EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ys-sharmila7bc48a33-f8e6-4c0b-8637-a96c8f583ad7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ys-sharmila7bc48a33-f8e6-4c0b-8637-a96c8f583ad7-415x250-IndiaHerald.jpgవైఎస్‌ కుటుంబం నుంచి వచ్చిన మరో నాయకురాలు షర్మిల రాజకీయ రంగంలో తన సత్తా చాటాలని భావించారు. అనుకున్నదే తడవుగా తెలంగాణను తన రాజకీయ క్షేత్రంగా ఎన్నుకుని అడుగులు వేశారు.. తెలంగాణలో వైఎస్‌ రాజ్యం తెస్తామన్న నినాదంతో పార్టీ ప్రారంభించారు. అయితే.. ఆమె పార్టీకి అనుకున్నంత క్రేజ్ రాలేదు.. ఆశించినంతగా పార్టీలో చేరికలు లేవు.. చేరికలు లేకపోయినా.. అప్పుడే రాజీనామాలు కూడా మొదలుకావడం షర్మిలకు షాక్ ఇస్తోంది. ఆ పార్టీకి చెందిన మహిళా నేత ఇందిరాశోభన్ నిన్న రాజీనామా చేశారు. అంతకు ముందు కేకే రెడ్డి అనే నేత వెళ్లిys sharmila{#}రాజీనామా;Reddy;Sharmila;Partyవైఎస్ షర్మిల.. సీఎం కుర్చీ సరే.. పార్టీ ఉంటుందా..?వైఎస్ షర్మిల.. సీఎం కుర్చీ సరే.. పార్టీ ఉంటుందా..?ys sharmila{#}రాజీనామా;Reddy;Sharmila;PartySat, 21 Aug 2021 09:14:00 GMTవైఎస్‌ కుటుంబం నుంచి వచ్చిన మరో నాయకురాలు షర్మిల రాజకీయ రంగంలో తన సత్తా చాటాలని భావించారు. అనుకున్నదే తడవుగా తెలంగాణను తన రాజకీయ క్షేత్రంగా ఎన్నుకుని అడుగులు వేశారు.. తెలంగాణలో వైఎస్‌ రాజ్యం తెస్తామన్న నినాదంతో పార్టీ ప్రారంభించారు. అయితే.. ఆమె పార్టీకి అనుకున్నంత క్రేజ్ రాలేదు.. ఆశించినంతగా పార్టీలో చేరికలు లేవు.. చేరికలు లేకపోయినా.. అప్పుడే రాజీనామాలు కూడా మొదలుకావడం షర్మిలకు షాక్ ఇస్తోంది.


ఆ పార్టీకి చెందిన మహిళా నేత ఇందిరాశోభన్ నిన్న రాజీనామా చేశారు. అంతకు ముందు కేకే రెడ్డి అనే నేత వెళ్లిపోయాడు. ఇలా వరుస రాజీనామాల నేపథ్యంలో వైఎస్ షర్మిల రాజకీయ భవితవ్యం ఏమవుతుందన్న చర్చ మొదలైంది. అసలు వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పుడే.. ఈ చర్చ మొదలైంది. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు అవసరమైన పొలిటికల్ స్పేస్ ఉందా అన్న చర్చ జరిగింది. అయితే నాయకులు ఎప్పుడూ స్పేస్ చూసుకుని రారు.. స్పేస్ క్రియేట్ చేసుకుంటారని షర్మిల పార్టీ నేతలు చెప్పుకున్నారు.


అయితే.. షర్మిల పార్టీ పెట్టి మూడు, నాలుగు నెలలు అవుతున్నా.. ఆ పార్టీ ఉనికి చాటుకోవడం లేదు. అసలు ఆ పార్టీ ఒకటి ఉందన్న సంగతి జనానికి చేరడం లేదు. పార్టీ నిత్యం జనంలో ఉండాలి.. జనం సమస్యలపై పోరాడాలి.. అప్పుడే ప్రజలకు చేరువవుతోంది. అయితే ఈ దిశగా షర్మిల అసలేమీ చేయలేదని చెప్పలేం.. ఆమె నిరుద్యోగ అంశాన్ని తలకెత్తుతుని హైదరాబాద్‌లో దీక్ష చేశారు. ప్రతి వారంలో ఓ రోజు ఆత్మహత్య చేసుకున్న ఓ నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఒక రోజు దీక్ష చేస్తున్నారు.


రాజకీయ పార్టీకి డైనమిజం అవసరం.. ఆ పార్టీ పట్ల నాయకులు ఆకర్షితులు కాకపోతే.. ఇక జనం మాత్రం ఎలా పట్టించుకుంటారన్నది చూడాలి. అయితే షర్మిల పార్టీ అప్పుడే చేతులెత్తేసిందని కూడా చెప్పలేం. ఏవ్యూహం లేకుండా షర్మిల ముందుకు వెళ్తారనీ చెప్పలేం.. షర్మిల భవితవ్యం తేలాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.





సీక్రెట్ గా కానిచ్చేసి.. ఏమీ తెలియనట్టు బిల్డప్..?

కెసిఆర్ కొత్త పథకం.. అందరికీ బైకులు?

బర్త్ డే : నడుము చూసినా చూడకపోయినా... ఆ అమాయకత్వానికే ఫిదా !

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త?

అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>