PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/women/70/rajiv-jeevitham-lo-adey-kilaka-malupu6ab55fac-03c8-4c18-8462-b3dcb24abeef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/women/70/rajiv-jeevitham-lo-adey-kilaka-malupu6ab55fac-03c8-4c18-8462-b3dcb24abeef-415x250-IndiaHerald.jpgఇష్టం లేకున్నా రాజకీయాల్లోకి వ‌చ్చి అనుకోని సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో అతిచిన్న వ‌య‌స్సులోనే భార‌త ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించాడు ఆయ‌న దేశానికి ఐటీ రంగాన్ని ప‌రిచ‌యం చేసి ఎన్నో సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టాడు. ఆయ‌నే భార‌త మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ. 1984 అక్టోబ‌ర్ 11న అప్ప‌టి భార‌త ప్ర‌ధాని ఇందిరాగాంధీ హ‌త్య‌కు గుర‌య్యారు. దీంతో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్టాల్సి వ‌చ్చింది. ఓ వైపు త‌ల్లి మ‌ర‌ణం బాధ‌పెడుతున్నా బాధ్య‌త‌ల‌ను భుజానికెత్తుకున్నారు. అప్ప‌టికీ అయ‌Rajiv Gandhi{#}rajeev;Rajiv Gandhi;students;central government;Ishtamసంస్క‌ర‌ణ‌ల సృష్టిక‌ర్త రాజివ్ గాంధీ..!సంస్క‌ర‌ణ‌ల సృష్టిక‌ర్త రాజివ్ గాంధీ..!Rajiv Gandhi{#}rajeev;Rajiv Gandhi;students;central government;IshtamFri, 20 Aug 2021 08:57:15 GMT ఇష్టం లేకున్నా రాజకీయాల్లోకి వ‌చ్చి అనుకోని సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో అతిచిన్న వ‌య‌స్సులోనే భార‌త ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించాడు ఆయ‌న దేశానికి ఐటీ రంగాన్ని ప‌రిచ‌యం చేసి ఎన్నో సంస్క‌ర‌ణ‌లు ప్ర‌వేశ‌పెట్టాడు. ఆయ‌నే భార‌త మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ. 1984 అక్టోబ‌ర్ 11న అప్ప‌టి భార‌త ప్ర‌ధాని ఇందిరాగాంధీ హ‌త్య‌కు గుర‌య్యారు. దీంతో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్టాల్సి వ‌చ్చింది. ఓ వైపు త‌ల్లి మ‌ర‌ణం బాధ‌పెడుతున్నా బాధ్య‌త‌ల‌ను భుజానికెత్తుకున్నారు. అప్ప‌టికీ అయ‌న వ‌య‌సు కేవ‌లం 40 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే.


    1944 ఆగ‌స్టు 20న జ‌న్మించిన రాజీవ్ గాంధీ ఆయ‌న ప్ర‌ధాని అయిన త‌రువాత టెక్నాల‌జీ పెద్దపీట వేశారు. కంప్యూట‌ర్ రంగాన్ని భార‌త దేశానికి ప‌రిచ‌యం చేసి ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్య‌ను నేర్చుకునేందుకు దోహ‌దం చేశారు. సోవియ‌ట్ యూనియ‌న్ ప్రొటెక్ష‌నిస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ విధానాల‌పై ఆధార‌ప‌డిన అప్ప‌టి ఆర్థిక న‌మూనాను విస్తృతం చేసే విధానాలు, సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌ధాని రాజీవ్ గాంధీ ప్ర‌వేశ‌పెట్టారు. అదే విధంగా సాంకేతిక ప‌రిశ్ర‌మ‌పై ప‌న్నులు తగ్గించే సంస్క‌ర‌ణ‌ల‌ను కూడా తీసుకొచ్చారు.

   టెలీక‌మ్యూనికేష‌న్స్‌, ర‌క్ష‌ణ‌, వాణిజ్య‌, విమాన‌యాన సంస్థ‌ల‌కు సంబంధించిన దిగుమ‌తి విధానాల‌ను సంస్క‌రించారు. రాజీవ్ గాంధీ హ‌యాంలో అధిక పెట్ట‌బ‌డులు పెట్టేందుకు సంస్క‌ర‌ణ‌ల‌ను రూపొందించారు. గ్రామాల‌కు టెలీఫోన్ల విస్త‌ర‌ణ‌లో దేశం ముందుండేందుకు కావాల్సిన విధానాల‌ను ఏర్పాటు చేశారు. 1984లో ప్ర‌భుత్వ యాజ‌మాన్యంలోని టెలీక‌మ్యూనికేష‌న్స్ టెక్నాల‌జీ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ అయిన సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్‌ను ప్రారంభించింది.

  1984 ఐటీ పాల‌సీకి ముందు సాఫ్ట్‌వేర్ నిపుణులు పారిశ్రామిక వేత్త‌లుగా గుర్తించ‌బ‌డ‌లేదు. దీంతో ఈ రంగంలోని ప్ర‌జ‌ల‌ను బ్యాంకు రుణాల‌కు అన‌ర్హులుగా చేసింది. ఆ త‌రువాత పిట్రోడా. ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వ స‌హాయంతో దేశ‌వ్యాప్తంగా గ్రామీణ‌, ప‌ట్ట‌ణ టెలీఫోన్ ఎక్చేంజ్‌ల శ్రేణిని నిర్మించి ఫోన‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసింది. రాజీవ్ గాంధీ ఆధ్వ‌ర్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టాన్ని ఏర్పాటు చేశారు. కానీ అందులో ఉన్న లొసుగుల వ‌ల్ల ఇప్ప‌టికీ ఫిరాయింపులు కొన‌సాగుతున్నాయి. ఓపెన్ విద్య‌ను అందించ‌డానికి ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్సిటీని రాజీవ్ గాంధీ హ‌యాంలో ఏర్పాటు చేశారు.

 





కేసీఆర్, జగన్ లతో బీజేపీ దోస్తీ ఇలా బయటపడనుందా?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>