PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/the-second-dose-is-to-be-taken-but-179db694-469f-4501-a1d7-09d901f23271-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/the-second-dose-is-to-be-taken-but-179db694-469f-4501-a1d7-09d901f23271-415x250-IndiaHerald.jpgభారత్ లో నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. మొదటి డోస్ తీసుకున్న వారు.. రెండో డోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అవి దొరక్క పోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. థర్డ్ వేవ్ హెచ్చరికలతో తెగ టెన్షన్ పడిపోతున్నారు. The second dose is to be taken but {#}Coronavirus;India;Governmentసెకండ్ డోస్ తీసుకోవాలని ఉంది.. కానీ..!సెకండ్ డోస్ తీసుకోవాలని ఉంది.. కానీ..!The second dose is to be taken but {#}Coronavirus;India;GovernmentThu, 19 Aug 2021 22:00:00 GMTభారత్ లో 3.86కోట్ల మంది రెండో డోసు కరోనా టీకా తీసుకోలేదని కంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో కొవిషీల్డ్ తీసుకోనివారే 3.4కోట్ల మంది ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం నాటికి 44.22కోట్ల మందికి తొలి డోసు.. 12.59కోట్ల మందికి రెండో డోసు వేశారు. కొవిషీల్డ్ తీసుకుంటే 84 నుండి 112 రోజుల తర్వాత, కొవాగ్జిన్ వేయించుకుంటే 28 నుండి 42రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాలి. ఇక సెకండ్ డోస్ ఉచితంగా దొరక్కపోతే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇక కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసుల కోసం ఇప్పుడే పరిగెత్తవద్దని శాస్త్రవేత్త గగన్ దీప్ కాంగ్ తెలిపారు. ఈ డోసు కరోనా నుంచి పూర్తి స్థాయి రక్షణ ఇవ్వదంటున్నారు. వ్యాధి తీవ్రత తగ్గించడంలో మాత్రం సహకరిస్తుందని ఆమె అన్నారు. అయితే అమెరికా, బ్రిటన్ లాంటి ధనిక దేశాలు ఇప్పటికే బూస్టర్ డోసుకు ఆమోదం తెలిపాయి. ఇజ్రాయేల్ కూడా ఇప్పటికే 10లక్షల మందికి బూస్టర్ డోస్ ఇచ్చింది.

మరోవైపు భారత్ లో కొత్తగా 36వేల 401కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 530 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 4లక్షల 33వేల 49కి పెరిగింది. కొత్తగా 39వేల 157మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఫలితంగా రికవరీల సంఖ్య 3కోట్ల 15లక్షల 25వేల 80కు చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 149రోజుల కనిష్టానికి చేరి.. 3లక్షల 64వేల 129గా ఉంది.

ఏపీలో రోజు వారీ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న తగ్గిన కేసులు.. ఈ రోజు పెరిగాయి. గత 24గంటల్లో 67వేల 716 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా వెయ్యి 501పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19లక్షల 98వేల 603కు చేరాయి. మరో 10మంది కోవిడ్ కు బలికాగా.. మొత్తం 13వేల 696మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15వేల 738 యాక్టివ్ కేసులున్నాయి.


ఇక తెలంగాణలో గత 24గంటల్లో 88వేల 306 కరోనా టెస్టలు చేయగా.. 409మందికి  పాజిటివ్ వచ్చినట్టు వైద్యఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు చనిపోయారని తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 54వేల 35కు చేరగా.. ఇప్పటి వరకు 3వేల 582మంది కరోనా కాటుకు బలయ్యారు. గత 24గంటల్లో 453మంది వైరస్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6వేల 865గా ఉంది.  














సరికొత్త గా అరియానా.. ఫోటో లు వైరల్!!

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>