PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/karanam60e77916-02bb-4bc9-9ff9-87ef77986293-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/karanam60e77916-02bb-4bc9-9ff9-87ef77986293-415x250-IndiaHerald.jpgగత ఎన్నికల నుంచి చీరాల రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే సాగుతున్నాయి. ఇక్కడ అధికార వైసీపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా జరుగుతుంది. చీరాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు కాస్త ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అందుకే 2014 ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్‌గా గెలవగలిగారు. ఇండిపెండెంట్‌గా గెలిచి ఆయన, నెక్స్ట్ టీడీపీలోకి వెళ్లారు. karanam{#}chirala;Parchoor;Addanki;Raccha;CBN;TDP;YCP;local language;Jagan;MLA;Marchకరణం ఫ్యామిలీ రూట్ మారుతుందా? ఆమంచికి సెట్ అవుతుందా?కరణం ఫ్యామిలీ రూట్ మారుతుందా? ఆమంచికి సెట్ అవుతుందా?karanam{#}chirala;Parchoor;Addanki;Raccha;CBN;TDP;YCP;local language;Jagan;MLA;MarchThu, 19 Aug 2021 00:00:00 GMTగత ఎన్నికల నుంచి చీరాల రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే సాగుతున్నాయి. ఇక్కడ అధికార వైసీపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా జరుగుతుంది. చీరాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు కాస్త ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అందుకే 2014 ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్‌గా గెలవగలిగారు. ఇండిపెండెంట్‌గా గెలిచి ఆయన, నెక్స్ట్ టీడీపీలోకి వెళ్లారు.

2019 ఎన్నికలోచ్చేసరికి ఆమంచి, టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరిపోయారు. అలాగే వైసీపీ తరుపున చీరాల అభ్యర్ధిగా బరిలో దిగారు. ఇదే సమయంలో చంద్రబాబు వ్యూహం మార్చి సీనియర్ నేత కరణం బలరాంని టీడీపీ తరుపున చీరాల బరిలో నిలబెట్టారు. అయితే జగన్ గాలిలో కూడా చీరాలలో కరణం మంచి మెజారిటీతో గెలిచారు. కానీ తర్వాత అనుహ్యా పరిణామాల మధ్య కరణం వైసీపీలోకి వచ్చేశారు.

ఇక ఇక్కడ నుంచే అసలు రచ్చ మొదలైంది. కరణం, ఆమంచి వర్గాలకు అసలు పొసగడం లేదు. వైసీపీ అధిష్టానం సర్ది చెప్పినా కూడా ఈ రెండు వర్గాల మధ్య పోరు ఆగడం లేదు. ఇలా రెండు వర్గాల మధ్య రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. పైగా ఇటీవల స్థానిక ఎన్నికల్లో కరణం, ఆమంచి వర్గాలు పోటాపోటిగా నామినేషన్లు వేసి బరిలో దిగాయి. దీంతో వైసీపీలో చీలిక వచ్చింది. అయితే ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ చీరాలలో వైసీపీకి ఇబ్బందులు తప్పవు.

అయితే నెక్స్ట్ చీరాల వైసీపీ టికెట్ ఎవరికి వస్తుందనేది సస్పెన్స్‌గా మారింది. ఒకరికి టికెట్ ఇస్తే, మరొక నాయకుడు వల్ల పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయం. కాకపోతే ఆమంచికి పర్చూరు లేదా అద్దంకి టికెట్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. కానీ ఆ రెండు చోట్ల వైసీపీ ఇంచార్జ్‌లు ఉన్నారు. ఒకవేళ రాజకీయ పరిస్తితులని బట్టి కరణం ఫ్యామిలీ మళ్ళీ టీడీపీలోకి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని ఆమంచి వర్గం మాట్లాడుతుంది. అప్పుడు ఆమంచికి చీరాల టికెట్ వస్తుందని అంటున్నారు. మరి చూడాలి కరణం, ఆమంచిలని జగన్ ఎలా సెట్ చేస్తారో?  



కరణం ఫ్యామిలీ రూట్ మారుతుందా? ఆమంచికి సెట్ అవుతుందా?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>