PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/revanth-reddydd8ff800-66a1-4bda-9c5d-78ef4c5f2846-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/revanth-reddydd8ff800-66a1-4bda-9c5d-78ef4c5f2846-415x250-IndiaHerald.jpgరాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ అవసాన దశకు వచ్చింది. పార్టీలో లీడర్లు క్రమక్రమంగా కనుమరుగయ్యారు. పక్క పార్టీల్లోకి వెళ్లేవారు వెళ్లిపోగా, మిగిలినవారు రిటైర్ అయిపోయారు. కాంగ్రెస్ లోనే పుట్టాం, కాంగ్రెస్ తోనే ఉంటాం.. అనే సెంటిమెంట్ ఉన్నవారు మాత్రమే అక్కడా, ఇక్కడా కొంతమంది హస్తం గుర్తుతోనే ఉన్నారు. మరి ఏపీలో కాంగ్రెస్ కోలుకోవాలంటే ఏంచేయాలి..? ఎవరిని నాయకుడిగా తీసుకురావాలి..? ఆ దిశగా అధిష్టానం ఏం చేస్తోంది..? revanth reddy{#}revanth;Andhra Pradesh;Janasena;Telugu;TDP;YCP;Party;Congressఏపీ కాంగ్రెస్ బాధ్యతలు కూడా రేవంత్ రెడ్డికేనా..?ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు కూడా రేవంత్ రెడ్డికేనా..?revanth reddy{#}revanth;Andhra Pradesh;Janasena;Telugu;TDP;YCP;Party;CongressThu, 19 Aug 2021 07:22:15 GMTరాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ అవసాన దశకు వచ్చింది. పార్టీలో లీడర్లు క్రమక్రమంగా కనుమరుగయ్యారు. పక్క పార్టీల్లోకి వెళ్లేవారు వెళ్లిపోగా, మిగిలినవారు రిటైర్ అయిపోయారు. కాంగ్రెస్ లోనే పుట్టాం, కాంగ్రెస్ తోనే ఉంటాం.. అనే సెంటిమెంట్ ఉన్నవారు మాత్రమే అక్కడా, ఇక్కడా కొంతమంది హస్తం గుర్తుతోనే ఉన్నారు. మరి ఏపీలో కాంగ్రెస్ కోలుకోవాలంటే ఏంచేయాలి..? ఎవరిని నాయకుడిగా తీసుకురావాలి..? ఆ దిశగా అధిష్టానం ఏం చేస్తోంది..?

అఖిల భారత కాంగ్రెస్ కే.. అధ్యక్షుడు లేడు, ఇక ఏపీ అధ్యక్షుడి గురించి ఆలోచించేవారు ఉంటారా అని చాన్నాళ్లుగా అనుకుంటున్నారు. కానీ ఇటీవల ఏపీలో పార్టీ వ్యవహారంపై ఢిల్లీలో సీరియస్ గా చర్చ జరిగిందట. కొంతమంది సీనియర్లు సైతం హస్తిన వెళ్లి చర్చల్లో మునిగితేలారు. ఈ దశలో పీసీసీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించి, పార్టీ పదవుల విషయంలో కూడా స్పష్టత వస్తుందని అనుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఏపీ పీసీసీ పదవిని కూడా రేవంత్ రెడ్డికి అప్పగించి, రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే పీసీసీ ప్రకటిస్తారనే ప్రచారం కూడా మొదలైంది.

తెలంగాణలో పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి అప్పగించిన తర్వాత కాస్తో కూస్తో కాంగ్రెస్ లో చలనం వచ్చింది. రేవంత్ పదవిని వ్యతిరేకించినవారు సైతం, ఇప్పుడు కొంతమంది సర్దుకుపోతున్నారు. వరుసగా బహిరంగ సభలతో రేవంత్ హడావిడి చేస్తున్నారు. మరి ఏపీలో కూడా ఆ హడావిడి కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది..? ఏపీ బాధ్యతలు కూడా కొన్నాళ్లు రేవంత్ కి అప్పగిస్తే ఏమైనా మార్పులొస్తాయా..? ఈ విషయంపై కూడా ఇటీవల చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు ఎవరికి బాధ్యతలు అప్పగించినా కొత్తగా జరిగేది, ఒరిగేది ఏదీ లేదని తేలిపోయింది. ఇప్పటికే వైసీపీ పూర్తి స్థాయి మెజార్టీతో ఉంది. ప్రతిపక్ష పాత్రను నిలుపుకోడానికి టీడీపీ కష్టపడుతోంది. మధ్యలో బీజేపీ, జనసేన కూటమి కూడా ఉండనే ఉన్నాయి. ఈ దశలో కాంగ్రెస్ సరికొత్తగా ఏదైనా మొదలు పెడితేనే పార్టీకి బలం ఉంటుంది. పాత నాయకులంతా పార్టీలోకి వస్తారనే ఆశ లేకపోయినా ఆ దిశగా కదలిక మొదలు పెట్టాలని అధిష్టానం భావిస్తోంది. అందుకే రేవంత్ కి కొన్నాళ్లు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. మరి అధిష్టానం ఆదేశిస్తే రేవంత్ ఒప్పుకుంటారా, తెలుగు రాష్ట్రాలకు ఒకటే పీసీసీ అంటే ఏపీ నాయకులు అంగీకరిస్తారా..? వేచి చూడాలి.



ర‌మ్య‌కో న్యాయం? హ‌జీరాకో న్యాయ‌మా?

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>