PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/politics_analysis/cheers-when-drinking-alchohal04d2af28-7a55-44fe-ac40-a3aba89f51f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/politics_analysis/cheers-when-drinking-alchohal04d2af28-7a55-44fe-ac40-a3aba89f51f7-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆబ్కారీ శాఖ నుంచి భారీగా ఆదాయం వ‌స్తోంది. తెలంగాణ వ‌చ్చిన స‌మ‌యంలో కంటే ఇప్పుడు ఆబ్కారీ శాఖ నుంచి ఆదాయం మూడురేట్లు పెరిగింది. 2014 –15 ఆర్థిక సంవత్సరంలో రూ. 10.88 వేల కోట్లు రాగా.. 2020– 21లో ఏకంగా రూ.27.28 వేల కోట్ల ఆదాయం వ‌చ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లోనే రూ.9,509 కోట్ల ఇన్‌క‌మ్ స‌మ‌కూరింది. మరింత ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అర్ద‌రాత్రి వ‌రకు వైన్స్ న‌డిపిస్తు, లిక్క‌ర్ రేటును పెంచేసింది ప్ర‌భుత్వం. అదే విధంగా సేల్స్ పtengana licker{#}2020;Hanu Raghavapudi;Government;Telangana;Coronavirusకిక్కెక్కిస్తోంది : మూడురేట్లు పెరిగిన తెలంగాణ లిక్క‌ర్ ఆదాయం..!కిక్కెక్కిస్తోంది : మూడురేట్లు పెరిగిన తెలంగాణ లిక్క‌ర్ ఆదాయం..!tengana licker{#}2020;Hanu Raghavapudi;Government;Telangana;CoronavirusSat, 21 Aug 2021 10:37:38 GMT తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆబ్కారీ శాఖ నుంచి భారీగా ఆదాయం వ‌స్తోంది. తెలంగాణ వ‌చ్చిన స‌మ‌యంలో కంటే ఇప్పుడు ఆబ్కారీ శాఖ నుంచి ఆదాయం మూడురేట్లు పెరిగింది. 2014 –15 ఆర్థిక సంవత్సరంలో రూ. 10.88 వేల కోట్లు రాగా.. 2020– 21లో ఏకంగా రూ.27.28 వేల కోట్ల ఆదాయం వ‌చ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లోనే రూ.9,509 కోట్ల ఇన్‌క‌మ్ స‌మ‌కూరింది. మరింత ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అర్ద‌రాత్రి వ‌రకు వైన్స్ న‌డిపిస్తు, లిక్క‌ర్ రేటును పెంచేసింది ప్ర‌భుత్వం. అదే విధంగా సేల్స్ పెంచేందుకు అధికారుల‌కు టార్గెట్ కూడా పెట్టింది.

 2020–21లో లిక్కర్ అమ్మ‌కాలు రూ. 27.28 వేల కోట్లను దాటింది. తెలంగాణ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే ఏడు సంవ‌త్స‌రాల‌లో రూ. 1,35,631 కోట్ల ఆదాయం మద్యం ద్వారా వ‌చ్చింది. గ‌తేడాది క‌రోనాతో ప్రపంచమంతా అత‌లాకుత‌ల‌మ‌యింది. అన్ని వ్యాపార, వాణిజ్య రంగాలు కుదేల‌య్యాయి, కానీ ఆబ్కారీ శాఖ  ఆదాయం మాత్రం పెరిగింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా స‌మ‌యంలో ఆదాయం వ‌చ్చింది. ఈ సంవ‌త్స‌రంలో మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా రూ. 27.28 వేల కోట్లు స‌మ‌కూరింది.


   సమయం దొరికినప్పుడుల్లా లిక్కర్ ధరలను పెంచుతూ వ‌స్తోంది ప్ర‌భుత్వం. 2016లో 10 నుంచి 15 శాతం, 2019 డిసెంబర్‌‌‌‌లో 20 శాతం, ఆ తర్వాత 2020 మే లో కరోనా సమయంలో పాండమిక్‌‌‌‌ సెస్‌‌‌‌ పేరుతో మరో 22శాతం మొత్తంగా మూడుసార్లు ధ‌ర‌ల‌ను పెంచేసింది. పెంచిన ధ‌ర‌ల‌ను అన్ని రాష్ట్రాలు త‌గ్గించిన తెలంగాణ మాత్రం త‌గ్గించ‌డం లేదు.

   ఆదాయం పెంచుకోవడంలో భాగంగా వైన్స్‌‌‌‌, బార్ల వేళలను పెంచి అర్ధరాత్రి వరకు తెరిచేందుకు అనుమతించింది ప్ర‌భుత్వం. గతంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటలకు వ‌రకు తెరిచి ఉంచేవాళ్లు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో అర్ధరాత్రి 11 గంటల వరకు వైన్స్‌ను తెరిచే ఉంచుతున్నారు. మరోవైపు బార్ల సంఖ్య‌ను ఎప్ప‌టిక‌ప్పుడు పెంచేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చూస్తోంది. గతంలో 1,052 బార్లు ఉండగా.. కొత్తగా మరో 159 బార్లకు అనుమతి ఇచ్చింది ప్ర‌భుత్వం. రాష్ట్రంలో రోజురోజుకు బీర్ల అమ్మ‌కాలు త‌గ్గి లిక్క‌ర్ అమ్మ‌కాలు పెరిగుతున్నాయి. 2020–21లో 3.35 కోట్ల కేసుల లిక్కర్‌‌‌‌, 2.73 కోట్ల కేసుల బీర్లు అమ్ముడ‌య్యాయి. ధరలు పెరగడం వ‌ల్ల‌ బీరు బదులు లిక్కర్‌‌‌‌కు అలవాటు పడుతున్నారని చెబుతున్నారు  ఆబ్కారీ శాఖ‌ అధికారులు.



కిక్కెక్కిస్తోంది : మూడురేట్లు పెరిగిన తెలంగాణ లిక్క‌ర్ ఆదాయం..!

భారతదేశాన్ని కాపాడండి.. ఏకమైన ప్రతిపక్షాలు..?

కెసిఆర్ కొత్త పథకం.. అందరికీ బైకులు?

బర్త్ డే : నడుము చూసినా చూడకపోయినా... ఆ అమాయకత్వానికే ఫిదా !

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త?

అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>