PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/kcr4b96ab84-b431-4b47-a890-c397ce27dab8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_analysis/kcr4b96ab84-b431-4b47-a890-c397ce27dab8-415x250-IndiaHerald.jpgహుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో... టిఆర్ఎస్ పార్టీ ని ఎలాగైనా గెలిపించాలని... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... అనేక వ్యూహ రచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హుజురాబాద్‌ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గులాబీ బాస్‌. దీంతో ఇప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉన్నటువంటి దళితుల ఓట్లు రాబట్టడానికి... దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చారు. ఈ పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి ఏకంగా పది లక్షల రూపాయలు ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఈ పథకం అమలు కోసం రెండు వేల కోట్లను cm kcr{#}Scheduled caste;Cabinet;Yuva;Minister;News;Huzurabad;CM;Party;Telanganaహుజురాబాద్‌ లో కేసీఆర్‌ గేమ్‌ ప్లాన్‌ ఛేంజ్ ?హుజురాబాద్‌ లో కేసీఆర్‌ గేమ్‌ ప్లాన్‌ ఛేంజ్ ?cm kcr{#}Scheduled caste;Cabinet;Yuva;Minister;News;Huzurabad;CM;Party;TelanganaThu, 19 Aug 2021 09:59:00 GMTహుజరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో... టిఆర్ఎస్ పార్టీ ని ఎలాగైనా గెలిపించాలని... తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్... అనేక వ్యూహ రచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హుజురాబాద్‌ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గులాబీ బాస్‌. దీంతో ఇప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉన్నటువంటి దళితుల ఓట్లు రాబట్టడానికి... దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చారు. ఈ పథకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి ఏకంగా పది లక్షల రూపాయలు ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఈ పథకం అమలు కోసం రెండు వేల కోట్లను తెలంగాణ క్యాబినెట్ విడుదల చేశారు. 

హుజూరాబాద్ నియోజకవర్గం లో దళితుల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ పథకం ద్వారా టిఆర్ఎస్ పార్టీకి మైలేజ్ తక్కువగా వచ్చే అవకాశం ఉందని గులాబీ బాస్ యోచిస్తున్నారని తెలుస్తోంది. దీంతో.. సీఎం కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ క్యాబినెట్ లో దళితులకు ప్రాధాన్యత లేదని విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు సీఎం కేసీఆర్ మరో వ్యూహం రచిస్తోన్నారని తెలుస్తోంది. హుజరాబాద్ ఉప ఎన్నిక కు ముందే తెలంగాణ క్యాబినెట్ లో మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం ఉన్న మంత్రులు కొందరిని తొలగించే... దళిత సామాజిక వర్గం నుంచి ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నారు.

కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేల లో ఒక యువ ఎమ్మెల్యే కూడా ఉన్నారని సమాచారం. అలాగే హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేయాలని చూస్తున్నారని సమాచారం. ఈ నామినేటెడ్ పదవుల్లో కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన నేతల కే ఎక్కువ పదవులు కట్టబెట్టాలని గులాబీ బాస్ వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  హుజురాబాద్ ఉప ఎన్నికల గా ఉంటే ముందే ప్రణాళికలు అమలు చేస్తే... ఆ నియోజకవర్గంలోని దళితుల ఓట్లు గంపగుత్తగా.. టిఆర్ఎస్ పార్టీ కి పడే అవకాశం ఉందని గులాబీ అధినేత అనుకుంటున్నారట. ఈ మేరకు ఇప్పటికే అన్ని పనులు చక్కదిద్దేశారట సీఎం కేసీఆర్‌. అయితే..ఈ  పదవులు ఎవరికీ వస్తాయో చూడాలి మరి.



స్కూళ్లలో జగన్‌ మార్క్‌: నోబ్యాగ్‌, నీటిగంట, కెరీర్ గైడెన్స్, టీచర్ డైరీ..!

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>