SignaturesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/srikakulam-4cc52952-34e0-443f-982c-a27aabdf7f11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/srikakulam-4cc52952-34e0-443f-982c-a27aabdf7f11-415x250-IndiaHerald.jpgముఖ్యంగా కాళింగ సామాజిక‌వ‌ర్గం ప్ర‌బ‌లంగా ఉన్న నేల ఇది. గ‌తంలో ఇక్క‌డి నుంచి ఎన్నికై రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించిన నేత‌లు ఉన్నారు. వారంతా ఎన్టీఆర్ కు ద‌గ్గ‌ర . హ‌నుమంతు అప్ప‌య్య దొర లాంటి లీడ‌ర్ల‌కు జ‌న్మ ఇచ్చింది ఈ ప్రాంత‌మే. ఇక్క‌డే డాక్ట‌రుగా ప్రాక్టీసు చేసి పేరు తెచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి కృపారాణిదీ ఈ ప్రాంత‌మే. రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం అచ్చెన్న సైతం ఈ ప్రాంత ఎమ్మెల్యేనే ! ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల్లో భాగంగా ఈ ప్రాంతం ఉన్నా అభివృద్ధికీ,ఇంకా చెప్పాలంటే పారిశ్రామిక ప్ర‌గ‌తి కి చెప్పుకోదsrikakulam {#}Degree;Bhumika Chawla;Yuva;ATCHANNAIDU KINJARAPU;central government;NTR;Ministerభూమి మ‌న‌దిరో! : ఆ స‌బ్ క‌లెక్ట‌ర్ ప్రయ‌త్న‌మే వినూత్నంభూమి మ‌న‌దిరో! : ఆ స‌బ్ క‌లెక్ట‌ర్ ప్రయ‌త్న‌మే వినూత్నంsrikakulam {#}Degree;Bhumika Chawla;Yuva;ATCHANNAIDU KINJARAPU;central government;NTR;MinisterFri, 20 Aug 2021 17:55:00 GMT
రాజ‌కీయ చైత‌న్యం ఉన్న నేల
ప్ర‌స్తుతం మ‌రో టాపిక్ లో..
పేరు తెచ్చుకుంది..
వికాస్ మ‌ర్మ‌ట్ అనే యువ క‌లెక్ట‌ర్ చొర‌వ
రాజ‌కీయ ప్రాబ‌ల్యాన్ని త‌గ్గించి
భూ క‌బ్జాలు నిలువ‌రించ‌గ‌ల‌దా?
అన్న ప్ర‌శ్న‌కు తావిస్తోంది

ఒక కీల‌క ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌ను
మ‌రో వివాదా స్ప‌ద మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు
మ‌రో సంచ‌ల‌న నాయ‌కుడు అచ్చెన్నాయుడు  
వీరి యుద్ధాల‌కు ఓ విధంగా ర‌ణ భూమి
ఈ ప్రాంత‌మే..అలాంటి నేల‌పై సంస్క‌ర‌ణ
అనుకున్నంత సులువా?

రోజు రోజుకూ క‌బ్జాదారుల చెర‌లో చిక్కుకుపోతున్న ప్ర‌భుత్వ భూముల‌ను కాపాడేందుకు ఓ యువ క‌లెక్ట‌ర్ చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మం శ్రీ‌కాకుళంలో చోటుచేసుకుంది. జిల్లాలో రెవెన్యూ డివిజ‌నల‌లో ఒక్క‌టైన టెక్క‌లి గ్రానైట్ తో స‌హా విలువయిన భూము లకూ ప్ర‌సిద్ధి చెందిన ప్రాంతం. పారిశ్రామికంగా ఎదుగుద‌ల‌కు అవ‌కాశం ఉన్న ప్రాంతం. గ్రానైట్ త‌వ్వ‌కాలు కూడా విప‌రీతంగా జ‌రిగి నా కూడా అవి కూడా పెద్ద‌గా నియంత్ర‌ణ‌కు నోచుకోవ‌డం లేదు. అదేవిధంగా భూక‌బ్జాలను నియంత్రించాల‌ని అధికారులు చూస్తు న్నా గ‌త ప్ర‌భుత్వంలోనూ, ఈ ప్ర‌భుత్వంలోనూ సాధ్యం అయ్యేలా లేదు. ఇలాంటి సంద‌ర్భంలో యువ క‌లెక్ట‌ర్ తీసుకున్న చొర‌వ ఏ మేర‌కు ఫ‌లితాలు ఇస్తాయి.? రాజకీయంగా చైత‌న్యం ఉన్న నేల ఇది. చాలా మంది సీనియ‌ర్ నాయ‌కుల‌కు అన్నం పెట్టిన నేల ఇది.

ముఖ్యంగా కాళింగ సామాజిక‌వ‌ర్గం ప్ర‌బ‌లంగా ఉన్న నేల ఇది. గ‌తంలో ఇక్క‌డి నుంచి ఎన్నికై రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించిన నేత‌లు ఉన్నారు. వారంతా ఎన్టీఆర్ కు ద‌గ్గ‌ర . హ‌నుమంతు అప్ప‌య్య దొర లాంటి లీడ‌ర్ల‌కు జ‌న్మ ఇచ్చింది ఈ ప్రాంత‌మే. ఇక్క‌డే డాక్ట‌రుగా ప్రాక్టీసు చేసి పేరు తెచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి కృపారాణిదీ ఈ ప్రాంత‌మే. రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం అచ్చెన్న సైతం ఈ ప్రాంత ఎమ్మెల్యేనే ! ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల్లో భాగంగా ఈ ప్రాంతం ఉన్నా అభివృద్ధికీ,ఇంకా చెప్పాలంటే పారిశ్రామిక ప్ర‌గ‌తి కి చెప్పుకోద‌గినం త పేరు రాలేదు. ముఖ్యంగా రాజ‌కీయ ఒత్తిళ్లే ప్ర‌ధాన భూమిక పోషించే ప్రాంతంలో ఈ యువ క‌లెక్ట‌ర్ మాట చెల్లుతుందో లేదో అన్న‌ది ఇప్పుడిక ఆస‌క్తిదాయ‌కం.

ప్ర‌భుత్వ భూమిని కాపాడాలంటూ టెక్క‌లి స‌బ్ క‌లెక్ట‌ర్ రోడ్డెక్కారు. భూ కబ్జాలు త‌గ‌వ‌ని,నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరిస్తూ ఆయ‌న అవ‌గాహ‌న ర్యాలీ తీశారు. శ్రీ‌కాకుళం జిల్లా, టెక్క‌లి స‌బ్ క‌లెక్ట‌ర్ చేపట్టిన ఈ కార్య‌క్ర‌మం మంచి పేరు తెచ్చుకుం ది. టెక్క‌లి మండ‌ల కేంద్రంలో అంబేద్క‌ర్ జంక్ష‌న్ నుంచి ఆయ‌న ర్యాలీని ప్రారంభించి, డిగ్రీ కాలేజ్ వ‌ర‌కూ ప్ర‌ద‌ర్శ‌న‌ను నిర్వ‌హించా రు. మిష‌న్ ప్ర‌భుత్వ భూమి ర‌క్ష‌ణ పేరిట చేప‌ట్టిన ఈ ర్యాలీలో ప‌లువురు రెవెన్యూ అధికారులు, సామాజిక కార్య‌క‌ర్త లు పాల్గొన్నా రు. ప్ర‌తీ మూడో శుక్ర‌వారం, శ‌నివారం ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపునకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తాము నిర్ణయించామ‌ని ఈ సంద‌ర్భంగా వికాస్ మ‌ర్మ‌ట్ తెలిపారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా రెవెన్యూ అధికారుల తొల‌గింపు చ‌ర్య‌లు కేవ‌లం బ‌డుగుల కూ, రోడ్డు ప‌క్క‌న ఉన్న గోర్జీల‌కూ మాత్ర‌మే వ‌ర్తిస్తాయా లేదా బ‌డా బాబుల క‌బ్జాల‌పై కొర‌ఢా ఏమ‌యినా ఝ‌ళిపించ‌గ‌ల‌రా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న ఇదే సంద‌ర్భాన‌.





హీరోయిన్ విజయశాంతి సొంత వూరు ఏదో తెలుసా ?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>