PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/america-labs4f72f8d1-6581-499b-9960-7a09d1da6733-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/america-labs4f72f8d1-6581-499b-9960-7a09d1da6733-415x250-IndiaHerald.jpgఅగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. తగ్గినట్లే కనిపించిన కొవిడ్ భూతం.. ఇప్పుడు మళ్లీ జడలు విప్పింది. ప్రజలపై విరుచుకుపడుతోంది. ఏడాదిన్నర గడుసున్నా కూడా... ప్రపంచం ఇప్పటికీ వైరస్ గుప్పిట్లోనే చిక్కుకుని విలవిలలాడుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ... వైరస్ బాధితుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. అదుపులోకి వచ్చినట్లే కనిపించిన వైరస్... ఇప్పుడు డెల్టా వంటి కొత్త రకాలు రావడంతో... వైరస్ తీవ్రత మరోసారి పెరుగుతోంది. దీంతో రోజువారి కొవిడ్ మరణాల సంఖ్య అమెరికాలో మళ్లీ వెయ్America{#}Coronavirusఅమెరికాలో గంటకు 42 మంది మృతిఅమెరికాలో గంటకు 42 మంది మృతిAmerica{#}CoronavirusThu, 19 Aug 2021 06:15:00 GMTఅగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. తగ్గినట్లే కనిపించిన కొవిడ్ భూతం.. ఇప్పుడు మళ్లీ జడలు విప్పింది. ప్రజలపై విరుచుకుపడుతోంది. ఏడాదిన్నర గడుసున్నా కూడా... ప్రపంచం ఇప్పటికీ వైరస్ గుప్పిట్లోనే చిక్కుకుని విలవిలలాడుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ... వైరస్ బాధితుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. అదుపులోకి వచ్చినట్లే కనిపించిన వైరస్... ఇప్పుడు డెల్టా వంటి కొత్త రకాలు రావడంతో... వైరస్ తీవ్రత మరోసారి పెరుగుతోంది. దీంతో రోజువారి కొవిడ్ మరణాల సంఖ్య అమెరికాలో మళ్లీ వెయ్యి దాటేసింది. అగ్రరాజ్యంలో కొవిడ్ కారణంగా గంటకు 42 మంది మృతి చెందుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయం అమెరికాను కలవరపరుస్తోంది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు. దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అమెరికాలో వైరస్ తీవ్రత కాస్త తగ్గింది. గతంలో ఓ దశలో ప్రతి రోజు లక్ష వరకు కేసులు నమోదయ్యాయి. ఆ సంఖ్య ఇప్పుడు వేలల్లోకి పడిపోయింది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మాస్కులు కూడా లేకుండా ప్రజలు తిరిగేస్తున్నారు. అయితే నెల రోజులుగా మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. అలాగే మరణాల రేటు కూడా అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోంది. ప్రస్తుతం సగటున 769 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు కరోనా కారణంగా మొత్తం 6 లక్షల 22 వేల మందికి పైగా మృతి చెందారు. కొద్దిరోజులుగా వైరస్ తీవ్రత పెరగడంతో... ఆసుపత్రుల్లో ఇన్ పేషంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. రెండు వారాల్లో 70 శాతం పైగా ఇన్ పేషంట్ల సంఖ్య పెరిగినట్లు అమెరిక వైద్య శాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని... ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నేషనల్ ఇనిస్టిట్యూచ్ ఆఫ్ హెల్త్... ఎన్ఐహెచ్ హెచ్చరించింది. ముఖ్యంగా వ్యాక్సినే తీసుకోని వారు మరింత జాగ్రత్తగా ఉండాలని... వారు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించింది.





అమెరికాలో గంటకు 42 మంది మృతి

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>