PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/kcrab0a1c11-da04-475e-b656-a151f3afac79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/kcrab0a1c11-da04-475e-b656-a151f3afac79-415x250-IndiaHerald.jpgప్రాంతీయ పార్టీల‌తో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను అస్థిర‌ప‌రిచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం అనేక వ్యూహాలు ర‌చిస్తుంటుంద‌ని తెలిసిన విష‌యమే. `జ‌మిలి` ఎన్నిక‌ల‌తో తెలంగాణ సీఎం చంద్ర‌శేఖ‌ర్ రావును ఎదుర్కొనేందుకు బీజేపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ అసెంబ్లికి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే త‌మ‌కు అనుకూలంగా ఫ‌లితాయ‌ని భావిస్తోంది బీజేపీ. అయితే, 2019లో కూడా ఇదే జ‌రిగేది కానీ కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసి త‌మ ప్ర‌భుత్వానికి ఇంకా 8 నెల‌ల స‌మ‌యం ఉండ‌గానే అసెంబ్లీని ర‌ద్దcm kcr{#}Bharatiya Janata Party;Telangana;KCR;central government;CM;Assemblyకేసీఆర్ ను ఎదుర్కొనేందుకు కమ‌ల‌నాథుల వ్యూహం ఏంటి.?కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు కమ‌ల‌నాథుల వ్యూహం ఏంటి.?cm kcr{#}Bharatiya Janata Party;Telangana;KCR;central government;CM;AssemblySat, 21 Aug 2021 08:07:54 GMT ప్రాంతీయ పార్టీల‌తో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను అస్థిర‌ప‌రిచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం అనేక వ్యూహాలు ర‌చిస్తుంటుంద‌ని తెలిసిన విష‌యమే. `జ‌మిలి` ఎన్నిక‌ల‌తో తెలంగాణ సీఎం చంద్ర‌శేఖ‌ర్ రావును ఎదుర్కొనేందుకు బీజేపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ అసెంబ్లికి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే త‌మ‌కు అనుకూలంగా ఫ‌లితాయ‌ని భావిస్తోంది బీజేపీ. అయితే, 2019లో కూడా ఇదే జ‌రిగేది కానీ కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసి త‌మ ప్ర‌భుత్వానికి ఇంకా 8 నెల‌ల స‌మ‌యం ఉండ‌గానే అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌లు వెళ్లార‌ని అప్పుడు చ‌ర్చ జ‌రిగింది. అయితే, ఈ సారి కేసీఆర్‌కు ఆ అవ‌కాశం ఇవ్వ‌కుండా 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నార‌ని తెలుస్తోంది.

     
     ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశం కాన‌ప్ప‌టికీ.. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ చేతిలో ఉన్న‌ప్ప‌టికీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను కేంద్రంలో ఉన్న ప్ర‌భుత్వం ఎంతో కొంత ప్ర‌భావితం చేస్తుంద‌ని, కేంద్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఎన్నిక‌ల‌ను షెడ్యూల్ చేస్తోంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.  లోపు ర‌ద్దు అయిన లేదా ఖాళి ఉన్న స్థానానికి 6 నెల‌లోపు ఎన్నిక‌లు ఉంటే దానిని సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తోపాటు నిర్వ‌హించే అవ‌కాశం ఉంటుంది. అందుకే సీఎం కేసీఆర్ 8 నెల‌ల ముందే అసెంబ్లీ ర‌ద్దు చేయ‌డంతో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు నిర్వ‌హించేందుకు అవ‌కాశం లేకుండా పోయింది.

  2023 డిసెంబ‌ర్ వ‌ర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఐదేళ్ల కాలం ముగుస్తుంది. దీంతో 2024లో నిర్వ‌హించే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ అసెంబ్లి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు.   కానీ దానికంటే 8 నెల‌ల ముందే కేసీఆర్ అసెంబ్లిని ర‌ద్దు చేస్తే బీజేపీ వ్యూహాలు దెబ్బ‌తింటాయి. ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే జ‌మిలి ఎన్నిక‌ల అస్త్రంతో ముందుకు వెళ్తామ‌ని క‌మ‌ల‌నాథులు చెబుతున్నారు. ఒక‌వేళ అసెంబ్లిని ముందుగా ర‌ద్దు చేస్తే ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కుండా రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించి మ‌రి లోక్ స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కు నెట్టుకురావ‌చ్చ‌ని చూస్తున్న‌ట్టుగా కనిపిస్తోంది.





అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>