PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/nathi-kollub135d057-6cf9-4b27-a3bb-3647cf9e5197-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/nathi-kollub135d057-6cf9-4b27-a3bb-3647cf9e5197-415x250-IndiaHerald.jpgచికెన్... ఈ పేరు వింటే చాలు... చాలా మందికి నోట్లో నీరు ఉరుతుంది. అసలు కొంతమంది అయితే చికెన్ లేనిదే ముద్ద మింగలేరు. ఎవరైనా నలుగురు వ్యక్తులు కలిస్తే చాలు... సరదాగా బిర్యాని తిందాం అంటారు. ఇక సాయంత్రం అయితే చాలు... స్నాక్స్ రూపంలో తీసుకోవడం కూడా ఇప్పుడు అలవాటు అయ్యింది. అయితే ఇప్పుడు ఆ చికెన్ పేరు వింటేనే భయపడిపోతున్నారు. బర్డ్ ఫ్లూ వల్లో.. లేక మరేదో కారణం కాదు... ధర మాత్రమే. గతంలో కేవలం వంద రూపాయలకు కిలో చికెన్ దొరికింది. కానీ ఇప్పుడు మాత్రం మూడు వందల రూపాయలకు చేరింది. కరోనా సమయంలో కాస్త తగ్గినట్Chicken{#}Egg;Chicken;Population;vegetable market;Evening;Coronavirusకొండెక్కిన కోడి ధరకొండెక్కిన కోడి ధరChicken{#}Egg;Chicken;Population;vegetable market;Evening;CoronavirusFri, 20 Aug 2021 21:25:00 GMTచికెన్... ఈ పేరు వింటే చాలు... చాలా మందికి నోట్లో నీరు ఉరుతుంది. అసలు కొంతమంది అయితే చికెన్ లేనిదే ముద్ద మింగలేరు. ఎవరైనా నలుగురు వ్యక్తులు కలిస్తే చాలు... సరదాగా బిర్యాని తిందాం అంటారు. ఇక సాయంత్రం అయితే చాలు... స్నాక్స్ రూపంలో తీసుకోవడం కూడా ఇప్పుడు అలవాటు అయ్యింది. అయితే ఇప్పుడు ఆ చికెన్ పేరు వింటేనే భయపడిపోతున్నారు. బర్డ్ ఫ్లూ వల్లో.. లేక మరేదో కారణం కాదు... ధర మాత్రమే. గతంలో కేవలం వంద రూపాయలకు కిలో చికెన్ దొరికింది. కానీ ఇప్పుడు మాత్రం మూడు వందల రూపాయలకు చేరింది. కరోనా సమయంలో కాస్త తగ్గినట్లే కనిపించినప్పటికీ... ఇప్పుడు మళ్లీ కోడి ధర కొండెక్కింది. మామూలుగా శ్రావణ మాసం, కార్తిక మాసంలో నాన్ వెజ్ వినియోగం సగానికి పైగా పడిపోతుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో... చాలా మంది నాన్ వెజ్ ను పూర్తిగా ఆపేస్తారు. కానీ ఈ సారి మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పై పైకి ఎగబాగుతున్నాయి.

ఇందుకు ప్రధాన కారణం... కరోనా కారణంగా కోళ్ల ఫారాల్లో కోళ్ల ఉత్పత్తి లేకపోవడమే. గతేడాది నుంచి ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో పూర్తి లాక్ డౌన్ విధించారు. అప్పుడు రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కోళ్లకు కావాల్సిన దాణా అందుబాటులో లేకపోవడం... పౌల్ట్రీ నుంచి పిల్లలు రాకపోవడం... సరైన రవాణా లేకపోవడంతో... ఉత్పత్పి పూర్తిగా పడిపోయింది. నెమ్మదిగా రవాణా పెరిగినప్పటికీ... బర్డ్ ఫ్లూ పుకార్లతో కోళ్ల పెంపకం దార్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో ఫారాల్లో కోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. గతంలో రోజుకు వెయ్యి కోళ్లు సరఫరా చేసే ఫారాలు... ఇప్పుడు అందులో సగం కూడా పంపలేకపోతున్నాయి. కోడికి వేసే దాణాల్లో ప్రధానమైన సోయా, మొక్కజోనలు ధరలు ఆకాశానంటుతున్నాయి. వాటి లభ్యత కూడా సరిగ్గా లేదు. ఇవే చికెన్ ధర పెరిగేందుకు ప్రధాన కారణాలని దుకాణాల యజమానులు చెబుతున్నారు. అయితే ఓ వైపు చికెన్ ధరలు పెరుగుతున్నా... గుడ్డు ధర మాత్రం అదుపులోనే ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కోడిగుడ్డు ధర 5 రూపాయలు పలుకుతోంది. చికెన్ మాత్రం కిలో 300 రూపాయలు పైనే ఉంది. దీంతో కోడి ధర కొండెక్కింది. మిడిల్ క్లాస్ పీపుల్ కి చుక్కలు చూపిస్తోంది.





కొడాలి నానీ... కుక్కని కొట్టినట్టు కొడుతూ తీసుకెళ్తాo!

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>