MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ghantasala543c88d8-7bb8-4fdd-b93d-1ba58e1ab93c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ghantasala543c88d8-7bb8-4fdd-b93d-1ba58e1ab93c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ సీమకు అద్భుత వరం గాయకుడు ఘంటశాల. తెలుగు సినిమా పాటను ఆయన శ్రావ్యంగా చేశారు. పద్యానికి కొత్త ఒరవడిని తీసుకువచ్చారు. తెలుగు సినిమా విజయానికి పాటలు ఎంత హెల్ప్ అవుతాయో చూపించారు. ఆయన ఉండగా వేరొక గాయకుడి చేత పాడించే సాహసం ఆ రోజుల్లో ఎవరూ చేయలేకపోయారు ghantasala{#}Mohammed Rafiఘంటసాలకు పోటీగా రఫీని తెచ్చిందెవరు...?ఘంటసాలకు పోటీగా రఫీని తెచ్చిందెవరు...?ghantasala{#}Mohammed RafiFri, 20 Aug 2021 20:00:00 GMTతెలుగు సినీ సీమకు అద్భుత వరం గాయకుడు ఘంటశాల. తెలుగు సినిమా పాటను ఆయన శ్రావ్యంగా చేశారు. పద్యానికి కొత్త ఒరవడిని తీసుకువచ్చారు. తెలుగు సినిమా విజయానికి పాటలు ఎంత హెల్ప్ అవుతాయో చూపించారు.

ఆయన ఉండగా వేరొక గాయకుడి చేత పాడించే సాహసం ఆ రోజుల్లో ఎవరూ చేయలేకపోయారు. ఎందుకంటే ఘంటశాల అన్న బ్రాండ్ అలాంటిది. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి అంతా కూడా ఘంటశాల పాట ఒక్కటైనా సినిమాలో ఉండాల్సిందే అంటూ కోరుకునేవారు. మరి ఇంతలా ఘంటశాల వైభవం సాగుతున్న రోజుల్లో బాలీవుడ్ లో మహమ్మద్ రఫీ కూడా అగ్ర శ్రేణి సింగర్ గా వెలుగొందాడు. ఆయన హిందీలో సరిసాటిగా వెలుగుతున్నాడు.

అలాంటి రఫీని తెలుగులోకి తీసుకువచ్చింది ఎన్టీయార్. ఆయన బావమరిది అట్లూరి పుండరీకాక్షయ్య తన సొంత బ్యానర్ భాస్కర చిత్ర మీద అనేక  సినిమాలు తీశారు. ఆయన ఎన్టీయార్ ని హీరోగా పెట్టి అనేక హిట్స్ కొట్టారు. ఆయన క్రిష్ణావతారం సినిమా తరువాత చెసిన భలే తమ్ముడు మూవీకి ఎన్టీయార్ కోసం ముంబై నుంచి మహమ్మద్ రఫీని పాడేందుకు పిలిపించారు. అప్పటికి ఎన్టీయార్ కి ఘంటశాల అన్ని పాటలూ పాడేవారు.

కానీ వెరైటీ కోసం అన్నట్లుగా రఫీని తెచ్చి మొత్తం సాంగ్స్ పాడించారు. ఆ సినిమా మ్యూజికల్ గా కూడా హిట్ అయింది. దాంతో ఎన్టీయార్ కి వాయిస్ సూట్ కాకపోయినా తరువాత వచ్చిన సినిమాలలో రఫీతోనే పడిస్తూ ఉండేవారు. ఇక అదే రోజులలో హీరోగా ఉన్న కాంతారావు కూడా తన సొంత సినిమా కోసం రఫీతోనే పాడించాలని అనుకున్నారు. అయితే అది కుదరలేదు. దాంతో ఆయన ఘంటశాఅల మాస్టార్ దగ్గరకు వెళ్ళి సినిమాలో పాడాలని కోరారట. అయితే దానికి మాస్టార్ తమాషాగా బదులిచ్చారుట. మీ సినిమాకు రఫీ పాడుతారు కదా అంటూ ఘంటశాల అనేసరికి కాంతారావుకి ఏం చెప్పాలో తోచింది కాదుట. అయితే మాస్టార్ ని ఏదో విధంగా కన్విన్స్ చేసుకుని పాటలు పాడించుకున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఘంటశాల స్వయంగా చాలా మంది గాయకులను ప్రోత్సహించేవారు. కానీ పోటీగా తీసుకువస్తే ఎవరికైనా మనస్సు చివుక్కుమంటుంది కదా. అంతే తప్ప మరేమీ కాదు అంటారు ఆనాటి పరిణామాలను దగ్గరుండి చూసిన వారు. ఆ తరువాత ఘంటశాల అనారోగ్యంలొ ఉన్నపుడు తెలుగు  సినీ సీమకు ఆయన లోటు ఏంటో అక్షరాలా తెలిసివచ్చింది.






కొడాలి నానీ... కుక్కని కొట్టినట్టు కొడుతూ తీసుకెళ్తాo!

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>