EditorialPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-f4d01478-41da-428e-8b62-a78c2b4dc2f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-f4d01478-41da-428e-8b62-a78c2b4dc2f5-415x250-IndiaHerald.jpgరాజమండ్రి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంకా చెప్పాలంటే... క్షణ క్షణం ఆసక్తికరంగా తయారైంది. కరుడుగట్టిన అభిమానులు కూడా తమ సొంత పార్టీలకు, పదవులకు రాజీనామా చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలను అధికార పార్టీ ప్రజాప్రతనిధులు కలుస్తున్నారు. గంటగంటకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టంగా రాజకీయం కూడా రంగులు మారుతోంది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. పార్టీ వ్యవస్థాపక నేతల్లో బుచ్చయ్య చౌదరి ఒకరు. వరుస విజయాలతో పాటు పార్టీలో కీలgorantla{#}ram kiran;WhatsApp;Kshanam;Tammudu;Thammudu;Y. S. Rajasekhara Reddy;Doctor;Godavari River;YCP;Rajahmundry;CBN;choudary actor;TDP;MLA;రాజీనామా;Minister;Party;Smart phoneరసవత్తరంగా రాజమండ్రి రాజకీయంరసవత్తరంగా రాజమండ్రి రాజకీయంgorantla{#}ram kiran;WhatsApp;Kshanam;Tammudu;Thammudu;Y. S. Rajasekhara Reddy;Doctor;Godavari River;YCP;Rajahmundry;CBN;choudary actor;TDP;MLA;రాజీనామా;Minister;Party;Smart phoneThu, 19 Aug 2021 12:58:00 GMTరాజమండ్రి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంకా చెప్పాలంటే... క్షణ క్షణం ఆసక్తికరంగా తయారైంది. కరుడుగట్టిన అభిమానులు కూడా తమ సొంత పార్టీలకు, పదవులకు రాజీనామా చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలను అధికార పార్టీ ప్రజాప్రతనిధులు కలుస్తున్నారు. గంటగంటకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టంగా రాజకీయం కూడా రంగులు మారుతోంది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. పార్టీ వ్యవస్థాపక నేతల్లో బుచ్చయ్య చౌదరి ఒకరు. వరుస విజయాలతో పాటు పార్టీలో కీలక పదవులు అనుభవించిన నేత గోరంట్ల. అయితే ప్రస్తుతం వయోభారంతో ఆయన రాజకీయాలకు దూరం కానున్నారు. ఈ విషయాన్ని గతంలో ఆయనే స్వయంగా ప్రకటించారు కూడా. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని... తనకు బదులుగా తన తమ్ముడు కుమారుడు డాక్టర్ రవి రామ్ కిరణ్ ఉంటారని కూడా ప్రకటించారు.

అయితే 2024 వరకు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తారని అంతా భావించినప్పటికీ... సరిగ్గా రెండేళ్లకే ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందుకు ఆయన అభిమానులు చెబుతున్న కారణాలు.. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న బుచ్చయ్య చౌదరి స్వయంగా ఫోన్ చేస్తే.. చంద్రబాబు సమాధానం ఇవ్వలేదట. కొంతకాలంగా పార్టీ అగ్రనాయకత్వం ఆయనతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తోందని... పైగా సీనియర్ అయినటువంటి ఆయనకు మంత్రి పదవి  ఇవ్వకుండా చంద్రబాబు పక్కన పెట్టారని కూడా ఆరోపిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ... పార్టీ అభివృద్ధి కోసం ఏడు పదుల వయసులో కూడా కృషి చేస్తున్న పెద్దాయనకు పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదని కూడా ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకత్వం వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన బుచ్చయ్య... పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారని వెల్లడించారు.

మరో వైపు టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూను రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ, రంగంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీనివాసరావులు ఆసుపత్రిలో పరామర్శించారు. గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన జ్యోతుల నెహ్రూ... అటు కాపు నేతల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఆటు బుచ్చయ్య చౌదరి రాజీనామా పుకార్లు, ఇటు జ్యోతుల నెహ్రూకు వైసీపీ నేతల పరామర్శతో రాజమండ్రి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జ్యోతుల నెహ్రూ మళ్లీ వైసీపీలో చేరతారా... బుచ్చయ్య భవిష్యత్తు ప్రణాళిక ఏమిటీ అనే ప్రశ్నలు ప్రస్తుతం ఈస్ట్ గోదావరి జిల్లాలోని వాట్సప్ గ్రూప్ లలో తెగ వైరల్ గా నడుస్తున్నాయి.





బ‌ర్త్ డేకు "మెగా" ట్రీట్ ఇదేనా..?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>