MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywoodb2c06c26-fff1-4f69-919f-9fca1662a04b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywoodb2c06c26-fff1-4f69-919f-9fca1662a04b-415x250-IndiaHerald.jpgగతంలో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ లో మొదటి సారిగా తికమక పరిస్థితి నెలకొంది. కరోనా పరిస్థితితో పాటు ఆంధ్రాలో టికెట్ల ధర సమస్యలు కూడా టాలీవుడ్ ను వేధిస్తున్నాయి. అయితే మొత్తానికి సినిమా థియేటర్లు రీఓపెన్ అయ్యాక పెద్ద సినిమాలు వరుసగా సంక్రాంతికి రిలీజ్ డేట్లను ప్రకటించాయి. తాజాగా "ఆర్ఆర్ఆర్" సినిమా వాయిదా పడే అవకాశం కన్పించడంతో ఇతర పెద్ద చిత్రాల నిర్మాతలు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం "ఆచార్య"ను అక్టోబర్ 13న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ముందుగా ఈ సినిమాను జనవరTollywood;{#}Chiranjeevi;Prabhas;mahesh babu;Rajamouli;Makar Sakranti;Ukraine;January;Cinema Theatre;October;March;Tollywood;kalyan;News;Cinema;Coronavirusటాలీవుడ్ లో గందరగోళం... తికమక తీరేదెప్పుడు ?టాలీవుడ్ లో గందరగోళం... తికమక తీరేదెప్పుడు ?Tollywood;{#}Chiranjeevi;Prabhas;mahesh babu;Rajamouli;Makar Sakranti;Ukraine;January;Cinema Theatre;October;March;Tollywood;kalyan;News;Cinema;CoronavirusThu, 19 Aug 2021 20:30:00 GMTగతంలో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ లో మొదటి సారిగా తికమక పరిస్థితి నెలకొంది. కరోనా పరిస్థితితో పాటు ఆంధ్రాలో టికెట్ల ధర సమస్యలు కూడా టాలీవుడ్ ను వేధిస్తున్నాయి. అయితే మొత్తానికి సినిమా థియేటర్లు రీఓపెన్ అయ్యాక పెద్ద సినిమాలు వరుసగా సంక్రాంతికి రిలీజ్ డేట్లను ప్రకటించాయి. తాజాగా "ఆర్ఆర్ఆర్" సినిమా వాయిదా పడే అవకాశం కన్పించడంతో ఇతర పెద్ద చిత్రాల నిర్మాతలు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం "ఆచార్య"ను అక్టోబర్ 13న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ముందుగా ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయడానికి టీమ్ ఆసక్తి చూపించింది. అయితే రాజమౌళి సినిమా విడుదల అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో అక్టోబర్ 13నే టార్గెట్ చేస్తోంది. ఒకవేళ జనవరి 12న "ఆచార్య" విడుదలైతే, పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" రిపబ్లిక్ డే కు వాయిదా పడుతుందని అంటున్నారు. ఆగస్టు 22న చిరంజీవి ఇచ్చే అప్డేట్ మీద అంతా ఆధారపడి ఉంది. మరోవైపు "భీమ్లా నాయక్" నిర్మాతలు సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం లేదని తేల్చేశారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఆగస్టు 22 వరకు వేచి చూడాల్సిందే.

ఇక సంక్రాంతికి రానున్న మరో సినిమా "ఎఫ్3". ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి రేస్ లో నిలుస్తుంది అంటూ ఇటీవల మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతికి కుదరకపోతే ఈ సినిమాను మార్చి 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం సంక్రాంతి రేసులో రెండు సినిమాలు మాత్రమే కచ్చితంగా నిలిచేలా కనిపిస్తోంది. ఒకటి ప్రభాస్ "రాధే శ్యామ్", మరొకటి మహేష్ బాబు "సర్కారు వారి పాట".

మరోవైపు "ఆర్ఆర్ఆర్" మూవీ విడుదల ఎప్పుడు? అంటూ అందరూ రాజమౌళి వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈరోజు టీమ్ మొత్తం ఉక్రెయిన్ నుంచి వచ్చేశారు. ప్రస్తుతం రాజమౌళి ప్రెస్ మీట్ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఈ కారణంగానే టాలీవుడ్లో ఈ గందరగోళం నెలకొంది. రాజమౌళి రిలీజ్ డేట్ పై ప్రకటన ఇస్తే మిగతా సినిమాల రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ వస్తుంది.



తెలుగుదేశంలో ఆగ‌స్టు ముస‌లం !

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>