SignaturesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/guntur-murderba685912-4cbc-42a6-9213-07261c0dc4b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/guntur-murderba685912-4cbc-42a6-9213-07261c0dc4b9-415x250-IndiaHerald.jpgరాజకీయం.. ఓ పవిత్రమైన వ్యాసంగం.. అనే స్వతంత్ర్యకాలం నాటి రోజులు పోయాయి.. ఇప్పటి రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడుకోవడం ఓ బిగ్ జోక్.. అయితే.. విలువల సంగతి పక్కకు పెడదాం.. అవి ఎలాగూ తగ్గిపోతున్నాయి. కానీ.. కనీసం మానవత్వం.. సున్నితమైన అంశాలపై కూడా రాజకీయం సాగుతోంది.. ఈ ధోరణి ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఏదైనా ఆడపిల్లపై అత్యాచారమో.. హత్యో.. జరిగిందంటే.. ఇక రాజకీయం మొదలవుతుంది. ఆ హత్యకు గురైన మహిళ సామాజిక వర్గం కూడా స్పందనను ప్రభావితం చేస్తుంది. ఇక ప్రతి పార్టీ నాయకులూ పరామర్శలకు పోటీపడతguntur murder{#}Press;Girl;media;Government;Partyఆడపిల్ల చావుపై రాజకీయమా..! ఆంధ్ర దేశమా సిగ్గుపడు..!?ఆడపిల్ల చావుపై రాజకీయమా..! ఆంధ్ర దేశమా సిగ్గుపడు..!?guntur murder{#}Press;Girl;media;Government;PartyFri, 20 Aug 2021 23:02:37 GMT

ఆ హత్యకు గురైన మహిళ సామాజిక వర్గం కూడా స్పందనను ప్రభావితం చేస్తుంది. ఇక ప్రతి పార్టీ నాయకులూ పరామర్శలకు పోటీపడతారు. ఇక విపక్షాలైతే ప్రభుత్వం చేతకానితనం అంటూ రెచ్చిపోతాయి. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరతాయి. నాగరిక సమాజంలో ఈ స్పందన అవసరం.. అయితే.. ఆ పరామర్శ చిత్తశుద్ధితో జరుగుతుందా.. అంటే అనుమానమే.. పరామర్శ తర్వాత ఇక మొదలవుతుంది ప్రెస్ మీట్.. సర్కారుపై విమర్శలు.. మీడియాలో ప్రచారం కోసం తాపత్రయం.


ఇటీవల గుంటూరులో బీటెక్ విద్యార్థినిని నడిరోడ్డుపై నరికి చంపిన ఘటనలో ఇలాగే జరిగింది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధితురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించింది. నిందితుడని అరెస్టు చేసింది. బాధితురాలి కుటుంబానికి దాదాపు 15 లక్షల వరకూ పరిహారం వెంటనే అందించింది. అంత వరకూ మెచ్చుకోవాల్సిందే. అయితే.. ఆ డబ్బు ఇచ్చిన విషయాన్ని ఘన కార్యంగా ప్రచారం చేసుకోవడం.. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడించడం రాజకీయ లబ్ది కోసమే అన్నట్టుగా సాగింది.


మరీ విచిత్రం ఏంటంటే.. ప్రభుత్వం నిందితుడిని అరెస్టు చేసినా.. చట్టం తన పని తాను చేసుకుపోతున్నా.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రాజకీయం మొదలైంది. ఆడపిల్ల ప్రాణానికి వెల కడతారా.. ఇదేనా అంటూ ప్రచారాలు.. అటు అధికార పక్షం.. ఇటు ప్రతి పక్షం.. ఇద్దరి ప్రవర్తనలోనూ రాజకీయమే అసలు లక్ష్యంగా మారిపోయింది.  ఏంటీ ధోరణి.. ఆడపిల్ల చావుపై రాజకీయమా..! ఆంధ్ర దేశమా సిగ్గుపడు..!?


పట్టపగలు ఇంట్లోకి చొరబడి.. కత్తితో దాడిచేసి..

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>