PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/haryana9e579cd5-9c33-45f2-9732-22516dd68878-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/haryana9e579cd5-9c33-45f2-9732-22516dd68878-415x250-IndiaHerald.jpgచ‌దువు లేకున్నా రాష్ట్రాల‌ను పాలించిన ముఖ్య‌మంత్రులు ఉన్నారు మ‌న దేశంలో.. ఏ ఉద్యోగం అయినా ఆ ఉద్యోగానికి త‌గిన విద్యార్హ‌త త‌ప్ప‌నిస‌రి అని అంద‌రికి తెలుసు. కానీ మ‌న దేశ రాజ‌కీయాలు మాత్రం అందుకు భిన్నం ఎలాంటి విద్యార్హ‌త లేకున్నా ప్ర‌జా ప్ర‌తినిధులు కావొచ్చు, రాష్ట్రాల‌ను ప‌రిపాలించ‌వ‌చ్చు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్య‌మంత్రి ప‌దో త‌ర‌గ‌తి పాస్ కాకుండానే రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయ్యాడు. అదేంటి ప‌దో త‌ర‌గ‌తి పాస్ కాకుండానే ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయ్యాడా అని ఆశ్య‌ర్యం క‌లుగharyana{#}job;CBI86 ఏళ్ల వ‌య‌సులో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష రాసీన మాజీ సీఎం..86 ఏళ్ల వ‌య‌సులో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష రాసీన మాజీ సీఎం..haryana{#}job;CBIThu, 19 Aug 2021 10:10:00 GMT
హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా నిన్న పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్ష రాశాడు. 86 ఏండ్ల వయస్సు పదో తరగతి కంపార్ట్‌మెంట్‌ పరీక్షల‌కు హాజ‌ర‌య్యారుమాజీ ముఖ్య‌మంత్రి . హ‌ర్యానా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జేబీటీ రిక్రూట్‌మెంట్ కేసులో ఓం ప్ర‌కాశ్ చౌతాలా కు 2013లో సీబీఐ కోర్టు 10 సంవ‌త్స‌రాల జైలు శిక్ష కూడా విధించింది. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూనే పదో తరగతి పరీక్షలు రాశారు ఈ మాజీ ముఖ్య‌మంత్రి.

గ‌తంలో రాసిన ప‌రీక్ష‌ల్లో ఆయ‌న ఇంగ్లీష్ ప‌రీక్ష‌లో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత భివాని ఎడ్యుకేషన్ బోర్డు   12వ తరగతి ఓపెన్‌పరీక్షల‌కు  హాజ‌రయ్యారు. ఆగస్టు 5న 12 వ త‌ర‌గ‌తి పరీక్షల ఫలితాలు వచ్చాయి. కానీ చౌతాల ఫలితాన్ని బోర్డు ప్ర‌క‌టించ‌లేదు. పెండింగ్‌లో ఉన్న పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష పూర్తి చేస్తేనే ఫలితాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది ఇంట‌ర్ బోర్డ్. దీంతో సిర్సాలోని ఆర్య కన్య సీనియర్‌ సెకండరీ స్కూల్‌ పరీక్ష కేంద్రంలో కంపార్ట్‌ మెంట్‌ పరీక్షకు హాజ‌ర‌య్యారు ఓం ప్ర‌కాశ్ చౌతాలా.

ఈ సందర్భంగా అక్కడే ఉన్న విలేకరులు హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి ఓం ప్ర‌కాశ్ చౌతాలా ను పలు ప్రశ్నలు అడిగారు. దీని ఆయ‌న ప్రస్తుతం తాను విద్యార్థినని, నో కామెంట్స్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, చౌతా ఓ సహాయకుడిని పెట్టుకుని పరీక్ష రాయడం గ‌మ‌నార్హం. 2017లో తన 82 ఏండ్ల వయస్సులో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌లో 10వ తరగతి పరీక్ష రాసాడు ఓం ప్ర‌కాశ్ చౌతాలా. ఆ ప‌రీక్ష‌లో 53.4 శాతం మార్కులు సాధించారు. కానీ ఇంగ్లీష్ ప‌రీక్ష‌లో ఫేయిల్ అవ‌డంతో ఈ సారి ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి ఓం ప్ర‌కాశ్ చౌతాలా.





షాకింగ్ : చిన్నారికి టీకా.. నిమిషాల్లో మృతి?

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>