EditorialPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp5bb624f0-126c-4500-afcb-d3f2a14cfac8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp5bb624f0-126c-4500-afcb-d3f2a14cfac8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి గడ్డుకాలం నడుస్తుందా అంటే... అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 1982లో పార్టీ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది నేతలకు రాజకీయ పాఠాలు నేర్పిన పార్టీ తెలుగుదేశం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కీలక స్థానాల్లో, ఉన్నత పదవుల్లో ఉన్న వారిలో దాదాపు 70 శాతం మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే. అంతేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైసీపీలో సీనియర్లుగా ఉన్న ఉమ్మారెడ్డి, కొడాలి నాని, రోజా... ఇలా వీరంతా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన Tdp{#}choudary actor;District;Fire;Yevaru;రాజీనామా;Smart phone;MLA;Telugu Desam Party;Telangana;Party;Cycle;Rajahmundry;TDP;TPCC;revanth;CBN;media;Teluguటీడీపీ టీ కప్పులో తుపానుటీడీపీ టీ కప్పులో తుపానుTdp{#}choudary actor;District;Fire;Yevaru;రాజీనామా;Smart phone;MLA;Telugu Desam Party;Telangana;Party;Cycle;Rajahmundry;TDP;TPCC;revanth;CBN;media;TeluguFri, 20 Aug 2021 06:56:00 GMTప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి గడ్డుకాలం నడుస్తుందా అంటే... అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 1982లో పార్టీ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది నేతలకు రాజకీయ పాఠాలు నేర్పిన పార్టీ తెలుగుదేశం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కీలక స్థానాల్లో, ఉన్నత పదవుల్లో ఉన్న వారిలో దాదాపు 70 శాతం మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే. అంతేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైసీపీలో సీనియర్లుగా ఉన్న ఉమ్మారెడ్డి, కొడాలి నాని, రోజా... ఇలా వీరంతా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వారే. అయితే పరిస్థితులు అనుకూలించక తలో పార్టీలో చేరిపోయారు. అయితే టీడీపీ మాత్రం కార్యకర్తలపైనే నమ్మకం పెట్టుకుంది. కానీ ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీడీపీలో పెను దుమారం రేపిందనే చెప్పాలి. పార్టీ ఆవిర్భావం నుంచి సైకిల్ దిగకుండా ఉన్న నేతల్లో బుచ్చయ్య ఒకరు. ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధిస్తూనే... అటు ప్రజల్లో, ఇటు పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కూడా.

వయోభారంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేసిన బుచ్చయ్య... రెండేళ్లు ముందుగానే పార్టీకి, పదవులకు కూడా రాజీనామా చేస్తున్నారనే పుకార్లు షికారు చేశాయి. ఆ వెంటనే రంగంలోకి దిగిన పార్టీ సీనియర్ నేతలు, జిల్లా ముఖ్య నాయకులు ఆయనతో చర్చించారు. ఆయన అలకకు కారణాలు తెలుసుకున్నారు. పార్టీలో తనకు సముచిత స్థానం లభించడం లేదనే విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కొద్దిరోజులుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు... తన ఫోన్ కూడా ఎత్తడం లేదంటూ గోరంట్ల చెప్పినట్లుగా తెలుస్తోంది. గోరంట్ల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ అధిష్ఠానం... ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసింది. బుచ్చయ్య చౌదరితో చంద్రబాబు స్వయంగా ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అన్ని సమస్యలకు పరిష్కారం చూద్దామంటూ చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. అటు గోరంట్ల కూడా తాను పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదని... అంతా మీరే ఊహించుకున్నారంటూ మీడియా మిత్రులపై ఫైర్ అయ్యారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే... అందరికీ నేనే స్వయంగ చెబుతా అని కూడా బుచ్చయ్య చౌదరి చెప్పేశారు. అయితే పొగ లేనిదే నిప్పు రాదంటారు కదా... అని అడిగిన ప్రశ్నకు... ఆ పొగ ఎవరు పెట్టారో మీరే తెలుసుకోండి అంటూ ఆన్సర్ చెప్పి వెళ్లిపోయారు. ఏదీ ఏమైనా... బుచ్చయ్య చౌదరి విషయాన్ని మాత్రం టీడీపీ నేతలు టీ కప్పులో తుపాను మాదిరి కొట్టి పారేస్తున్నారు.





రేవంతు రాక : తిట్ల‌తో ఇమేజ్ పెరిగిపోతుందా?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>