MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywooda0fadc56-f1a4-4d0c-8617-743fbe266425-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywooda0fadc56-f1a4-4d0c-8617-743fbe266425-415x250-IndiaHerald.jpgగత రెండేళ్ల నుండి కరోనా మనకు ఒక పెద్ద శనిలా చుట్టుకుంది. అన్ని రంగాల్లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. అడపాదడపా కాస్త గ్యాప్ ఇస్తూ దశల వారీగా విరుచుకుపడుతున్న ఈ మహమ్మారితో ముఖ్యంగా సినీ పరిశ్రమకు నిత్యం పోరు తప్పేలలేదు. నిన్న మొన్నటి దాకా లాక్ డౌన్ పేరిట థియేటర్లు మూతపడగా ఇప్పుడు కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ సినిమా థియేటర్స్ ను పునఃప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ప్రకటించింది. TOLLYWOOD{#}Kanna Lakshminarayana;Audience;Industry;Hero;Coronavirus;Cinema;central governmentఅగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?TOLLYWOOD{#}Kanna Lakshminarayana;Audience;Industry;Hero;Coronavirus;Cinema;central governmentThu, 19 Aug 2021 13:00:00 GMTగత రెండేళ్ల నుండి కరోనా మనకు ఒక పెద్ద శనిలా చుట్టుకుంది. అన్ని రంగాల్లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. అడపాదడపా కాస్త గ్యాప్ ఇస్తూ దశల వారీగా విరుచుకుపడుతున్న ఈ మహమ్మారితో ముఖ్యంగా సినీ పరిశ్రమకు నిత్యం పోరు తప్పేలలేదు. నిన్న మొన్నటి దాకా లాక్ డౌన్ పేరిట థియేటర్లు మూతపడగా ఇప్పుడు కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ సినిమా థియేటర్స్ ను పునఃప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ప్రకటించింది. కానీ కరోనా మళ్ళీ విజృంభించే అవకాశాలు లేకపోలేదు. దాంతో సినిమాలు నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు కొందరు నిర్మాతలు.

థియేటర్లను నమ్ముకునే దానికన్నా ఓటిటి లను నమ్ముకుంటే కనీసం నష్టాలు రాకుండా ఉంటాయని ఫీలవుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ...ప్రజల్లో కరోనా భయం ఉండనే ఉంది. అందులోనూ  థర్డ్ వేవ్ మొదలవుతుంది అన్న ప్రచారాలు ప్రేక్షకుల్ని థియేటర్ల వైపు చూడనిచ్చేలా లేవు. ఒకవేళ ప్రేక్షకులు వచ్చినా ఆశించిన స్థాయిలో జనాలు సినిమాలు చూడటానికి థియేటర్లకు వస్తారన్న భరోసా లేదు. అలాంటప్పుడు థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసి రిస్కు చేసే కన్నా ఓటిటిల  బాట పడితే కనీసం మినిమం గ్యారెంటీ ఉంటుందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ అందుకు హీరోలు మాత్రం సుముఖంగా లేరట. చిన్న హీరో నుండి పెద్ద హీరో వరకు అందరూ తమ చిత్రాలను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

దీంతో అటు నిర్మాతలకు ఇటు హీరోలకు మధ్య వివాదాలు చెలరేగుతున్నాయట. అయితే వీటన్నిటినీ దాటుకుని ఏ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తాయో చూడాలి. దాదాపుగా రెండు సంవత్సరాల నుండి థియేటర్ల కోసమే వేచి చూసిన ఎన్నో సినిమాల దర్శక నిర్మాతలు, తీరా థియేటర్లు తెరిచినా పెద్దగా ఉపయోగం లేకపోవడంతో సదిగ్ధంలో పడ్డారు. హీరోలకు సర్ది చెప్పలేక, తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఈ విషయంపై స్టార్ హీరోలు అర్ధం చేసుకుని ముందుకు వచ్చి పరిష్కరించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి ఏమి జరగనుందో చూడాలి.



బ‌ర్త్ డేకు "మెగా" ట్రీట్ ఇదేనా..?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>