MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnac5b7db42-1176-4579-af62-2112eab2259d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnac5b7db42-1176-4579-af62-2112eab2259d-415x250-IndiaHerald.jpgబాలకృష్ణకు జాతకాలు ముహూర్తాల పై విపరీతమైన నమ్మకం. ప్రతిరోజు తెల్లవారుఝామున నిద్రలేచి కనీసం ఒక గంట అయినా పూజ చేయకుండా బాలయ్య తన దినచర్య ప్రారంభించడు. ఇప్పుడు ఈ నమ్మకాలు బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘అఖండ’ విడుదల పై ప్రభావం చూపెడతాయా అన్న చర్చలు జరుగుతున్నాయి.కరోనా సెకండ్ వేవ్ అడ్డు లేకుండా ఉండి ఉంటే ‘అఖండ’ ఈపాటికే విడుదల అయి ఉండేది. ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితులు చక్కబడి ధియేటర్లు మళ్ళీ తెరుచుకోవడంతో ఈ మూవీని దసరా రేస్ లో దింపాలని బోయపాటి భావిస్తున్నాడు. వాస్తవానికి ఇదే దసరా రేస్ కు ‘ఆచార్య’ విడుదల ఉbalakrishna{#}boyapati srinu;Dussehra;Christmas;December;war;Vijayadashami;Balakrishna;Chiranjeevi;Industry;News;Allu Arjun;Cinemaఅల్లు అర్జున్ ను కార్నర్ చేస్తున్న బాలకృష్ణ నమ్మకాలు !అల్లు అర్జున్ ను కార్నర్ చేస్తున్న బాలకృష్ణ నమ్మకాలు !balakrishna{#}boyapati srinu;Dussehra;Christmas;December;war;Vijayadashami;Balakrishna;Chiranjeevi;Industry;News;Allu Arjun;CinemaFri, 20 Aug 2021 10:00:00 GMTబాలకృష్ణకు జాతకాలు ముహూర్తాల పై విపరీతమైన నమ్మకం. ప్రతిరోజు తెల్లవారుఝామున నిద్రలేచి కనీసం ఒక గంట అయినా పూజ చేయకుండా బాలయ్య తన దినచర్య ప్రారంభించడు. ఇప్పుడు ఈ నమ్మకాలు బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘అఖండ’ విడుదల పై ప్రభావం చూపెడతాయా అన్న చర్చలు జరుగుతున్నాయి.


కరోనా సెకండ్ వేవ్ అడ్డు లేకుండా ఉండి ఉంటే ‘అఖండ’ ఈపాటికే విడుదల అయి ఉండేది. ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితులు చక్కబడి ధియేటర్లు మళ్ళీ తెరుచుకోవడంతో ఈ మూవీని దసరా రేస్ లో దింపాలని బోయపాటి భావిస్తున్నాడు. వాస్తవానికి ఇదే దసరా రేస్ కు ‘ఆచార్య’ విడుదల ఉన్నప్పటికీ బోయపాటికి ‘అఖండ’ మూవీపై ఉన్న నమ్మకం తిరిగి బాలకృష్ణ చిరంజీవిల వార్ కు తెరతీసే పరిస్థితులు ఏర్పడ్డాయి.


అయితే అనుకోకుండా ఇప్పుడు ఈ మూవీ పై బాలకృష్ణ ఆలోచనలు మారినట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్యకు సన్నిహితంగా ఉండే ఒక జ్యోతిష్కుడు డిసెంబర్ నుండి బాలకృష్ణ కు జాతక రీత్యా మంచి రోజులు ప్రారంభం అవుతాయి కాబట్టి ‘అఖండ’ మూవీని డిసెంబర్ నెలాఖరున విడుదల చేస్తే ఘన విజయం గ్యారెంటీ అని జ్యోష్యం చెప్పినట్లు టాక్.


దీనితో బాలకృష్ణ ‘అఖండ’ మూవీని క్రిస్మస్ రేస్ లో విడుదల చేయమని బోయపాటికి చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే క్రిస్మస్ రేస్ కు అల్లు అర్జున్ ‘పుష్ప’ భారీస్థాయిలో విడుదల కాబోతోంది. దీనితో ఇలాంటి పోటీ వాతావరణంలో ‘అఖండ’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ‘పుష్ప’ మ్యానియా ముందు నిలబడుతుంద అన్న సందేహాలు కలుగుతున్నట్లు తెలుస్తోంది. దీనితో బాలయ్య నమ్మకాలు కాదనలేక ‘పుష్ప’ పోటీ ముందు ‘అఖండ’ ఎంతవరకు నిలబడుతుంది అన్న టెన్షన్ లో బోయపాటి ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు చిరంజీవి బాలకృష్ణల ఫైట్ జరుగుతుంది అని భావిస్తే ఇప్పుడు అది బన్నీ బాలయ్యల ఫైట్ గా మారుతుందా అని అనిపించడం సహజం..  






సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న వైసీపీ ఎంపీ..?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>