HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/covid-19-brain-dfficet0ca8a996-7a93-4d86-8bf7-541dd391d165-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/covid-19-brain-dfficet0ca8a996-7a93-4d86-8bf7-541dd391d165-415x250-IndiaHerald.jpgకరోనా వచ్చిన తర్వాత ఎవరు..? ఎలాంటి..? పరిస్థితులను ఎదుర్కొంటున్నారో కూడా తెలియని సందర్భాలు ఏర్పడుతున్నాయి .అయితే ఇటీవల జరిపిన ఒక పరిశోధనలో విస్తుపోయే నిజం బయటపడింది. కాగ్నిటివ్ బిహేవియరల్ న్యూరాలజిస్ట్ తెలిపిన సమాచారం మేరకు కొవిడ్-19 సోకినవారిలో మందకొడిగా అనిపించడం, మెదడు పనిచేయకపోవడం, చురుకుదనం లేకపోవడం వంటివి సంభవిస్తున్నట్లు తెలపడం జరిగింది. దీనిని వైద్య శాస్త్ర ప్రకారం బ్రెయిన్ ఫాగ్ అని అంటారు. అంతేకాదు కొవిడ్-19 సోకిన వారిలో మెదడుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతున్నాయని రుజువైందిCOVID-19;BRAIN;DFFICET{#}Heart;oil;oxygen;Nijam;Newsకొవిడ్ -19 మెదడుపై ప్రభావం చూపుతుందా..?కొవిడ్ -19 మెదడుపై ప్రభావం చూపుతుందా..?COVID-19;BRAIN;DFFICET{#}Heart;oil;oxygen;Nijam;NewsThu, 19 Aug 2021 08:45:16 GMTకరోనా వచ్చిన తర్వాత ఎవరు..? ఎలాంటి..? పరిస్థితులను ఎదుర్కొంటున్నారో కూడా తెలియని సందర్భాలు ఏర్పడుతున్నాయి .అయితే ఇటీవల జరిపిన ఒక పరిశోధనలో విస్తుపోయే నిజం బయటపడింది. కాగ్నిటివ్ బిహేవియరల్ న్యూరాలజిస్ట్ తెలిపిన సమాచారం మేరకు కొవిడ్-19 సోకినవారిలో మందకొడిగా అనిపించడం, మెదడు పనిచేయకపోవడం, చురుకుదనం లేకపోవడం వంటివి సంభవిస్తున్నట్లు తెలపడం జరిగింది.

దీనిని వైద్య శాస్త్ర ప్రకారం బ్రెయిన్ ఫాగ్ అని  అంటారు. అంతేకాదు కొవిడ్-19 సోకిన వారిలో మెదడుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతున్నాయని రుజువైంది. అందులో భాగంగానే మెదడుకు సరిగా ఆక్సిజన్ అందకపోవడం, మెదడువాపు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఇటీవల ఒక అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక చైనీస్ పరిశోధకుల ప్రకారం నిరంతర దృష్టిలో బలహీనత వంటి ప్రభావాలు ఏర్పడడం, దృష్టి కొంచెం లోపించడం వంటివి కూడా జరగవచ్చు అని పరిశోధకులు వెల్లడించడం జరిగింది.

ఇక అంతే కాదు దీర్ఘకాలిక ప్రభావాలను కూడా అవయవాల వ్యవస్థపై చూడవచ్చు అని పరిశోధకులు తెలుపుతున్నారు. శరీర నొప్పులు, వ్యాయామం చేయలేక పోవడం ,నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తలనొప్పి ,అలసట వంటి దీర్ఘకాలిక లక్షణాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది . ఇక మరికొన్ని సమస్యల్లో ఊపిరితిత్తులు, గుండె వంటి అవయవాలకు శాశ్వత నష్టం కూడా కలగవచ్చు. అయితే ఇవన్నీ కూడా కొవిడ్-19 సోకిన తర్వాత ఎవరైతే బ్రెయిన్ ఫాగ్ తో బాధపడుతుంటారో, వారికి మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తాయి అని స్పష్టం చేశారు.

ఇకపోతే ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి తెలుసుకుందాం..

ముఖ్యంగా మీరు గనక బ్రెయిన్ ఫాగ్ సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి , మీరు అనుభవిస్తున్న అన్ని లక్షణాలను వారితో పంచుకోవాలి. ఎంత త్వరగా మీ సమస్యను వైద్యులకు చెబుతారో.. అంతే త్వరగా సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఇక పూర్తిగా క్లియర్ చేయడానికి మీరు చేయవలసిందల్లా ఏరోబిక్ వ్యాయామం..ప్రతిరోజూ చేయడం ప్రారంభించాలి. సాధారణంగా ఒక రోజుకు 30 నిమిషాల పాటు చేస్తూ, వారానికి ఐదురోజులు ఈ ఏరోబిక్ వ్యాయామం చేయవలసి ఉంటుంది.

తీసుకునే ఆహారంలో గింజలు ,కూరగాయలు, పండ్లు, ఆలివ్ ఆయిల్ ,బీన్స్, ధాన్యాలు వంటివి ప్రతిరోజూ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి.

మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజుకు కావలసిన నిద్ర అంటే రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ శరీరాన్ని మనస్సును ఉత్తేజితం చేసుకుంటూ ఉండాలి.. ఇలాంటివి కనుక చేసినట్లయితే సమస్యల నుంచి బయటపడవచ్చు.





మీ జీతాలు పెరిగాయ్.. ఆ విషయం మీకు తెలుసా..?

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>