PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apdef7bd92-0717-467c-9910-e9810725f75e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apdef7bd92-0717-467c-9910-e9810725f75e-415x250-IndiaHerald.jpgక్వింటా ఉల్లిని క‌నిష్టంగా 150 రూపాయ‌ల‌కు, గ‌రిష్టంగా 700 రూపాయ‌లకు కొనుగోలు చేయాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం మాత్రం త‌మ‌ను, త‌మ గోడునూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సంబంధిత సంఘాల ఆరోప‌ణ. పండిన పంట చేతికి వ‌చ్చాక ఏటా మాదిరిగానే స‌రైన నిల్వ సౌక‌ర్యాలు లేక, పంట‌ను దాచుకోలేక, ధ‌ర ఉన్న రోజు అమ్ముకోలేక తాము ప‌డుతున్న అవ‌స్థ‌ల కార‌ణంగా నిలువునా మునిగిపోతున్నామ‌న్న‌ది వారి వేద‌న. ఈ నేప‌థ్యంలో రాయ‌ల సీమ లోగిళ్లు ఉద్య‌మంలో భాగం అయ్యాయి.ap{#}Rayalaseema;vegetable market;CMఉల్లి - లొల్లి : సీమ రైతు స‌ర్కార్ కు వార్నింగ్ ?ఉల్లి - లొల్లి : సీమ రైతు స‌ర్కార్ కు వార్నింగ్ ?ap{#}Rayalaseema;vegetable market;CMFri, 20 Aug 2021 11:56:22 GMTజ‌గ‌న్ స‌ర్కారు త‌మ‌కు అండగా ఉండాల‌ని కోరుకుంటోంది రాయ‌లసీమ రైతాంగం. లేదంటే త‌మ‌కు ఉద్య‌మాలే శ‌ర‌ణ్య‌మ‌ని ఆయా సంఘాలు చెబుతున్నాయి. మార్కెట్లో ఉల్లికి డిమాండ్ ఉన్నా ఆ మేర‌కు ధ‌ర‌లు చెల్లించ‌లేని స్థితిలో వ్యాపారులు ఎందుకు ఉంటున్నార‌ని? ఈ దుః స్థితికి కార‌ణం ఎవ‌ర‌ని నిల‌దీస్తున్నాయి. క‌ర్నూలులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా రైతుల‌ను ఆదుకోవాల‌ని కోరుతున్నాయి.



క్వింటా ఉల్లిని క‌నిష్టంగా 150 రూపాయ‌ల‌కు, గ‌రిష్టంగా  700 రూపాయ‌లకు కొనుగోలు చేయాల‌ని  రైతులు డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం మాత్రం త‌మ‌ను, త‌మ గోడునూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సంబంధిత సంఘాల ఆరోప‌ణ. పండిన పంట చేతికి వ‌చ్చాక ఏటా మాదిరిగానే స‌రైన నిల్వ సౌక‌ర్యాలు లేక, పంట‌ను దాచుకోలేక, ధ‌ర ఉన్న రోజు అమ్ముకోలేక తాము ప‌డుతున్న అవ‌స్థ‌ల కార‌ణంగా నిలువునా మునిగిపోతున్నామ‌న్న‌ది వారి వేద‌న. ఈ నేప‌థ్యంలో రాయ‌ల సీమ లోగిళ్లు ఉద్య‌మంలో భాగం అయ్యాయి.


గిట్టుబాటు ధ‌ర‌లేక రైతులు రోడ్డున పడుతున్న వైనం

ఒక్క రాయ‌ల సీమ‌లోనే కాదు ఆంధ్రావని అంత‌టా

ఈ త‌ర‌హా దుః స్థితి నెల‌కొని ఉంది


వ్య‌వ‌సాయ రంగాన్ని ఆదుకుంటాం అని త‌రుచూ చెప్పే ప్ర‌భుత్వాలు అదే రీతిలో స్పందించ‌డం లేదు అన్న‌ది వాస్త‌వం. గిట్టుబాటు ధ‌ర‌లు క‌ల్పిస్తాం అని చెప్పే ప్ర‌భుత్వాలు అందుకు త‌గ్గ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు. ఉన్నంత‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థతో ఒప్పందాలు కుదు ర్చుకుని పంట‌లు అమ్ముకోవ‌డం మినహా ఏం చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో రైతులున్నారు. త‌మ‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని కోరుకోవ‌డం మిన‌హా వ్య‌వ‌స్థ‌లో పెను మార్పులు అయితే ఎవ్వ‌రూ తీసుకురాలేక‌పోతున్నారు. ఏటా పంట‌ల ఉత్ప‌త్తి బాగున్నా, అందుకు త‌గ్గ ధ‌ర‌లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న రైతుల‌కు సంబంధిత వ‌ర్గాల‌కు మార్కెట్ మాత్రం అనుకూలించ‌డం లేదు. ఈ త‌రుణం లో క‌ర్నూలు జిల్లాలో రైతులు రోడ్డెక్కి నిర‌స‌న వ్య‌క్తం చేశారు.  త‌మ గోడు సీఎం జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం చెందారు. దీంతో అక్క‌డి రోడ్ల‌న్నీ రైతుల‌తో నిండిపోయాయి. రాస్తారోకో నిర్వ‌హించ‌డంతో ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే నిలిచిపోయాయి.




వారే నా అకౌంట్ ను హ్యాక్ చేశారు..కంగనా రనౌత్..!

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>