వీరు షర్మిలకు ఓటేస్తారని చెప్పలేం. ఆమె నిలబెట్టే అభ్యర్థుల బలా బలాపైనే ఇదంతా ఆధారపడు తుంది.

దళితుల ఓట్ల విషయానికే వస్తే.. ఆంధ్రా నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దళితులు లేదా ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిరపడి పోయిన ఇతర రాష్ట్రాల ప్రజలు వీరంతా షర్మిల నాయకత్వానికి మద్దతు పలికినా ఇప్పటికిప్పుడు వారు మొగ్గు మాత్రం టీఆర్ఎస్ వైపే ఉంటుంది. ఆదివాసీ కుటుంబాలకు, దళిత కుటుంబాలకు కేసీఆర్ అంటే కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని తమకు అనుగు ణంగా, అనుకూలంగా మార్చే నాయకులు వీరిద్దరూ కాదు. కాబోరు కూడా! ఈ నేపథ్యంలో కొత్త పార్టీ సాధించేది ఏమీ ఉండదు.. కొత్త చీఫ్ సాధించేదేమీ ఉండదు. తిట్లు తిట్టడం మినహా సెటిలర్ల మనసు తమవైపు ఉండేలా మాట్లాడడం ఇంకా షర్మిలకు రాలే దు. రేవంత్ కూ రాలేదు. ఆ పని కేసీఆర్ చేయగలరు. చేస్తున్నారు కూడా!






కార్పొరేట్లు ఎటు? సెటిలర్లు ఎటు?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>