MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-e0efe758-accb-40fc-8ae2-10ae4e3cc8ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-e0efe758-accb-40fc-8ae2-10ae4e3cc8ff-415x250-IndiaHerald.jpgపెద్ద హీరోలు ఏం చేయాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు. చిన్న హీరోలు నిర్మాత‌ల‌ను ఎలా కాపాడుకోవాలో తెలియ‌క తిక‌మ‌క ప‌డుతున్నారు. ఆచార్య సినిమా మొద‌లుకుని ఆర్ ఆర్ ఆర్ వ‌ర‌కూ పెద్ద సినిమాల‌ను ఏ వి ధంగా థియేట‌ర్ కు తేవాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు. ఈ తిక‌మ‌క మ‌క తిక ఇప్ప‌ట్లో పోదు. పోతుంద‌ని చెప్ప‌లేం కూడా!tollywood {#}V;Research and Analysis Wing;vegetable market;Cinemaశుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !tollywood {#}V;Research and Analysis Wing;vegetable market;CinemaThu, 19 Aug 2021 12:06:28 GMT
మెగాస్టార్ సూప‌ర్ స్టార్
ఎవ్వ‌రయినా ఒక్క‌టే
స్టార్లు లేరు ఈడ..

 
పెద్ద హీరోలు ఏం చేయాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు. చిన్న హీరోలు నిర్మాత‌ల‌ను ఎలా కాపాడుకోవాలో తెలియ‌క తిక‌మ‌క ప‌డుతున్నారు. ఆచార్య సినిమా మొద‌లుకుని ఆర్ ఆర్ ఆర్ వ‌ర‌కూ పెద్ద సినిమాల‌ను ఏ వి ధంగా థియేట‌ర్ కు తేవాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు. ఈ తిక‌మ‌క మ‌క తిక ఇప్ప‌ట్లో పోదు. పోతుంద‌ని చెప్ప‌లేం కూడా!ఎందుకంటే క‌రోనా ఉద్ధృతిని త‌గ్గేలా చేయాల్సింది కేంద్రం.. త‌గ్గించేందుకు స‌హ‌క‌రించాల్సింది రా ష్ట్రం..త‌గ్గిన త‌గ్గ‌కున్నా అస‌లు నియంత్ర‌ణ‌లు పాటించాల్సింది జ‌నం. ఇవేవీ స‌ర‌యిన స్థాయిలో జ‌ర‌గక పోవ‌డంతో వ్యాధి తీవ్ర‌త పెరుగుతుందే త‌ప్ప త‌గ్గిన దాఖ‌లాలు చాలా చాలా త‌క్కువ.

చిన్న సినిమాలు సైతం
మోయ‌లేని భారం

మోస్త‌రు బ‌డ్జెట్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే సినిమాల‌కు కూడా క‌ష్టాలు త‌ప్పేలా లేవు. వారు కూడా థియేట‌ర్ రిలీజ్ వ‌ద్ద‌ని, ఓటీ టీనే బెట‌ర్ అని భావిస్తున్నారు. దీంతో చాలా కంటెంట్ ను ఆశించి మార్కెట్లోకి వ‌చ్చే డిజిట‌ల్ మీడియాల‌కు ఇదొక వ‌ర‌మే కానీ సినిమాను న‌మ్ముకున్న అనేక కుటుంబాల‌కు ఇదొక శాపం. కోట్ల‌లో జ‌రిగే వ్యాపారంలో ఇష్టాయిష్టాలు క‌న్నా లాభ న‌ష్టాలే ము ఖ్యం. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌, ఆహా, అమేజాన్  పోటీ ప‌డి మ‌రీ కంటెంట్ కొంటున్నాయి స‌రే రేప‌టి వేళ వీళ్లంతా అదే వేగంగా సిని మాను  ఆదుకుంటారా...ఆగిపోయే సినిమాల‌కూ, ఆగి,ఆగి  న‌డుస్తున్న సినిమాల‌కూ, స‌రిగా మార్కెట్ లేని సినిమాల‌కూ ఒకే విధంగా స‌మ‌స్య‌లు ఉన్నా యి. వీటిని దాటుకుని సినీ నిర్మాణం, ప్ర‌ద‌ర్శ‌న అన్న‌ది క‌ష్టంతో కూడిన ప‌ని. మార్కెట్ లో పెద్ద సినిమా లు నాలుగు డ‌బ్బులు తెచ్చుకున్నా అవి కూడా సేఫ్ అని చెప్ప‌లేం. ఏదేమయినా ముందున్న కాలంలో చిన్న సిని మా చ‌చ్చిపో వ‌డం ఖాయం. పెద్ద సినిమాలు థియేట‌ర్ల‌కు రాకుంటే ప్ర‌ద‌ర్శ‌న వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పులు రావ‌డం కూడా త‌థ్యం. ఇప్పుడు స‌రే! ముందుగా మీ సినిమాకు మంచి టాక్ వ‌స్తేనే , వ్యూయ‌ర్ షిప్ వ‌స్తేనే డబ్బులు చెల్లిస్తాం లేదంటే లేదు..అని చెబుతున్న సంస్థ‌లూ ఉన్నాయి.క‌నుక ఈ జూదంలో సినిమా రంగం ఎలా నెగ్గుకు వ‌స్తుందో అన్న‌దే ఆస‌క్తిదాయ‌కం.



ఆ మూడు దేశాలకు ముచ్చెమటలు..!

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?

తెలంగాణలో కొత్త పార్టీలు రావడానికి కారణం కేసీఆరేనా..?

షాకింగ్ : చిన్నారికి టీకా.. నిమిషాల్లో మృతి?

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>