PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jr-ntrd1810228-7382-4f2f-a071-e97224771bb5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jr-ntrd1810228-7382-4f2f-a071-e97224771bb5-415x250-IndiaHerald.jpgటీడీపీ ఇపుడు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిజానికి తెలుగుదేశం పార్టీకి సరైన సమయం ఇది. వైసీపీ గ్రాఫ్ పడిపోయింది అన్న వార్తలు ఒక వైపు ఉన్నాయి. మరో వైపు ఆడియో లీక్స్ గోలతో మంత్రుల స్థాయి వారే అల్లల్లాడిపోతున్నారు. jr ntr{#}Jr NTRరాను రానంటూనే జూనియర్ పాలిటిక్స్... ?రాను రానంటూనే జూనియర్ పాలిటిక్స్... ?jr ntr{#}Jr NTRSat, 21 Aug 2021 19:59:09 GMTటీడీపీ ఇపుడు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిజానికి తెలుగుదేశం పార్టీకి సరైన సమయం ఇది. వైసీపీ గ్రాఫ్ పడిపోయింది అన్న వార్తలు ఒక వైపు ఉన్నాయి. మరో వైపు ఆడియో లీక్స్ గోలతో మంత్రుల స్థాయి వారే అల్లల్లాడిపోతున్నారు.

ఇంకో వైపు శాంతిభద్రతల విషయంలో కూడా సర్కార్ వైఫల్యాలు బాగా దొరికిపోతున్నాయి. వరసబెట్టి అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతున్నాయి. ఈ టైమ్ లో  సరైన ట్రాక్ లోకి టీడీపీ రావాలి. ఆ దిశగానే అన్నీ జరుగుతున్నాయి కానీ టీడీపీలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి రూపంలో కొత్త సమస్య వచ్చి పడింది. బుచ్చయ్య చౌదరిని తేలిగ్గా తీసిపారేయలేరు. అలాగని ఆయనను బుజ్జగించి డిమాండ్లు తీర్చలేరు. పార్టీ బాగుపడాలి అంటే జూనియర్ ఎన్టీయార్ రావాలి అని బుచ్చయ్య అంటున్నారు. నిజానికి ఇది క్యాడర్ లో కూడా ఉన్న మాటే. అర్జంటుగా టీడీపీకి కొత్త ఫేస్ కావాలి. అది కూడా ఇమేజ్ ఉన్న వారు రావాలి. మరి జూనియర్ వస్తే టీడీపీ సర్దుకుంటుందా అంటే ఇంతకు మించి చాలానే జరగవచ్చు.

ఏపీలో జగన్ వైపు ఉన్న వారిలో చాలా మందిని వెనక్కి తీసుకు వచ్చే సత్తా జూనియర్ కి ఉంది. అయితే జూనియర్ రావాలి అంటే ఆయన రానూ రాలేనూ అనేస్తున్నారు. మరి జూనియర్ కి రాజకీయాల మీద ఆసక్తి లేదా అంటే ఉంది. కాబట్టే ఆయన 2009 ఎన్నికల్లో ప్రచారాన్ని చేశారు. అన్ని చోట్లా తిరిగి టీడీపీని గెలిపించాలని కోరారు. పైగా తాత పెట్టిన పార్టీ ఇది. దాంతో జూనియర్ రాజకీయాలకు దూరం కాలేరు. కానీ ఇపుడు ఆయన చూపు సినిమాల మీద ఉంది. ఆయ‌న వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు. అందుకే ఆయన ప్రస్తుతానికి రాజకీయాలు వద్దు అని మాత్రమే అంటున్నారు. అంటే ఫ్యూచర్ లో వస్తారా అంటే రావడం పక్కా అని అభిమానులు ఢంకా భజాయిస్తున్నారు. మొత్తానికి టీడీపీలో ఇపుడు ఎందరు గోల పెట్టినా కూడా జూనియర్ రాడు. కానీ సరైన సమయంలో మాత్రం వస్తాడు. అది ఎపుడు ఎలా అంటే అదే జూనియర్ మార్క్ పాలిట్రిక్స్ అనుకోవాలి.





ఎన్టీయార్ సావిత్రి సాహసానికి జనం ఇచ్చిన తీర్పు... ?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>