• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆప్ఘన్ లో భారతీయులకు చుక్కలు-కాబూల్ చేరేందుకు కష్టాలు- విమానాల్లో సీట్ల కరవు-ప్రత్యేక సెల్

|

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో భారత్ కు పరుగులు తీస్తున్న మన వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆప్ఘనిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వీరంతా రాజధాని కాబూల్ కు చేరేందుకు రవాణా సదుపాయాలు కరవవడం, అదే సమయంలో కాబూల్ ఎయిర్ పోర్టులో నెలకొన్న పరిస్దితులు వీరికి ఇబ్బందికరంగా మారిపోతున్నాయి. దీంతో వీరిని సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు రంగంలోకి దిగిన భారత ఎంబసీ అధికారులు.. యూఎస్ ఆర్మీ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తమ పౌరుల్ని రక్షించుకోవడంలో బిజీగా ఉన్న యూఎస్ ఆర్మికి మన వాళ్లపై దృష్టిపెట్టేంత తీరిక లేకపోవడం సమస్యగా మారింది.

 ఆప్ఘన్ లో క్షీణిస్తున్న పరిస్ధితులు

ఆప్ఘన్ లో క్షీణిస్తున్న పరిస్ధితులు

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో పరిస్ధితులు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజధాని కాబూల్ కు సునాయాసంగా చేరుకున్న వారంతా ఇప్పుడు నానా సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాలిబన్ల దురాక్రమణతో రవాణా సదుపాయాల కొరత ఏర్పడటం, ఆప్ఘనిస్తాన్ పౌరులతో పాటుప భారతీయులు, ఇతర దేశాల పౌరులు కూడా ఎప్పుడు దేశం వదిలి పారిపోదామా అని ప్రయత్నిస్డుండటంతో రోజురోజుకీ పరిస్ధితులు క్షీణిస్తున్నాయి. రవాణా సదుపాయాల కొరత కారణంగా రోజుల కొద్దీ ఎక్కడి వారక్కడే ఉండిపోవాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి.

 ఆప్ఘన్ లో భారతీయుల వ్యధ

ఆప్ఘన్ లో భారతీయుల వ్యధ

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగుతున్న సమయంలో వేల సంఖ్యలో ఆ దేశానికి భారతీయులు తరలివెళ్లారు. ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు, ఇతర పనుల కోసం ఆ దేశానికి వెళ్లి అక్కడే పాగా వేశారు. కానీ తాజాగా అనతి కాలంలోనే అమెరికా, బ్రిటన్ దళాలు ఆఫ్ఘన్ వదిలి వెళ్లిపోవడంతో మారినపరిస్ధితుల్లో తాలిబన్లు పాగా వేశారు. దీంతో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఎక్కడో ఒక చోట తాలిబన్ల బాధితులుగా మారిన భారతీయులు.. ఇప్పుడు అక్కడే ఉంటే తాలిబన్లకు టార్గెట్ అయ్యేలా ఉన్నారు. దీంతో వీరంతా ఇప్పుడు తట్టా బుట్టా సర్దుకుని స్వదేశానికి వెళ్లేందుకు పరుగులు తీస్తున్నారు. కానీ అదంత సులువుగా కనిపించడం లేదు.

 తాలిబన్లతో కొరవడిన సమన్వయం

తాలిబన్లతో కొరవడిన సమన్వయం

ఆప్ఘనిస్తాన్ లో మారిన పరిస్దితుల నేపథ్యంలో దేశం వదిలి వెళ్లేందుకు సిద్ధమైన వారిని ఆపేందుకు తాలిబన్లు ఇష్టపడటం లేదు. అయితే దేశం వదిలి వెళ్లాలంటే కచ్చితంగా కాబూల్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన పరిస్ధితుల్లో అక్కడ నెలకొన్న పరిస్ధితులు తాలిబన్లతో పాటు అందరినీ ఇబ్బందుల్లోకి నెడుతున్మాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న భారతీయులతో కాబూల్ ఎయిర్ పోర్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతీయ ఎంబసీకి సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్మాయి. వీరిని సురక్షితంగా కాబూల్ చేర్చాలంటే స్ధానికంగా ఎక్కడికక్కడ తాలిబన్లు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు దాటుకుని రావాల్సిందే. కానీ అక్కడ చెక్ పోస్టులు చూస్తున్న తాలిబన్ నేతలతో భారతీయ ఎంబసీకి సమన్వయం కొరవడింది.

 అతికష్టం మీద భారత్ చేరిన దౌత్యసిబ్బంది

అతికష్టం మీద భారత్ చేరిన దౌత్యసిబ్బంది

ఆప్ఘనిస్తాన్ లో పరిస్ధితులు రోజురోజుకీ క్షీణిస్తుండటంతో కాబూల్ లోని భారత ఎంబసీని మూసేశారు. ఇందులో పనిచేస్తున్న వారందరినీ కాబూల్ ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా మధ్యలో తాలిబన్ల నుంచి క్లియరెన్స్ తీసుకునే విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో భారత్ నుంచి వీరిని తెచ్చేందుకు వెళ్లిన సీ17 ఎయిర్ ఫోర్స్ విమానం కేవలం 40 మందిని మాత్రమే సురక్షితంగా ఢిల్లీ తీసుకురాగలిగింది. మిగతా వారంతా అక్కడే ఉండిపోయారు. కాబూల్ లో ఉన్న దౌత్య వేత్తలు, దౌత్య సిబ్బంది పరిస్ధితే ఇలా ఉంటే సాధారణ భారతీయుల పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 అమెరికా సాయం కోసం ఎదురుచూపులు

అమెరికా సాయం కోసం ఎదురుచూపులు

ప్రస్తుతం కాబూల్ ఎయిర్ పోర్టును ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించిన తాలిబన్లు కాకుండా అమెరికా సైన్యమే కాపలా కాస్తోంది. అమెరికా సేనల చేతుల్లో ఉన్న ఎయిర్ పోర్టుకు భారతీయులు చేరడం, అక్కడి నుంచి భారత్ చేరాలంటే అమెరికా సాయం తీసుకోక తప్పని పరిస్ధితి నెలకొంది. అయితే అమెరికా భారత్ కు అండగానే నిలుస్తోంది. ఓసారి కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటే అక్కడి నుంచి భారతీయుల్ని స్వదేశానికి పంపే విషయంలో సాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే కాబూల్ ఎయిుర్ పోర్టుకు చేరుకోవడమే గగనంగా మారడంతో భారతీయులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటివరకూ భారత్ కు చేరిన దౌత్యవేత్తలు, ఇతర వృత్తి నిపుణుల్ని కూడా అమెరికా సైన్యమే దగ్గరుండి మన ఎయిర్ ఫోర్స్ విమానాల్లో స్వదేశానికి పంపింది.

 భారతీయుల కోసం ప్రత్యేక సెల్

భారతీయుల కోసం ప్రత్యేక సెల్

ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి సురక్షితంగా తెచ్చేందుకు విదేశాంగశాఖ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు కాబూల్ చేరేందుకు వీలుగా సమాచారం ఇచ్చేందుకు అక్కడి దౌత్య అధికారులు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. 24 గంటలూ పనిచేసేలా ఏర్పాటు చేసిన ఈ సెల్ లో 20 మంది సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. వీరు భారతీయులు కాబూల్ కు చేరేందుకు అవసరమైన వివరాలు, ఇతర సాయం కూడా అందిస్తారు. ప్రస్తుతం ఈ సెల్ అంచనా ప్రకారం ఆప్ఘనిస్తాన్ లో దాదాపు 450 మంది భారతీయులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరిని రక్షించేందుకు దౌత్య అధికారులు తాలిబన్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రావిన్స్ ల బోర్డర్ చెక్ పోస్టుల వద్ద కాపలా కాస్తున్న తాలిబన్లు అనుమతి లేకుండా ఎవరినీ ఇళ్ల నుంచి బయటికి రానీయడం లేదు. కాబూల్ లో ఉన్న తాలిబన్ అగ్రనేతల నుంచి వస్దున్న సమాచారంతోనే వీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

English summary
in wake of latest taliban takeover of afghanistan, indians evacuations from kabul will become tough with transport and other issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X