PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-will-tie-rakhi-to-brother-jagan249143a6-b91f-44eb-a98b-f6c2939fc921-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-will-tie-rakhi-to-brother-jagan249143a6-b91f-44eb-a98b-f6c2939fc921-415x250-IndiaHerald.jpgదేశంలో అన్నచెల్లెళ్లకు, అక్క తమ్ముళ్లకు ఆదివారం పండుగ రోజు. ఏడాదికి ఓసారి వచ్చే రాఖీ పర్వదినం రోజుల తోబుట్టువులతో రాఖీలు కట్టించుకోవాలని సోదరులు, అలాగే తమకు రక్షగా నిలిచే అన్నదమ్ముళ్లకు రక్షాబంధన్‌ కట్టాలని సోదరీమణులు వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ రాఖీ పండుగ రోజున ఒక దగ్గర ఉండేలా ప్లాన్‌ చేసుకుంటారు. భారతీయ సాంప్రదాయంలో రాఖీ పండుగకు అంత ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతోంది. అదేమిటంటే- తన అన్న జగన్‌కు సోదరి Sharmila will tie rakhi to brother jagan{#}festival;sunday;Sharmila;Party;Telangana;Andhra Pradesh;Telangana Chief Minister;Teluguజగన్‌కు షర్మిల రాఖీ కట్టేనా!?జగన్‌కు షర్మిల రాఖీ కట్టేనా!?Sharmila will tie rakhi to brother jagan{#}festival;sunday;Sharmila;Party;Telangana;Andhra Pradesh;Telangana Chief Minister;TeluguSat, 21 Aug 2021 19:33:00 GMTపండుగ రోజు. ఏడాదికి ఓసారి వచ్చే రాఖీ పర్వదినం రోజుల తోబుట్టువులతో రాఖీలు కట్టించుకోవాలని సోదరులు, అలాగే తమకు రక్షగా నిలిచే అన్నదమ్ముళ్లకు రక్షాబంధన్‌ కట్టాలని సోదరీమణులు వందలు, వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ రాఖీ పండుగ రోజున ఒక దగ్గర ఉండేలా ప్లాన్‌ చేసుకుంటారు. భారతీయ సాంప్రదాయంలో రాఖీ పండుగకు అంత ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతోంది. అదేమిటంటే- తన అన్న జగన్‌కు సోదరి షర్మిల రాఖీ కట్టేనా? లేదా? అన్నది.

నిజానికి ఏడాది క్రితం వరకు అన్నాచెల్లెళ్లు జగన్‌, సోదరి మధ్య సత్సంబంధాలు ఉండేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. తనకు ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న కారణంతో షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించిందని ఇప్పటికే రాజకీయ వర్గాలే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని సామాన్యులు సైతం చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల తనకు అన్నతో విభేదాలు ఉన్నాయన్న అంశంపై నర్మగర్భంగా స్పందించారు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలపై క్లారిటీ రాలేదు. ఇది జరిగి చాలా రోజులు గడిచాయి. ప్రస్తుతం షర్మిల తెలంగాణలో నిరుద్యోగ దీక్షలు చేస్తూ తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అటు జగన్‌ కూడా అదే విధానంతో ముందుకు వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ ఎక్కడా కలిసిన దాఖలాలు కూడా లేవు.

ఇక ఆదివారం రాఖీ పండుగ కావడంతో సోదరి షర్మిల.. తన అన్న జగన్‌కు రాఖీ కట్టేనా? లేదా? అని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సహజంగా ఒక కడుపున పుట్టినవారు తమ మధ్య ఎన్ని మనస్పర్థలు వచ్చినా, విభేదాలు పొడచూపినా... రాఖీ పండుగ రోజున కలిసిపోవడం చూస్తుంటాం. మరి వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రిగా ఉన్న షర్మిల.. అటు ఏపీలో అధికార పార్టీ అధినేత, పైగా ముఖ్యమంత్రి అయిన అన్న జగన్‌కు రక్షా బంధన్‌ రోజున రాఖీ కట్టి.. తమ​​​​​ మధ్య విభేదాలు లేవని క్లారిటీ ఇస్తారా? కీచులాటలతో దూరంగా ఉంటే సోదరీ, సోదరీమణులకు జగన్‌, షర్మిల స్ఫూర్తిగా నిలుస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.





విశాఖ వైసీపీలో వాసుపల్లి ఊసు ఏది?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>