PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kishanreddy-56955e49-f300-425e-96ce-ff8e36b5221a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kishanreddy-56955e49-f300-425e-96ce-ff8e36b5221a-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుందని.. కొంతమంది మా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అనేక అంశాలలో ఎపికి ప్రాదాన్యతనిచ్చి నిధులు ఇచ్చామని..ఎక్కడా కూడా మోడీ ఎపికి అన్యాయం చేయలేదన్నారు. బిజెపి జన ఆశీర్వాద యాత్ర సభ లో ఇవాళ పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని..వారి స్పూర్తి తో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. నేటి తరం, భావి తరాలకు మహనీయKishan Reddy;{#}jeevitha rajaseskhar;Congress;Prime Minister;Yatra;G Kishan Reddy;central government;Bharatiya Janata Party;Government;Coronavirus;Jagan;Party;Indiaఏపీని కేంద్రమే ఆదుకుందిఏపీని కేంద్రమే ఆదుకుందిKishan Reddy;{#}jeevitha rajaseskhar;Congress;Prime Minister;Yatra;G Kishan Reddy;central government;Bharatiya Janata Party;Government;Coronavirus;Jagan;Party;IndiaThu, 19 Aug 2021 21:23:37 GMTఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుందని.. కొంతమంది మా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అనేక అంశాలలో ఎపికి ప్రాదాన్యతనిచ్చి నిధులు ఇచ్చామని..ఎక్కడా కూడా మోడీ ఎపికి అన్యాయం చేయలేదన్నారు. బిజెపి జన ఆశీర్వాద యాత్ర సభ లో ఇవాళ పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ  సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని..వారి స్పూర్తి తో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. నేటి తరం, భావి తరాలకు మహనీయులు జీవిత గాధలను తెలియ చెప్పాలని ఆయన పేర్కొ్నారు. బిజెపి కార్యకర్తలు అందరూ ఒక సంకల్పం తీసుకోవాలని... కృష్ణదేవరాయల కాలం నాటి భారతావని ఆవిష్కరించాలన్నారు. ఉగ్రవాద దాడులు, బాంబుల మోత, అవినీతి లేని భారతదేశం కావాలని..అవినీతి రహిత పాలనకు మోడీ పని తీరే నిదర్శనమన్నారు.

 కాంగ్రెస్ హయాంలో డిల్లీ చుట్టూ కాంట్రాక్టర్ లు , దళారులు తిరిగేవారు...ఇప్పుడు అన్నీ నేరుగా ప్రజలకే ఆ ఫలాలు‌ అందిస్తున్నారని తెలిపారు. భారత దేశాన్ని అభివృద్ధి పధంలో పరుగులు తీయిస్తున్నారని...వాజపేయ్, మోడీ హయాంలోనే దేశం మొత్తం జాతీయ రహదారులు రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. అన్ని పట్టణాలు, నగరాలు, ఆలయాలను కలుపుతూ రోడ్ల అభివృద్ధి చేశారని...పేదల కోసం మోడీ గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. గతంలో చంద్రబాబు, నేడు జగన్ ఉన్నా.. ఎపి కి లక్షల ఇళ్లు నిర్మించారన్నారు. దేశంలో యనభై కోట్ల మందికి మూడు రూపాయలు  బియ్యం  అందిస్తున్నారని...కేజీ కి 37 రూపాయలుకు కొని,  సబ్సిడీ కి మూడు రూపాయలకు ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయలు సబ్సిడీ ఇచ్చి రూపాయికి సరఫరా చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో  పేదల కొసం పూర్తి ఉచితంగా బియ్యం మోడీ ఇచ్చారని..


కరోనా బారిన పడకుండా వ్యాక్సిన్ ను మోడీ అందుబాటు లోకి తెచ్చారన్నారు. ఇతర దేశాలు మనకు వ్యాక్సిన్ సరఫరా చేయకపోయినా... మనమే తయారు చేసుకున్నామని తెలిపారు. వ్యాక్సిన్ తయారీ కేంద్రాలకు  మోడీ స్వయంగా వెళ్లి వారిని ప్రోత్సహించారన్నారు. ప్రపంచంలో ఎవరైనా ఈ విధంగా పరిశోధనా కేంద్రాలకు‌ వెళ్లారా ? అని ప్రశ్నించారు. కరోనాకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసిన ఘనత మోడీదేనని...మోడీ ప్రధాని కాకుంటే...‌దేశం ఎలా ఉండేదో ఆలోచన చేయండి అని పేర్కొన్నారు. కార్యకర్తగా పార్టీ కోసం పని చేస్తూ మోడీ ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు.  మోడీ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని...వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీ లను నమ్మొద్దన్నారు.



దేశంలోనే తొలి మహిళగా రికార్డు సాధించిన మిథాలి మధుమిత..!!

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>