MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bandla-ganesh85108a2b-2fbf-41d5-958b-37a8caa7acab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bandla-ganesh85108a2b-2fbf-41d5-958b-37a8caa7acab-415x250-IndiaHerald.jpgమా ఎన్నికలపై టాలీవుడ్ నటుడు, నిర్మాత‌ బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాఎన్నికల్లో బండ్ల గణేష్ తన మద్దతును ప్రకాష్ రాజ్ కు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.... మా కు శాశ్వత భవనం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరూ మా కు శాశ్వత భవనం అనే ఎజెండాతో ముందుకు వస్తున్నారని అన్నారు. కానీ మా లో సభ్యులుగా తొమ్మిది వందల మంది వరకు ఉన్నారని వ్యాఖ్యానించారు. వారికి సరైన ఆర్థిక స్థోమత లేక ప్రతి నెల ఎన్నో ఇబ్బందులు bandla ganesh{#}Prakash Raj;bandla ganesh;manchu vishnu;Industry;Elections;House;Tollywood;Cinema"మా"కు భవనం అవసరం లేదు..మంచు విష్ణుకు బండ్ల షాక్.. ?"మా"కు భవనం అవసరం లేదు..మంచు విష్ణుకు బండ్ల షాక్.. ?bandla ganesh{#}Prakash Raj;bandla ganesh;manchu vishnu;Industry;Elections;House;Tollywood;CinemaThu, 19 Aug 2021 20:27:00 GMTమా ఎన్నికలపై టాలీవుడ్ నటుడు, నిర్మాత‌ బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాఎన్నికల్లో  బండ్ల గణేష్ తన మద్దతును ప్రకాష్ రాజ్ కు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.... మా కు శాశ్వత భవనం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరూ మా కు శాశ్వత భవనం అనే ఎజెండాతో ముందుకు వస్తున్నారని అన్నారు. కానీ మా లో సభ్యులుగా తొమ్మిది వందల మంది వరకు ఉన్నారని వ్యాఖ్యానించారు. వారికి సరైన ఆర్థిక స్థోమత లేక ప్రతి నెల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. 

తన ఉద్దేశం ప్రకారం మా బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ. 20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఉచితంగా ఇస్తే ఎంతో బాగుంటుందని చెప్పారు. మన హీరోలు కూడా పేద క‌ళాకారుల‌కు ఇల్లు నిర్మించేందు స‌హాయం చేయ‌డానికి ముందుకు వస్తారని బండ్లగణేష్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మా కు శాశ్వత భవనం లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదని అన్నారు. సినిమా షూటింగ్ లు నిలిచిపోవని.. సినిమాలు చూసే వాళ్ళు కూడా తగ్గి పోర‌ని సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే ముందు నుండి మంచు విష్ణు మా కు తన సొంత డబ్బులతో భవనం నిర్మిస్తానని చెబుతూ వ‌స్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల చేసిన‌ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉంటే ఈసారి మా ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల తేదీని వీలైనంత త్వ‌ర‌గా ప్రకటించాల‌ని స‌భ్యులు కోరుతున్నారు. మరోవైపు ఒకరిపై మ‌రొక‌రు విమర్శలు చేసుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

అంతేకాకుండా ఈసారి పోటీ పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ తో పాటు మంచు విష్ణు నటి హేమ, జీవిత, సీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే ప్రకాష్ రాజ్ కు ఇండస్ట్రీలో ఎక్కువ మద్దతు ఉన్నట్టు కనిపిస్తోంది. దాంతో ప్రకాష్ రాజ్ గెలిచేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



విధిలేని పరిస్థితుల్లో పిల్లలను విసిరేస్తున్నారు..!

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>