EditorialPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aicc-presidency-reins-sonia-gandhi40faf876-d886-4a6f-9b99-ccd83ea207f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aicc-presidency-reins-sonia-gandhi40faf876-d886-4a6f-9b99-ccd83ea207f3-415x250-IndiaHerald.jpg2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ నాటి నుంటి నేటి వరకు విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉంది. మోదీ చరిష్మా ముందు ఏ మాత్రం నిలవలేకపోయిన హస్తం పార్టీ... చివరికి ప్రభుత్వ వ్యతిరేకతను కూడా సొమ్ము చేసుకోలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ఐదేళ్ల మోదీ సర్కార్ పై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ... 2019 ఎన్నికల్లో మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలవగా... 125 ఏళ్ల పైగా వయసున్న కాంగ్రెస్ పార్టీ మాత్రంCongress{#}Madhya Pradesh - Bhopal;Punjab;Rajasthan;Narendra Modi;rahul;Rahul Sipligunj;Yuva;central government;CM;Telangana Chief Minister;Elections;Congress;Bharatiya Janata Party;Party;Hanu Raghavapudiకాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా...?కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా...?Congress{#}Madhya Pradesh - Bhopal;Punjab;Rajasthan;Narendra Modi;rahul;Rahul Sipligunj;Yuva;central government;CM;Telangana Chief Minister;Elections;Congress;Bharatiya Janata Party;Party;Hanu RaghavapudiSat, 21 Aug 2021 05:55:00 GMT2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ నాటి నుంటి నేటి వరకు విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉంది. మోదీ చరిష్మా ముందు ఏ మాత్రం నిలవలేకపోయిన హస్తం పార్టీ... చివరికి ప్రభుత్వ వ్యతిరేకతను కూడా సొమ్ము చేసుకోలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ఐదేళ్ల మోదీ సర్కార్ పై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ... 2019 ఎన్నికల్లో మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలవగా... 125 ఏళ్ల పైగా వయసున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది.

కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లుగా... కాంగ్రెస్ ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. సరైనా నాయకత్వం లేకపోవడం, యువనేత రాహుల్ గాంధీపై ప్రజల్లో నమ్మకం లేకపోవడం, సోనియా, రాహుల్ నాయకత్వంపై పార్టీలోనే వ్యతిరేకత రావడం, కొంతమంది యువ నేతలు, సీనియర్లతో విభేదించి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడం, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అంతర్గత విభేదాలు.... ఇలా ఎన్నో కారణాలతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ప్రజల్లో రోజురోజుకు పడిపోయింది. చివరికి స్థానిన పార్టీలతో పొత్తు కారణంగా... హస్తం పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది.

పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో తెల్లారి లేస్తే చాలు... అంతర్గత గొడవలే. ఈ వివాదాల కారణంగానే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. రాహుల్ కోటరీలో కీలక నేతలుగా ఉన్న వారంతా ప్రస్తుతం పక్క చూపులు చూస్తున్నారు. రాహుల్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండే జ్యోతిరాధిత్య సింధియా.. బీజేపీ కండువ కప్పుకోవడంతో పాటు... ఏకంగా కేంద్ర మంత్రి పదవిని పొందారు కూడా. ఇక రాజస్థాన్ లో అయితే... యువనేత సచిన్ పైలెట్ కు సీఎం అశోక్ గెహ్లాట్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరి మధ్య సయోధ్య కోసం ఇప్పటికీ అధినాయకత్వం ప్రయత్నిస్తూనే ఉంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో అయితే ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు, మాజీ క్రికెకటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో కూడ అర్థం కావడం లేదు. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు అధినాయకత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇప్పటికే మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన హస్తం పార్టీ... మళ్లీ పూర్వ వైభవం సాధించాలంటే మాత్రం... ఓ పెద్ద మిరాకిల్ జరగాల్సిందే.





అతడికి 21.. ఆమెకి 41.. గదిలో చూశారు.. పెళ్లి చేశారు..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>