PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-6c25a0cc-7655-43d5-a65e-74eff24d672d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-6c25a0cc-7655-43d5-a65e-74eff24d672d-415x250-IndiaHerald.jpgరంగు పులుముకొని కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తున్నావ్ అంటూ, చంద్రబాబు కనుసన్నల్లోనే కాంగ్రెసులో రాజకీయాన్ని చేస్తున్నావ్ అంటూ, నువ్వు ఓటుకు నోటులో దొరికిన దొంగవు అంటూ టిఆర్ఎస్ నాయకులు విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఒక్కో సందర్భంలో చంద్రబాబు ప్రస్తావిస్తూ మాట్లాడడం చూస్తుంటే ఆయన టిడిపి నీడను ఇంకా వదిలినట్టు లేదని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.Political {#}Kiran Kumar;dr rajasekhar;students;history;Telangana Chief Minister;TDP;Telangana;Revanth Reddy;revanth;Congress;Party;Telugu;CBNటి.పిసిసినీ.. టిడిపి నీడ వదలట్లేదా..?టి.పిసిసినీ.. టిడిపి నీడ వదలట్లేదా..?Political {#}Kiran Kumar;dr rajasekhar;students;history;Telangana Chief Minister;TDP;Telangana;Revanth Reddy;revanth;Congress;Party;Telugu;CBNFri, 20 Aug 2021 11:10:00 GMTకాంగ్రెస్ పార్టీ అంటేనే  ఒక ఘన చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పవచ్చు. ఈ పార్టీ ఎంతోమంది  కిందిస్థాయి నాయకులను చాలా ఎత్తుకు తీసుకెళ్ళింది. ఉమ్మడి రాష్ట్రంలో  రాజశేఖర్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఒక వెలుగు వెలిగింది. తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆ సమయంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కెసిఆర్  ఉద్యమం ద్వారా తమ ఆకాంక్షను తెలియజేశారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున మొదలుపెట్టారు. ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు కూడా చేసుకున్నారు. దీనిని  గమనించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. దీంతో  కెసిఆర్  కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది. అప్పటి నుంచి ఏడు సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ ను నడిపించే సరైన అధ్యక్షుడు లేక ఇబ్బందులు పడుతూనే వచ్చిందని చెప్పవచ్చు. ఇలా కాంగ్రెస్ పతనం  రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించాయి. దీన్ని గమనించిన అధిష్టానం  ఎలాగైనా పార్టీని  ముందుకు తీసుకెళ్లే నాయకుడిని  అధ్యక్షుడిగా నియమించాలనుకుంది.

 వెంటనే కిందిస్థాయి నుంచి పరిశోధన ప్రారంభించింది. కార్యకర్తలు యొక్క  అభిప్రాయాన్ని తెలుసుకొని, పీసీసీ   అధ్యక్షునిగా రేవంత్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. దీంతో రేవంత్ రెడ్డి  తెలంగాణలో  కొత్త రాజకీయాన్ని మొదలుపెట్టారు. ఆయన ఎన్నికతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం మొదలైందని చెప్పవచ్చు. ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు అందరిని కలుపుకొని  ముందుకు పోయే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది సీనియర్ నాయకుల నుంచి రేవంత్ రెడ్డి భంగపాటు తప్పడం లేదు. ఆయన టిడిపి నుంచి వచ్చారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర  చంద్రబాబు ఆలోచన విధానం తోనే మాట్లాడుతూ  ఉన్నాడు. దీంతో  రాజకీయ నాయకులంతా రేవంత్ రెడ్డి  చంద్రబాబును ఇంకా టిడిపిని  వదలడం లేదు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి  అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి నుంచే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సభలు సమావేశాలతో  వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. తమదైన శైలిలో ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎండగడుతూ ముందుకు పోతున్నారు. కెసిఆర్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ  అవాకులు చెవాకులు చేస్తూ కాంగ్రెస్ పార్టీని తారా స్థాయికి తీసుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు.

 ఆయన మాటలకు టిఆర్ఎస్ నేతలు  దీటుగా స్పందిస్తున్నారు. ఆయన మాటలను తిప్పికొడుతూ  వెనకనుంచి టిడిపి రంగు  పులుముకొని  కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తున్నావ్ అంటూ, చంద్రబాబు కనుసన్నల్లోనే కాంగ్రెసులో రాజకీయాన్ని చేస్తున్నావ్ అంటూ, నువ్వు  ఓటుకు నోటులో  దొరికిన దొంగవు అంటూ టిఆర్ఎస్ నాయకులు  విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఒక్కో సందర్భంలో చంద్రబాబు ప్రస్తావిస్తూ  మాట్లాడడం  చూస్తుంటే ఆయన టిడిపి నీడను ఇంకా వదిలినట్టు లేదని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.



లక్షలు ఖర్చు చేసి వైసీపీపై ద్రుష్ఫచారం చేస్తున్నారు !

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>