PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban75812d1a-1510-4134-b5c5-4ef7aa54acfc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban75812d1a-1510-4134-b5c5-4ef7aa54acfc-415x250-IndiaHerald.jpgఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు రోజు రోజుకి వేగంగా మారుతున్నాయి. తాలీబాన్ లు ప్రజలను హింసించేది లేదని చెప్తూ తమకు నచ్చిన విధంగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను స్వాధీనం చేసుకున్న కొన్ని రోజుల తరువాత తాలిబాన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంతో అన్ని దిగుమతులు మరియు ఎగుమతులను నిలిపివేసింది తాలీబాన్ ప్రభుత్వం. భారత ఎగుమతి సంస్థ (FIEO) ఫెడరేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ సహాయ్ మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. పాకిస్తాన్ రవాణా మార్గాల ద్వారా మనకు వచ్చే, వెళ్ళtaliban{#}Capital;Pakistan;Director;India;Manam;Doctorభారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?taliban{#}Capital;Pakistan;Director;India;Manam;DoctorThu, 19 Aug 2021 13:32:13 GMTఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు రోజు రోజుకి వేగంగా మారుతున్నాయి. తాలీబాన్ లు ప్రజలను హింసించేది లేదని చెప్తూ తమకు నచ్చిన విధంగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను స్వాధీనం చేసుకున్న కొన్ని రోజుల తరువాత తాలిబాన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంతో అన్ని దిగుమతులు మరియు ఎగుమతులను నిలిపివేసింది తాలీబాన్ ప్రభుత్వం. భారత ఎగుమతి సంస్థ (FIEO) ఫెడరేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ సహాయ్ మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.

పాకిస్తాన్ రవాణా మార్గాల ద్వారా మనకు వచ్చే, వెళ్ళే సరుకుల రవాణాను తాలీబాన్ లు నిలిపివేసారని... వివరించారు. "ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలను మేము నిశితంగా గమనిస్తున్నాము. అక్కడి నుండి దిగుమతులు పాకిస్తాన్ రవాణా మార్గం ద్వారా వస్తున్నాయి. ఇప్పటి వరకు, తాలిబాన్లు పాకిస్తాన్‌కు సరుకు రవాణాను నిలిపివేశాయి, కాబట్టి దిగుమతులు ఆగిపోయాయి" అని సహాయ్ వివరించారు. ఆఫ్ఘనిస్తాన్ కు ప్రస్తుతం అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో భారతదేశం ఒకటిగా ఉంది.

ఆ దేశంలో మన దేశం భారీగా పెట్టుబడులు కూడా పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్‌ కు మన  ఎగుమతుల విలువ 2021 నాటికి $ 835 మిలియన్ డాలర్లు గా ఉందని వివరించారు. మనం సుమారు  510 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నాము అని ఆయన పేర్కొన్నారు. వాణిజ్యం మాత్రమె కాకుండా  కాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌ లో మనకు గణనీయమైన పెట్టుబడి ఉందని వివరించారు.

 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించి పనులు జరుగుతున్నాయని మీడియాకు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌ కు చక్కెర, ఫార్మాస్యూటికల్స్, దుస్తులు, టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు మరియు ట్రాన్స్‌మిషన్ టవర్‌ లను మన దేశం నుంచి ఎగుమతి చేస్తున్నారు. అక్కడి నుంచి మనం చేసుకునే దిగుమతులు ప్రధానంగా డ్రై ఫ్రూట్‌లకు సంబంధించినవి అని ఆయన చెప్పుకొచ్చారు.



25 నిమిషాల సీన్ ని సింగిల్ టేక్ లో పూర్తి చేసిన స్టార్ హీరోయిన్..!

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>