EditorialGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap-politics01062426-2569-42a5-b7f9-61eec7050644-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap-politics01062426-2569-42a5-b7f9-61eec7050644-415x250-IndiaHerald.jpg2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేయగా.. జనసేన ఆ రెండు పార్టీలకు మద్దతిచ్చి పోటీనుంచి తప్పుకుంది. 2019 నాటికి బీజేపీ, టీడీపీ విడిపోయాయి. జనసేన కూడా సొంతగా పోటీ చేసింది. మిత్ర భేదం వల్ల ముగ్గురు మిత్రులు తీవ్రంగా నష్టపోగా.. మధ్యలో వైసీపీ బలపడింది. జగన్ సామర్థ్యాన్ని తక్కవ చేయలేం కానీ, ముగ్గురూ కలసి ఉంటే.. మాత్రం ఫలితాలు మరోలా ఉండేవని ఆ పార్టీ నేతల నమ్మకం. ap politics{#}mithra;Somu Veerraju;Diesel;Narendra Modi;Janasena;TDP;YCP;Hanu Raghavapudi;Yatra;CBN;Jagan;Party;Andhra Pradesh;Bharatiya Janata Party;Pawan Kalyanబీజేపీతోనే టీడీపీ.. ఇంతకంటే సాక్ష్యం కావాలా..?బీజేపీతోనే టీడీపీ.. ఇంతకంటే సాక్ష్యం కావాలా..?ap politics{#}mithra;Somu Veerraju;Diesel;Narendra Modi;Janasena;TDP;YCP;Hanu Raghavapudi;Yatra;CBN;Jagan;Party;Andhra Pradesh;Bharatiya Janata Party;Pawan KalyanThu, 19 Aug 2021 09:19:00 GMT2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేయగా.. జనసేన ఆ రెండు పార్టీలకు మద్దతిచ్చి పోటీనుంచి తప్పుకుంది. 2019 నాటికి బీజేపీ, టీడీపీ విడిపోయాయి. జనసేన కూడా సొంతగా పోటీ చేసింది. మిత్ర భేదం వల్ల ముగ్గురు మిత్రులు తీవ్రంగా నష్టపోగా.. మధ్యలో వైసీపీ బలపడింది. జగన్ సామర్థ్యాన్ని తక్కవ చేయలేం కానీ, ముగ్గురూ కలసి ఉంటే.. మాత్రం ఫలితాలు మరోలా ఉండేవని ఆ పార్టీ నేతల నమ్మకం.

2024 నాటికి ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయనేదే ఇప్పుడు ప్రశ్న. ప్రస్తుతం టీడీపీ ఒంటరిగా పోరాటం చేస్తోంది. వామపక్షాలు టీడీపీకి దగ్గరగా ఉన్నట్టే కానీ, వాటి వల్ల ఎంతమేర ప్రయోజనం ఉంటుందనేది చెప్పలేం. ఇక బీజేపీ-జనసేన పొత్తు ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ వచ్చే ఎన్నికలనాటికి జనసేన సొంత బలం ఎంతో తెలుసుకోవాలనేది పవన్ కల్యాణ్ ఆలోచనగా ఉంది. ఈ దశలో బీజేపీతో టీడీపీ చెలిమికోసం ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. గతంలో మోదీ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు, ఇటీవల కాలంలో కేంద్రంపై పల్లెత్తు మాట విసరడంలేదు. పెట్రోలు, డీజిల్ రేట్లు భారీగా పెంచేస్తున్నా కూడా టీడీపీ ఏమాత్రం నోరు మెదపలేదు.

ఇక బీజేపీ కూడా టీడీపీతో సానుకూల ధోరణిలో ఉండాలని చూస్తోంది. ఆమధ్య చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనలిచ్చినా.. రాను రాను వారిలో టీడీపీ అంటే సాఫ్ట్ కార్నర్ ఉందని అర్థమవుతోంది. తాజాగా తిరుపతిలో జన ఆశీర్వాద యాత్ర సభలో కూడా పూర్తిగా వైసీపీనే టార్గెట్ చేసింది బీజేపీ. గతంలో చంద్రబాబు పాలన వల్లే రాష్ట్రంలో సమస్యలొచ్చాయని, వాటిని వైసీపీ కొనసాగిస్తోందని విమర్శించేవారు బీజేపీ నేతలు. ఇప్పుడు మాత్రం పూర్తిగా తప్పులన్నీ వైసీపీపైనే నెట్టేస్తున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో వైసీపీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఆ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకుంటోందనేది బీజేపీ ఆరోపణ. వచ్చే ఎన్నికలనాటికి వైసీపీని పూర్తిగా టార్గెట్ చేయాలని అనుకుంటున్న బీజేపీ, ఆ క్రమంలో టీడీపీతో కలసి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభ తగ్గిపోతున్నట్టు సర్వేలు చెబుతుండటంతో.. ఏపీలో బీజేపీ 2014 నాటి కూటమికి జై కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల టీడీపీ, చంద్రబాబుపై విమర్శల డోసు తగ్గించడమే దీనికి సాక్ష్యం.



'ఢీ' షోలో తీన్మార్ డాన్స్.. స్టేజి మీద రచ్చ రచ్చ?

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>