MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/thireaters-ott-moviess-reliceges9dff836b-45e4-4b27-b638-612c43b8eaae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/thireaters-ott-moviess-reliceges9dff836b-45e4-4b27-b638-612c43b8eaae-415x250-IndiaHerald.jpgఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకు అనేక రంగాలతో పాటు సినిమా పరిశ్రమ కూడ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకవైపు ఇటీవల కొన్నాళ్లుగా పలు సినిమాలు థియేటర్స్ లో విడుదలవుతున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరుచుకోకపోవడం అటు నిర్మాతలకు ఇటు బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కి కొంత ఇబ్బందిగా మారింది. మరోవైపు మన దేశంలో కొద్దిరోజులుగా మెల్లగా కరోనా కేసులు పెరుగుతుండడం తో థర్డ్ వేవ్ ముప్పు ఎప్పుడు వచ్చి మీద పడుతుందో అని అందరూ బిక్కు బిక్కుమంటున్నారు. ott releases{#}Nani;sudheer babu;Telugu;Audience;Ishtam;V;Tuck Jagadish;Cinema;Coronavirusమొహమాటం తో ఇరకాటంలో పెడుతున్నారు ..... ??మొహమాటం తో ఇరకాటంలో పెడుతున్నారు ..... ??ott releases{#}Nani;sudheer babu;Telugu;Audience;Ishtam;V;Tuck Jagadish;Cinema;CoronavirusThu, 19 Aug 2021 21:41:00 GMTఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకు అనేక రంగాలతో పాటు సినిమా పరిశ్రమ కూడ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకవైపు ఇటీవల కొన్నాళ్లుగా పలు సినిమాలు థియేటర్స్ లో విడుదలవుతున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో థియేటర్స్ తెరుచుకోకపోవడం అటు నిర్మాతలకు ఇటు బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కి కొంత ఇబ్బందిగా మారింది. మరోవైపు మన దేశంలో కొద్దిరోజులుగా మెల్లగా కరోనా కేసులు పెరుగుతుండడం తో థర్డ్ వేవ్ ముప్పు ఎప్పుడు వచ్చి మీద పడుతుందో అని అందరూ బిక్కు బిక్కుమంటున్నారు.

నిజానికి ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్స్ లోకి వచ్చినప్పటికి ఆడియన్స్ పూర్తి స్థాయిలో వచ్చి చూడడానికి కొంత జంకుతూనే ఉన్నారు. అందుకే ఇటువంటి పరిస్థితుల్లో తమ సినిమాలను థియేటర్స్ లోకి తీసుకువచ్చే  కంటే అదేదో ఓటిటి లో విడుదల చేస్తే కొద్దో గొప్పో అయినా లాభాలు వస్తాయని పలువురు నిర్మాతలు ఆ విధంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల సుధీర్ బాబు తో కలిసి చేసిన వి మూవీ ద్వారా ఓటిటి లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఆ సినిమాతో పరాజయాన్ని చవిచూశారు.

ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న తాజా సినిమా టక్ జగదీశ్ కూడా కొద్దిరోజుల్లో ఓటిటి బాట పట్టనుంది. ఈ విషయమై నిన్న తన ఫ్యాన్స్ కి ఒక ప్రకటన విడుదల చేసిన నాని, తనకి కూడా సినిమాలు థియేటర్స్ లోనే విడుదల చేయాలని ఉందని, అప్పుడే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ నుండి కూడా బాగా ఎంజాయ్ చేస్తారని, కానీ ప్రస్తుత ఈ కరోనా పరిస్థితుల్లో తమని నమ్ముకుని ఉన్న నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే తన టక్ జగదీశ్ మూవీని ఓటిటి కి ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు చెప్పారు.

నిజానికి ఈ కరోనా పరిస్థితుల వలన మొహమాటానికి పోయి తమ సినిమాలని థియేటర్స్ లో విడుదల చేస్తే కలెక్షన్స్ సరిగ్గా రావేమో అనే భయంతోనే కొందరు నిర్మాతలు వాటిని ఒటిటి లో విడుదల చేస్తున్నారని, అయితే ఆ పరిస్థితులతో హీరోలకు ఇరకాటం తప్పడం లేదనేది కొందరి వాదన. ఏది ఏమైనప్పటికీ ఈ కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయే వరకు సినిమా నిర్మాతల మనస్సులో ఈ భయం పోదని అంటున్నారు విశ్లేషకులు ....!!





చిరంజీవి వారికి స్వీట్ క్లాస్ పీకారా..?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>