PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mansas-5fce9f23-a551-41d9-852c-17e230e022a4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mansas-5fce9f23-a551-41d9-852c-17e230e022a4-415x250-IndiaHerald.jpgవైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వివాదాస్పద అంశం ఏదైనా ఉందంటే... అది మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారమే. ముందుగా ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును తొలగించిన జగన్ సర్కార్... ఆ స్థానంలో ఆయన అన్న కుమార్తె సంచయిత గజపతి రాజును నియమించింది. నాటి నుంచి మాన్సాస్ ట్రస్ట్ వివాదం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ట్రస్ట్ పరిధిలోని ఆలయాల పరిరక్షణ, భూములు, విద్యా సంస్థల నిర్వహణ కూడా వివాదాలకు ఆజ్యం పోసింది. అయితే ఈ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకోవడంతో... మళ్లీ ఆ సMansas{#}ashok;Simhachalam;High court;king;central government;Jagan;October;Minister;Letterబాబోయ్ నన్ను తప్పించమంటున్న మాన్సాస్ ఈవోబాబోయ్ నన్ను తప్పించమంటున్న మాన్సాస్ ఈవోMansas{#}ashok;Simhachalam;High court;king;central government;Jagan;October;Minister;LetterThu, 19 Aug 2021 11:21:00 GMTవైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వివాదాస్పద అంశం ఏదైనా ఉందంటే... అది మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారమే. ముందుగా ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును తొలగించిన జగన్ సర్కార్... ఆ స్థానంలో ఆయన అన్న కుమార్తె సంచయిత గజపతి రాజును నియమించింది. నాటి నుంచి మాన్సాస్ ట్రస్ట్ వివాదం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ట్రస్ట్ పరిధిలోని ఆలయాల పరిరక్షణ, భూములు, విద్యా సంస్థల నిర్వహణ కూడా వివాదాలకు ఆజ్యం పోసింది. అయితే ఈ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకోవడంతో... మళ్లీ  ఆ స్థానంలో అశోక్ గజపతి రాజు కూర్చున్నారు. అయితే ఈ వివాదానికి సింహాచలం దేవస్థానం భూముల వ్యవహారం కూడా తోడవ్వడంతో రోజు రోజుకూ ముదురుతోంది. చివరికి ప్రస్తుత మాన్సాస్ ట్రస్ట్ ఈవో మెడకు ఈ ఉచ్చు బిగుస్తోంది.

మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతల నుంచి తనను తప్పించాలని కోరుతూ ప్రస్తుత ఈవో డి.వెంకటేశ్వరరావు స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. డిప్యుటేషన గడువు సమీపిస్తున్నందున... తనను తన మాతృశాఖ  అయిన రెవెన్యూ శాఖకు తిరిగి పంపించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. గతేడాది అక్టోబర్ 23 నుంచి మాన్సాస్ ట్రస్ట్ ఈవోగా వెంకటేశ్వరరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆనవాయితీ ప్రకారం సింహాచలం దేవస్థానం ఈవోగా పని చేసిన వారే ట్రస్టుకు కూడా  ఇన్ ఛార్జ్ గా వ్యవహరించేవారు. అయితే పది నెలలుగా పూర్తిస్థాయి ఈవోగా వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారు. ఏడాది పాటు డిప్యుటేషన్ పై ఉన్న ఆయన పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్ 22తో పూర్తి కానుంది. కానీ గడువు కంటే ముందే తనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. ట్రస్టు విద్యాసంస్థల ఉద్యోగుల జీతాల చెల్లింపు వ్యవహారంలో ఈవో చర్యలను హైకోర్టు తప్పుపట్టింది. బ్యాంకు ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం లేకుండా ఈవో వెంకటేశ్వరరావు వ్యవహరించారు. దీనిని హైకోర్టు సస్పెండ్ చేసింది. అదే సమయంలో ఈవో వ్యవహారంపై ప్రస్తుత మాన్సాస్ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పదవి నుంచి తప్పించాలంటూ వెంకటేశ్వరరావు లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది.





ఆక్సిజన్ కొరత లేదన్న కేంద్ర మంత్రి

తెలంగాణలో కొత్త పార్టీలు రావడానికి కారణం కేసీఆరేనా..?

షాకింగ్ : చిన్నారికి టీకా.. నిమిషాల్లో మృతి?

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>