PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/tdp-leaders-new-josh-in-pathapatnam94d419d4-e76b-449c-9c9a-0aad96a3bdd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/tdp-leaders-new-josh-in-pathapatnam94d419d4-e76b-449c-9c9a-0aad96a3bdd0-415x250-IndiaHerald.jpgశ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు దూకుడు పెంచారు. నిన్న మొన్నటి వరకు నిస్తేజంగా కనిపించిన క్యాడర్‌లో ఇప్పుడు ఒక్కసారిగా కొత్త జోష్‌ కనిపిస్తోంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన టీడీపీ నాయకుుడు కలమట వెంకటరమణకు ఆదరణ పెరుగుతుండటమే తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహానికి ప్రధాన కారణమన్న టాక్‌ విన్పిస్తోంది. ఆ ఎన్నికల్లో ఆయనపై వైసీపీ తరఫున రెడ్డి శాంతి విజయం సాధించారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పని తీరుతో పాతపట్నం నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని, ఆమెపై అTDP leaders new josh in Pathapatnam{#}REDDY SHANTHI;Kothur;Josh;Dookudu;Hanu Raghavapudi;local language;TDP;Telugu;YCP;MLA;Party;Districtపాతపట్నం టీడీపీలో కొత్త జోష్! అ'శాంతి'యే కారణం?పాతపట్నం టీడీపీలో కొత్త జోష్! అ'శాంతి'యే కారణం?TDP leaders new josh in Pathapatnam{#}REDDY SHANTHI;Kothur;Josh;Dookudu;Hanu Raghavapudi;local language;TDP;Telugu;YCP;MLA;Party;DistrictSat, 21 Aug 2021 00:02:38 GMTజిల్లా పాతపట్నం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు దూకుడు పెంచారు. నిన్న మొన్నటి వరకు నిస్తేజంగా కనిపించిన క్యాడర్‌లో ఇప్పుడు ఒక్కసారిగా కొత్త జోష్‌ కనిపిస్తోంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన టీడీపీ నాయకుుడు కలమట వెంకటరమణకు ఆదరణ పెరుగుతుండటమే తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహానికి ప్రధాన కారణమన్న టాక్‌ విన్పిస్తోంది. ఆ ఎన్నికల్లో ఆయనపై వైసీపీ తరఫున రెడ్డి శాంతి విజయం సాధించారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పని తీరుతో పాతపట్నం నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారని, ఆమెపై అసంతృప్తి కలమట వెంకటరమణకు కలిసొచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అధికార పార్టీ ఎమ్మెల్యేపై వస్తున్న వ్యతిరేకతను స్థానిక టీడీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రభుత్వ వైపల్యాలను నిత్యం ఎండగడుతూ ఏదో ఒక నిరసన కార్యక్రమాలతో క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. ఇటీవల కొత్తూరు మండల కేంద్రంలో రహదారుల మరమ్మత్తులు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందట. దీంతో వెంకటరమణ నిత్యం క్యాడర్‌ను యాక్టివ్‌గా ఉంచే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ వాతావరణంతో పాతపట్నం టీడీపీలో కొత్త జోష్‌ కనిపిస్తోంది.

2019 ఎన్నికల ప్రచారంలో కలమట వెంకటరమణ లోకల్- నాన్ లోకల్ అంశాన్నే ప్రధానంగా ప్రచారం చేసినప్పటికీ.. అప్పుడు ప్రజలు దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న అసంతృప్తి వారిలో నెలకొందట. అంతేకాకుండా ఆమె బంధువులు తమ ఇష్టారాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితులు పాతపట్నంలో టీడీపీకి ఆదరణ పెంచుతున్నాయన్న చర్చ జరుగుతోంది.

పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెతను కలమట వెంకటరమణ పాతపట్నం నియోజకవర్గంలో అనుసరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఏ ప్రజలైతే 2019 ఎన్నికల్లో తనను తిరస్కరించారో ఆ ప్రజలతోనే మళ్లీ జై కొట్టించుకోవాలని అనే విధంగా ఆయన కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారట. మరి పాతపట్నంలో పాతరోజుల కోసం వెంకటరమణ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.



పాతపట్నం టీడీపీలో కొత్త జోష్! అ'శాంతి'యే కారణం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>