PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/politics_analysis/chinad4b242a0-46ce-42ea-8569-9a468804df95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/politics_analysis/chinad4b242a0-46ce-42ea-8569-9a468804df95-415x250-IndiaHerald.jpgప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగి ఉన్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. ఆ దేశంలో దాదాపు 150 కోట్ల‌కు పైగా నే ఉంటుంది. ఈ నేప‌థ్యంలో జ‌నాభా నియంత్ర‌ణ‌కు ఆ దేశం గ‌తంలో అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకువ‌చ్చింది దంప‌తులు కేవ‌లం ఒక్క‌రికే జ‌న్మ‌నివ్వాల‌ని రూల్ తీసుకు వ‌చ్చింది. అలా కాద‌ని ఎక్కువ మంది పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తే ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ ప‌థ‌కాల‌ను, ఇత‌ర ల‌బ్ధి ప‌నుల‌ను నిలిపిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీని కోసం జ‌నాభా నియంత్ర‌ణ చ‌ట్టంను కూడా ప్ర‌వేశ‌పెట్టింది. అయితే తాజాగా త‌మ దchina{#}santhanam;Population;Partyఒక్క‌రు వ‌ద్దు..ముగ్గురు ముద్దు అంటున్న చైనా.!ఒక్క‌రు వ‌ద్దు..ముగ్గురు ముద్దు అంటున్న చైనా.!china{#}santhanam;Population;PartySat, 21 Aug 2021 13:30:51 GMT  ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగి ఉన్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. ఆ దేశంలో దాదాపు 150 కోట్ల‌కు పైగా నే ఉంటుంది. ఈ నేప‌థ్యంలో జ‌నాభా నియంత్ర‌ణ‌కు ఆ దేశం గ‌తంలో అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకువ‌చ్చింది దంప‌తులు కేవ‌లం ఒక్క‌రికే జ‌న్మ‌నివ్వాల‌ని రూల్ తీసుకు వ‌చ్చింది. అలా కాద‌ని ఎక్కువ మంది పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తే ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ ప‌థ‌కాల‌ను, ఇత‌ర ల‌బ్ధి ప‌నుల‌ను నిలిపిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీని కోసం జ‌నాభా నియంత్ర‌ణ చ‌ట్టంను కూడా ప్ర‌వేశ‌పెట్టింది.


  అయితే తాజాగా త‌మ దేశంలోని జంట‌లు ఇప్ప‌టి నుంచి ముగ్గురు పిల్ల‌ల్ని క‌నేందుకు వీలుక‌ల్పించారు. ఈ మేర‌కు చైనా అధికార క‌మ్యూనిస్టు పార్టీ ప్ర‌తిపాద‌న‌లు తెచ్చింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను ఆ దేశ `పార్ల‌మెంట్ `నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్‌` (ఎన్‌పీసీ) లోని స్థాయి సంఘం శుక్ర‌వారం ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు జ‌నాభా నియంత్ర‌ణ చ‌ట్టంలో స‌వ‌రించి కొత్త చ‌ట్టాన్ని రూపొందించింది చైనా ప్ర‌భుత్వం. దేశంలో త‌గ్గిపోతున్న జ‌న‌నాల రేటును గాడిలో పెట్ట‌డం కోసం ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంది. పెరుగుతున్న ఖ‌ర్చుల దృష్ట్యా అధిక సంతానం ప‌ట్ల దంప‌తుల్లో వ్య‌క్త‌మ‌వుతున్న విముఖ‌త‌ను త‌గ్గించ‌డానికి కొత్త చ‌ట్టంలో అనేక మార్పులు చేసింది.

సామాజిక‌, ఆర్థిక తోడ్పాటు చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించింది చైనా పార్ల‌మెంటు. ఈ సంస్క‌ర‌ణ‌లతో కుటుంబాల‌పై ప‌డే భారం, పిల్ల‌ల్ని పెంచ‌డానికి, వారికి చ‌దువు చెప్పించ‌డానికి అయ్యే వ్య‌యాల‌ను త‌గ్గించ‌డానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకోనుంది. అందుకోసం ఆర్థిక సాయం, ప‌న్నులు, బీమా, విద్య‌, వైద్యం, గృహ నిర్మాణం, ఉపాధి క‌ల్ప‌న వంటి అంశాల్లో ప‌లు చ‌ర్య‌ల‌ను చేప‌డుతోంది.


 చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ ఏడాది మే నెలలో సామాజిక, ఆర్థిక వృద్ధి రంగాల్లో కొత్తగా ఉత్పన్నమవుతున్న పరిణామాలను అధిగమించడానికి, సమతౌల్యంతో కూడిన దీర్ఘకాల జనాభా వృద్ధిని ప్రోత్సహించడానికి  కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇద్దరు పిల్లల విధానాన్ని సడలించాలని, ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతించాలని పేర్కొంది.  చైనాలో 2016కు ముందు దశాబ్దాల పాటు ఏక సంతాన విధానం ఉంది దీంతో దేశంలో జనాభా పరమైన సంక్షోభానికి కారణమైందన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి.



సుధీర్ తో పోలుస్తూ నెటిజన్స్ పై ఫైరవుతున్న రష్మి గౌతమ్!!

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>