MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrdb1408b8-7789-49de-9944-b23a1ce74f66-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrdb1408b8-7789-49de-9944-b23a1ce74f66-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా రంగంలో ఎన్టీయార్ ది ఒక వెలుగు బాట. ఆయన అన్ని జానర్లలోనూ సినిమాలు చేసి తనకు సాటి ఎవరూ లేరు అనిపించుకున్నారు. ఇక ఎన్టీయార్ తో పోటా పోటీగా నటించిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో అగ్ర తాంబూలం సావిత్రికి ఇవ్వాలి. ntr{#}savitri;Savithri;Rayalaseema;NTR;Darsakudu;Director;prema;Love;Blockbuster hit;Audience;Cinema;Teluguఎన్టీయార్ సావిత్రి సాహసానికి జనం ఇచ్చిన తీర్పు... ?ఎన్టీయార్ సావిత్రి సాహసానికి జనం ఇచ్చిన తీర్పు... ?ntr{#}savitri;Savithri;Rayalaseema;NTR;Darsakudu;Director;prema;Love;Blockbuster hit;Audience;Cinema;TeluguSat, 21 Aug 2021 20:00:00 GMTతెలుగు సినిమా రంగంలో ఎన్టీయార్ ది ఒక వెలుగు బాట. ఆయన అన్ని జానర్లలోనూ సినిమాలు చేసి తనకు సాటి ఎవరూ లేరు అనిపించుకున్నారు. ఇక ఎన్టీయార్ తో పోటా పోటీగా నటించిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు.

అలాంటి వారిలో అగ్ర తాంబూలం సావిత్రికి ఇవ్వాలి. ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా, ప్రేమికులుగా అనేక సినిమాలలో నటించారు. అవన్నీ సూపర్ డూపర్ హిట్లే. మిస్సమ్మలో వీరి నటన, ప్రేమ కలహాలు ఎవరూ మరచిపోలేరు. గుండమ్మ కధలో భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పేలా నటించారు. ఇలా వరసబెట్టి సినిమాలు చేస్తూ హిట్ కాంబినేషన్ అనిపించుకున్న ఈ ఇద్దరూ ఒక సినిమా విషయంలో సాహసమే చేశారు.

ఆ సినిమావే రక్తసంబంధం. ఈ మూవీలో ఎన్టీయార్ కి చెల్లెలుగా సావిత్రి నటించింది. మిగిలిన పాత్రలు అన్నీ కూడా పెద్దగా ప్రాధ్యాన్యత లేనివే. ఈ ఇద్దరి మధ్యనే కధ సెంటిమెంట్ మొత్తం తిరుగుతుంది. ఈ సినిమాలో నటించడానికి వీరిద్దరూ ఒప్పుకున్నారు అని తెలియగానే చిత్ర సీమ ఉలిక్కిపడింది. అప్పటిదాకా ప్రేమికులుగా కనిపించిన వీరు సడెన్ గా అన్నా చెల్లెళ్ళు అంటే జనాలు రిసీవ్ చేసుకోరు అని అంతా అనుకున్నారు. అయినా వీరు ఎక్కడా తగ్గలేదు. అలాఏ నిర్మాత, దర్శకుడు కూడా తీస్తామనే అన్నారు. అలా వచ్చిన రక్త సంబంధం ఆ రోజులలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఎన్టీయార్ సావిత్రిల నటనకు థియేటర్లలో ప్రేక్షకులు కన్నీరే పెట్టారు. నిజంగా అన్నాచెల్లెళ్ళే అనేంతగా ఆ పాత్రలను పండించి ఈ అద్భుత కళాకారులు జన నీరాజనాలు అందుకున్నారు. దాంతో ఈ సినిమా ఆడదు అన్న వారే షాక్ తినాల్సి వచ్చింది. మొత్తానికి నటుడు అన్న వాడు పాత్రలు ఏవైనా సరే జీవించాలి అన్న దానికి ఎన్టీయార్, సావిత్రి ఒక ఉదాహరణగా చెప్పాలి. చిత్రమేంటి అంటే ఆ తరువాత ఈ ఇద్దరూ మళ్ళీ భార్యాభర్తలుగా నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్లు కొట్టాయి. ఇలా తెలుగు చలన చిత్ర సీమలో వీరు కొత్త రికార్డులే క్రియేట్ చేశారు అనుకోవాలి.








ఎన్టీయార్ సావిత్రి సాహసానికి జనం ఇచ్చిన తీర్పు... ?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>