PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/world-milk-day5e985a48-6251-4b82-b08a-974ce19b7f47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/world-milk-day5e985a48-6251-4b82-b08a-974ce19b7f47-415x250-IndiaHerald.jpgశాస్త్ర‌సాంకేతిక‌త అభివృద్ది చెందుతున్న కొద్ది నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. వ‌జ్రాల‌ను, మ‌నం నిత్యం వినియోగించే మాంస‌, పాలు, పెరుగు, క‌ల‌ప ను కృత్రిమంగా సిద్దం చేసేందుకు శాస్త్ర‌జ్ఞులు సిద్దం అవుతున్నారు. చివ‌రికి మ‌నిషి ర‌క్తాన్ని కూడా ఆర్టిఫిషియ‌ల్ గా రెడీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌కృతితో సంబంధం లేకుండా కాలుష్యానికి దూరంగా ఈ కృత్రిమ ఆవిష్క‌ర‌ణ‌ల దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. వజ్రాలు కార్బన్‌తో తయారవుతాయ‌ని చాలా వరకు తెలిసిన విష‌యమే. అయితే ఒక్కో వజ్రం వెనుక కోట్ల ఏళartificial{#}Shakti;history;Manamఅంతా కృత్రిమం.. మాంసం, ర‌క్తం, పాలు, పెరుగు..!అంతా కృత్రిమం.. మాంసం, ర‌క్తం, పాలు, పెరుగు..!artificial{#}Shakti;history;ManamFri, 20 Aug 2021 14:01:31 GMT శాస్త్ర‌సాంకేతిక‌త అభివృద్ది చెందుతున్న కొద్ది నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. వ‌జ్రాల‌ను, మ‌నం నిత్యం వినియోగించే మాంస‌, పాలు, పెరుగు, క‌ల‌ప ను కృత్రిమంగా సిద్దం చేసేందుకు శాస్త్ర‌జ్ఞులు సిద్దం అవుతున్నారు. చివ‌రికి మ‌నిషి ర‌క్తాన్ని కూడా ఆర్టిఫిషియ‌ల్ గా రెడీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌కృతితో సంబంధం లేకుండా కాలుష్యానికి దూరంగా ఈ కృత్రిమ ఆవిష్క‌ర‌ణ‌ల దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి.


  వజ్రాలు కార్బన్‌తో తయారవుతాయ‌ని చాలా వరకు తెలిసిన విష‌యమే. అయితే ఒక్కో వజ్రం వెనుక కోట్ల ఏళ్ల చరిత్ర దాగి ఉంటుంది. ఏళ్ల‌కు ఏళ్లు విప‌రీత‌మైన‌ ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో కార్బన్‌ వజ్రంగా మారుతుంది. అయితే భూమి లోపల ఉన్న‌ పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి వజ్రాలను చౌకగా తయారుచేయాలన్న ప్రయత్నం జ‌రుగుతోంది. జిర్కోన్‌ వంటి మూలకాల సాయంతో వ‌జ్రాన్ని గ‌తంలో త‌యారు చేశారు కూడా.


ఇదే సమయంలో సహజ వజ్రాల మైనింగ్‌లో ఇమిడి ఉన్న అనేక నైతిక అంశాల కారణంగా ఇప్పుడు డీబీర్స్‌ వంటి కంపెనీలు గనుల నిర్వ‌హ‌ణ‌ను ఆపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి. 2018లోనే పూర్తిగా కృత్రిమ వజ్రాలతోనే ఆభరణాలను తయారు చేయాలని తీర్మానించింది డిబీర్స్‌. ప్రపంచంలోనే అతిపెద్ద ఆభరణాల తయారీ సంస్థ పండోరా కూడా గనుల్లోంచి వెలికితీసిన వజ్రాలను వాడబోమని నిర్ణ‌యం తీసుకోనుంది.

 
పాల‌లో ఉండే కొవ్వులు, కొన్ని విటమిన్లు, ఖనిజాలు, నీళ్లు వీటన్నింటినీ తగుమోతాదులో కలిపేస్తే పాలు తయారు చేయ‌వ‌చ్చున‌ని.. ఇంత పనికి.. ఆవుల్ని, గేదెలను మేపడం, వాటి వ్యర్థాలను ఎత్తి పారేసి శుభ్రం చేసుకోవడం, పాలు పిత‌క‌డం, ప్యాకెట్లలో నింప‌న‌వ‌స‌రం లేకుండా కృత్రిమంగా జంతువుల‌తో సంబంధం లేకుండా పాల‌ను త‌యారు చేయ‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు.


పెర్‌ఫెక్ట్‌ డే అనే కంపెనీ కొన్ని రకాల శిలీంద్రాల్లో మార్పులు చేయడం ద్వారా అవి పాల లాంటి ద్రవాలను ఉత్పత్తి చేసే విధంగా త‌యారు చేశారు. ఇమాజిన్‌ డెయిరీ కూడా పశువుల అవసరం లేని పాల ఉత్పత్తుల తయారీకి మనం బ్రెడ్‌ లాంటి వాటిని తయారు చేసేందుకు వాడే ఈస్ట్‌ సాయం తీసుకుని కృత్రిమ పాలు త‌యారికి ప్ర‌య‌త్నిస్తోంది. ఈ రకమైన కొత్త రకం పాలు, పాల ఉత్పత్తులు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.


కృత్రి మాంసం  ఉత్ప‌త్తికి ఎంజైమ్స్‌తో కావాల్సినంత మాంసం సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇటీవలే ఓ మోస్తరు విజయం సాధించారు కూడా పదేళ్ల కిందటే ఖైమా కొట్టిన మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేయగలిగినా కొన్ని ఇబ్బందులతో ఆ ప్ర‌య‌త్నం ఆగిపోయింది. 2018లో ఇజ్రాయెల్‌ కంపెనీ ఆలెఫ్‌ ఫామ్స్‌ తొలిసారి ల్యాబ్‌లోనే స్టీక్‌ (మాంసపు ముక్క)ను తయారు చేయ‌గ‌లిగింది.


  మన శరీరపు ఆరోగ్యం గురించి ఠక్కున చెప్పేయగల శక్తి రక్తానికి ఉందంటారు. అవయవాలన్నింటికీ శక్తినిచ్చే ఆక్సిజన్‌ను సరఫరా చేయడంతో పాటు మలినాలు, వ్యర్థాలను బయటకు పంపేందుకు సాయపడుతుంది రక్తం. యుద్ధంలో లేదా ప్రమాద సమయాల్లో కోల్పోయే రక్తాన్ని దాతల రక్తంతో భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నా అది స్వచ్ఛమైన వ్యవహారం కాదు. పైగా మన సొంత రక్తం పనిచేసినట్లు ఇతరుల రక్తం పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు.


  చివ‌రికి మ‌నిషి ర‌క్తం కూడా కృత్రిమంగా త‌యారు చేసేందుకు 50 ఏళ్లుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు పరిశోధనల కార‌ణంగా 50 ఏళ్లుగా సాధ్యం కాని కృత్రిమ రక్తం తయారీ త్వరలో సాధ్యం కానుంది. 2017లో మానవ మూలకణాలను రక్త కణాలుగా మార్చే పద్ధతులను రెండు బృందాలు ఈ రెండు సక్రమంగా పనిచేస్తాయని రుజువైతే.. త్వరలోనే కృత్రిమ రక్తం అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు.



అంతా కృత్రిమం.. మాంసం, ర‌క్తం, పాలు, పెరుగు..!

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>